కరెంట్ అఫైర్స్(సెప్టెంబర్ 5 - 11, 2019)బిట్ బ్యాంక్
1. ఇటలీలోని చారిత్రక పాపల్ బసిలికా ఆఫ్ అస్సిసిలో శాంతిని ప్రోత్సహించినందుకు ‘ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్–2019’ అవార్డును ఎవరికి ప్రధానం చేశారు?
1) సుబీర్ చౌదరీ
2) ఎస్తర్ డ్యుఫ్లో
3) ముహమ్మద్ యూనస్
4) ఇక్బాల్ ఖ్వాదిర్
- View Answer
- సమాధానం: 3
2. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను అమలు చేసే పద్ధతులపై భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య 3వ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) మునాబో, రాజస్థాన్
2) వాఘా, పంజాబ్
3) అట్టారీ, పంజాబ్
4) గండా సింగ్ వాలా బోర్డర్, పంజాబ్
- View Answer
- సమాధానం: 3
3. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ (ఐఓసీ) 2019 4వ ఎడిషన్ థీమ్ ఏంటి?
1) ‘పురోగతిలో భాగస్వాములు.’
2) ‘భవిష్యత్ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నివారణ.’
3) ‘హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని కాపాడుకొంటూ, సంప్రదాయ, సంప్రదాయేతర సవాళ్లను ఎదుర్కోవడం.’
4) ‘అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, శాంతిని ప్రోత్సహించడం, సంఘటితం చేయడం.’
- View Answer
- సమాధానం: 3
4. ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రకారం ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచిక – 2019 అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) జపాన్
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
5. ప్రపంచ ఆర్థిక సదస్సు – ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచీ–2019లో భారత్ ర్యాంక్?
1) 28
2) 25
3) 34
4) 50
- View Answer
- సమాధానం: 3
6. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ)– 2019 జాబితా ప్రకారం బంగారు నిల్వల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) రష్యా
2) ఇటలీ
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
7. ఫార్ ఈస్ట్ రష్యాను సందర్శించిన తొలి భారత ప్రధాని?
1) నరేంద్ర మోదీ
2) మన్మోహన్ సింగ్
3) అటల్ బిహారీ వాజ్‌పేయి
4) ఇందిరా గాంధీ
- View Answer
- సమాధానం: 1
8. ఉమ్మడి ఉన్నత స్థాయి టైగర్ ఫోరంను 2020 నిర్వహించాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి?
1) భారత్, ఆస్ట్రేలియా
2) భారత్, మాల్దీవులు
3) భారత్, అమెరికా
4) భారత్, రష్యా
- View Answer
- సమాధానం: 4
9. 20వ భారత్ – రష్యా వార్షిక సదస్సు–2019 ఎక్కడ జరిగింది?
1) వ్లాదివోస్టోక్, రష్యా
2) మాస్కో, రష్యా
3) సెయింట్ పీట్స్‌బర్గ్, రష్యా
4) కజాన్, రష్యా
- View Answer
- సమాధానం: 1
10. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఆగ్నేయ ఆసియా ప్రాంతం – ఏ సంవత్సరానికి పసిపిల్లల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి వ్యాధులు–మీజిల్స్, రుబెల్లాను నిర్మూలించాలని ప్రతినబూనింది?
1) 2023
2) 2025
3) 2030
4) 2031
- View Answer
- సమాధానం: 1
11. ‘యుద్ధ్ అభ్యాస్’ అనే సైనిక వ్యాయామంలో పాల్గొన్న దేశాలు?
1) భారత్, జపాన్
2) భారత్, అమెరికా
3) భారత్, ఆస్ట్రేలియా
4) భారత్, రష్యా
- View Answer
- సమాధానం: 2
12. బ్యాంకాక్‌లో జరిగిన ఇండియా–థాయ్‌లాండ్ కో–ఆర్డినేటెడ్ ప్యాట్రోల్ (ఇండో–థాయ్ కార్పాట్) 28 వ ఎడిషన్‌లో పాల్గొన్న ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్)?
