Andhra Pradesh: గోప్రదక్షిణ మందిరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని అక్టోబర్ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి అందించిన రూ.15 కోట్ల విరాళంతో టీటీడీ దీనిని నిర్మించింది. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
చిన్న పిల్లల ఆస్పత్రికి శ్రీకారం
తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అలాగే అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.25 కోట్లతో ఈ పైకప్పును నిర్మించింది.
చదవండి: యాంబర్ ఏసీ తయారీ యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అలిపిరి శ్రీవారి పాదాల మండపం, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎందుకు : గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్