హైదరాబాద్‌లో House of France
Sakshi Education
తెలంగాణ, ఫ్రాన్స్ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ బృందం సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్ బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరార్డ్ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
Published date : 30 Sep 2022 06:13PM