Investments in AP : ఆంధ్రప్రదేశ్‌కి మరో 65 వేల కోట్లు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒప్పందాలు
ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
- సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) వేదికగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేసి 18 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం తాజా ఒప్పందాలను కుదుర్చుకుంది.
- Download Current Affairs PDFs Here
- ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ సంస్థతో ప్రభుత్వం మే 23 (సోమవారం) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్క గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్లైంది.
- కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్‌కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒప్పందం జరిగింది. దీని కోసం రూ.37 వేల కోట్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.28 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వీటితోపాటు మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- Badminton: థామస్ కప్ టీమ్ టోర్నమెంట్ చాంపియన్ భారత్
Published date : 25 May 2022 07:07PM