1) ఐఎన్ఎస్ ఘరియల్
2) ఐఎన్ఎస్ ఐరావత్
3) ఐఎన్ఎస్ శార్దూల్
4) ఐఎన్ఎస్ కేసరి
- View Answer
- సమాధానం: 4
13. 2019 సంవత్సరానికి భారత్– శ్రీలంక (ఎస్ఎల్) మధ్య ‘ఎస్ఎల్ఐఎన్ఈఎక్స్’ పేరుతో వారం రోజుల ఉమ్మడి సముద్ర నౌకాదళ వ్యాయామం– 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) చెన్నై, తమిళనాడు
4) తిరువనంతపురం, కేరళ
- View Answer
- సమాధానం: 2
14.2019 సెప్టెంబర్–అక్టోబరులలో జరగనున్న జపాన్–భారత్–యుఎస్ త్రైపాక్షిక సముద్ర వ్యాయామం ఏది?
1) మిలన్ 2019
2) ఇబ్సమర్ 2019
3) వరుణ 2019
4) మలబార్ 2019
- View Answer
- సమాధానం: 4
15. నైట్ ఫ్రాంక్– కో–లివింగ్ ఇండెక్స్– 2019 ప్రకారం న్యూఢిల్లీ ర్యాంక్ ?
1) 8
2) 10
3) 11
4) 5
- View Answer
- సమాధానం: 3
16. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ఏ5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది?
1) చైనా
2) జపాన్
3) భారత్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
17. ఏ రెండు దేశాల మధ్య, 69 కిలోమీటర్ల దక్షిణ ఆసియా తొలి సరిహద్దు పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రారంభమైంది?
1) భారత్, అఫ్గనిస్తాన్
2) భారత్, నేపాల్
3) భారత్, బంగ్లాదేశ్
4) భారత్, మయన్మార్
- View Answer
- సమాధానం: 2
18. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ ఫోరెన్సిక్స్ పై తొలి జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1) చెన్నై, తమిళనాడు
2) గువాహటి, అసోం
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
19.‘కౌశలాచార్య సమాదార్ 2019’ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
1) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
20. ఎక్స్‌ప్రెస్ ఇండియా రూపొందించిన సతార్క్(ఎస్ఏటీఏఆర్కే) యాప్ రూపొందించినందుకు ఏ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, ‘ఐటీ ఎక్సలెన్స్ అవార్డు– 2019’ గెలుచుకుంది?
1) రాజస్థాన్
2) అసోం
3) పశ్చిమ బెంగాల్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
21.సంగీతం, కళ, చేతిపనులు, ఇతర స్పృషించరాని సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడానికి యునెస్కోతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
1) మహారాష్ట్ర
2) ఒడిశా
3) రాజస్థాన్
4) ఆంధ్ర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
22. ఆసియాలో అతిపెద్ద సముద్ర ఆహార ఉత్సవాలలో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (ఐఐఎస్ఎస్) 22వ ఎడిషన్‌కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) చెన్నై, తమిళనాడు
2) ముంబై, మహారాష్ట్ర
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 4
2) ఆయుష్ మంత్రిత్వ శాఖ
3) రక్షణ మంత్రిత్వ శాఖ
4) రైల్వే మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
24. నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన పదివేల ఎకరాల భారతదేశపు తొలి గ్రీన్ ఫీల్డ్ ఇండస్టియ్రల్ స్మార్ట్ సిటీ పేరు?
1) ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (ఏయూఆర్ఐసీ)
2) నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ సిటీ (ఎన్ఏజీఐసీ)
3) ముంబై ఇండస్ట్రియల్ సిటీ (ఎంయూఎంఐసీ)
4) పూణె ఇండస్ట్రియల్ సిటీ (పీయూఎన్ఐసీ)
- View Answer
- సమాధానం: 1
25. ఏ పథకం కింద 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు వచ్చే 5 సంవత్సరాల్లో పైప్డ్ వాటర్ కనెక్షన్ (హర్‌ఘర్‌జల్) అందించడానికి ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు వెచ్చించింది?
