Esperer Nutrition: దేశంలో తొలి క్యాన్సర్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటైంది?
పరిశోధన ఆధారిత క్లినికల్ న్యూట్రిషన్ కంపెనీ ఎస్పెరర్ న్యూట్రిషన్.. దేశంలో తొలిసారిగా క్యాన్సర్ న్యూట్రిషన్ రిసెర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసింది. ‘క్యాన్సర్ వంటి సంక్రమించని వ్యాధులను అధిగమించాలంటే పోషకాలతో కూడిన ఆహారం అవసరం. ఇందుకు పరిష్కారాన్ని కనుగొనడానికి కఠినమైన క్షేత్ర, ప్రయోగశాల అధ్యయనాలను నిర్వహించడం ద్వారా క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది’ అని సెప్టెంబర్ 16న కంపెనీ తెలిపింది.
రాష్ట్రంలో గోల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్న దేశీయ సంస్థ?
ఆభరణాల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ దిగ్గజసంస్థ మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.750 కోట్లతో బంగారు, వజ్రాభరణాల తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై చర్చించేందుకు మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్‌తో కూడిన ప్రతినిధి బృందం సెప్టెంబర్ 15న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది.
చదవండి: దేశంలో తొలిసారిగా ఆకాశమార్గం ద్వారా వ్యాక్సిన్‌ను ఎక్కడ సరఫరా చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి క్యాన్సర్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటైంది?
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ఎస్పెరర్ న్యూట్రిషన్ కంపెనీ
ఎక్కడ : శామీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : కఠినమైన క్షేత్ర, ప్రయోగశాల అధ్యయనాలను నిర్వహించడం ద్వారా క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా...