Skip to main content

YSR Rythu Bharosa-PM Kisan Scheme: నాలుగో ఏడాది తొలి విడత సాయం

Rythu Bharosa - PM Kisan

రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా మే నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి మే 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.

GK Important Dates Quiz: ప్రపంచ NGO దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?

ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేశారు. 2022–23 ఏడాది పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద ఈ ఏడాది రూ.7,020 కోట్లు కేటాయించింది.​​​​​​​Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిను నిర్మించారు?​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 May 2022 11:52AM

Photo Stories