Skip to main content

Saansad Adarsh Gram Yojana: ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవి?

Villages

జాతీయస్థాయిలో గ్రామీణాభివృద్ధి రంగంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు రాష్ట్రానికి చెందినవే. టాప్‌–10 ఆదర్శ గ్రామాలతోపాటు టాప్‌–20లో 19 గ్రామాలు రాష్ట్రానికి చెందినవే. ఈ మేరకు తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పటికే స్వచ్ఛ ఈ–పంచాయతీ, ఈ–ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

Covid-19: కార్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ ఏది?

ఇదీ పథకం..: పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని లేదా దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేలా రూపొందించిన పథకమే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన. ఆ గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది. 

దేశంలో టాప్‌–10 ఆదర్శ గ్రామాలివే..

సంఖ్య

గ్రామం

మొత్తం వంద మార్కులకు వచ్చిన స్కోరు

1

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని వడపర్తి

92.17

2

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌

91.7

3

నిజామాబాద్‌ జిల్లాలోని పల్డా

90.95

4

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్‌

90.94

5

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక

90.57

6

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌

90.49

7

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్‌

90.47

8

నిజామాబాద్‌ జిల్లాలోని తానాకుర్దు

90.3

9

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కుక్‌నూర్‌

90.28

10

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి

90.25

                                                      ​​​​​​​

HIV/AIDS: ఎయిడ్స్‌ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి  చెందినవి
ఎప్పుడు : ఏప్రిల్‌ 26
ఎవరు    : కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా..
ఎందుకు : సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Apr 2022 05:37PM

Photo Stories