Skip to main content

Dovely Bike Taxi Services: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం

Dovely Bike Taxi Services
  • హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గపోయింది. ఎంఎంటీఎస్‌ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. మెట్రోరైలు ఉన్నా రాత్రి వేళలో సర్వీసులు లేవు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు. 

మహిళలు.. మహిళలు

  • నగరానికి చెందిన జైనాబ్‌ కాతూన్‌, ఉజ్మా కాతూన్‌, మసరట్‌ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్‌ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్‌ బైక్‌ (బైక్‌ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్‌గా మహిళలే ఉండగా ఇందుగా కస​​​​​‍్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి.

సెక్యూరిటీ కీలకం

  • శాంతిభద్రతలు ఎంతగా మెరుగైనా ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో సరికొత్త సవాళ్లు ఉదయిస్తూనే ఉన్నాయి. అందుకే విమెన్‌ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ డోవ్లీని అందుబాటులో తెచ్చారు. రైడ్‌ మొదలైనప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్‌ చేస్తుంటారు. అప్పటి వరకు రైడర్‌ లైవ్‌ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. 

వాట్సాప్‌ వేదికగా

  • వాట్సాప్‌ వేదికగా డోవ్లీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డోవ్లీ పేరుతో యాప్‌ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్లలో అందుబాటులోకి తేలేదు. ప్రస్తుతం డోవ్లీలో కస్టమర్ల సంఖ్య నాలుగు వందలు ఉండగా రైడర్ల సంఖ్య ఇరవైకి పైగా ఉన్నారు. అతి త్వరలోనే రైడర్ల సంఖ్యను రెండు వందల వరకు తీసుకుళ్లి నగరంలో విరివిరిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Jun 2022 05:49PM

Photo Stories