Skip to main content

Yoga Day: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 25 రోజుల ‘యోగా డే’ కౌంట్‌డౌన్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్‌ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్‌డౌన్‌ సందర్భంగా మే 27న‌ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు.
 Secunderabad Parade Ground

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ దీపావళి, ఉగాదిలాగా యోగా కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగా చేయాలని సూచించారు. కౌంట్‌డౌన్‌కు హైదరాబాద్‌ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు.  

యోగా మన జీవన విధానం: కిషన్‌రెడ్డి 
మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా మన జ్ఞాన సంపద, జీవన విధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. జూన్‌ 21న యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో యోగా చేస్తారని, ఆరోజు మన దేశంలోనూ ప్రతిఒక్కరూ యోగా చే యాలన్నారు.

Vande Bharat express: సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ మధ్య వందేభారత్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 13 నుంచి దేశవ్యాప్తంగా వంద రోజులపాటు యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు హైదరాబాద్‌లో 25 రోజుల కౌంట్‌డౌన్‌ నిర్వహిస్తున్నామన్నా­రు. కేంద్ర మంత్రి సోనోవాల్‌ మాట్లాడుతూ, యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనసు సుసంపన్నం అవుతుందని అన్నారు.
జూన్‌ 21న మైసూర్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.  

Weekly Current Affairs (Awards) Quiz (07-13 May 2023)

Published date : 29 May 2023 04:08PM

Photo Stories