Skip to main content

Andhra Pradesh: నాబార్డ్‌ రాష్ట్ర క్రెడిట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022–23

Nabards State Focus Paper


2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డ్‌ రూపొందించిన స్టేట్‌ ఫోకస్‌ పత్రాన్ని మార్చి 2న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఫోకస్‌ పత్రంలో 2021–22 ఏడాదితో పోలిస్తే పది శాతం పెరుగుదల ఉంది. 2022–23 ఆర్థిక ఏడాదికి రూ.2,54,357.08  కోట్ల రాష్ట్ర వార్షిక రుణ అంచనాగా పేర్కొంది. ఇందులో మొత్తం వ్యవసాయ రంగానికి 1,71,040.98 కోట్ల రుణ ఆవశ్యకత ఉంటుందని నాబార్డ్‌ అంచనా వేసింది. ప్రస్తుతం నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌–NABARD) చైర్మన్‌గా డాక్టర్‌ చింతల గోవిందరాజులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

నాలుగు దేశాలకు ఏపీ అధికారులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన క్షేమంగా ఇక్కడికి చేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావడానికి ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. హంగేరీకి ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు, ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి ఎస్‌.వెంకట్, పోలండ్‌కు యూరప్‌ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రరెడ్డి, రొమేనియాకు  ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

చ‌ద‌వండి: జగనన్న తోడు మూడో విడత కింద ఎంత మొత్తాన్ని విడుదల చేశారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 01:43PM

Photo Stories