Old Age Home : సిద్దిపేటలో ప్రభుత్వ వృద్ధాశ్రమం
Sakshi Education
సిద్దిపేటజోన్: అందరూ ఉండి ఏకాకులుగా మారిన వారు కొందరైతే.. విధి వక్రించి ఒంటరి జీవనం గడిపే వారు మరికొందరు.
వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సుమారు కోటి రూపాయల నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధిలోని మిట్టపల్లి గ్రామ శివార్లలో సుమారు ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు స్థల పరిశీలన పూర్తి చేశారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
Also read: Quiz of The Day (October 15, 2022): కేన్సర్‌కు కారణమయ్యే భార లోహం ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 15 Oct 2022 03:20PM