1) జల్ గ్రామీణ్ పథకం
2) జల్ వందన పథకం
3) జల్ జీవన్ పథకం
4) జల్ శక్తి పథకం
- View Answer
- సమాధానం: 3
26. 2015లో బేటీ బచావో, బేటీ పడావో (బీబీబీపీ) కార్యక్రమం అమలు చేసిన తర్వాత 2018–19 సంవత్సరానికి సెక్స్ రేషియో ఎట్ బర్త్ (ఎస్ఆర్బీ) ఎంత?
1) 947
2) 951
3) 913
4) 931
- View Answer
- సమాధానం: 4
27. భారత రైల్వే శాఖ తొలి ‘ఫన్ జోన్‘ను ఇటీవల ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసింది?
1) ఉధంపూర్ రైల్వే స్టేషన్
2) అరకు రైల్వే స్టేషన్
3) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
4) విశాఖపట్నం రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 4
28. 2013–17 సంవత్సరానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా– నమూనా రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్) ప్రకారం భారత్‌లో ఆయుర్దాయం ఎంత?
1) 69 ఏళ్లు
2) 70 ఏళ్లు
3) 65 ఏళ్లు
4) 62 ఏళ్లు
- View Answer
- సమాధానం: 1
29. ఏ రాష్ట్రాల్లో జన్మించిన మగ, ఆడ వారి ఆయుర్దాయం 73.3 ఏళ్లు, 77.8 సంవత్సరాలతో ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్, కేరళ
2) పంజాబ్, ఛత్తీస్‌గఢ్
3) ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్
4) ఢిల్లీ, కేరళ
- View Answer
- సమాధానం: 4
30. ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ జనాభా అవకాశాలు’ నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి ప్రపంచ ఆయుర్దాయం ఎంత?
1) 80.3 ఏళ్లు
2) 72.6 ఏళ్లు
3) 75.5 ఏళ్లు
4) 74.5 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
31. బ్యాంకులు ఏ రేటుతో అన్ని కొత్త రకాల ఫ్లోటింగ్ రేట్ రుణాలను (గృహ, ఆటో రుణాలు – ఎంఎస్ఎంఈ) అనుసంధానించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సిఫార్సు చేసింది?
1) బ్యాంక్ రేటు
2) రెపో రేటు
3) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్
4) రివర్స్ రెపో రేటు
- View Answer
- సమాధానం: 2
32. 2019–20 ఏప్రిల్–జూన్ మొదటి త్రైమాసికం (క్యూ 1)లో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) అతిపెద్ద వనరుగా అవతరించిన దేశం ఏది?
1) నెదర్లాండ్స్
2) మారిషస్
3) అమెరికా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
33.జెంగ్జౌ కమోడిటీ ఎక్సే్ఛంజ్ ( జెడ్సీఈ)తో, భారత్‌కు చెందిన ఏ వస్తువుల మార్పిడి సహకారం, సమాచార మార్పిడి కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)
2) నేషనల్ కమోడిటీ – డెరివేటీవ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్సీడీఈఎక్స్)
3) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎమ్‌సీఎక్స్)
4) మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎమ్ఎస్ఈ)
- View Answer
- సమాధానం: 3
34. డీమానిటైజేషన్, జీఎస్టీ, లిక్విడిటీ క్రంచ్ వల్ల కుదేలైన దేశీయ ఎంఎస్ఎంఈల కోసం రూ.5 వేల కోట్ల డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సూచించింది?
1) సి. రంగరాజన్ కమిటీ
2) యు.కె. సిన్హా కమిటీ
3) దీపక్ పరేఖ్ కమిటీ
4) బీమల్ జలాన్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
35.2019 ఆగస్టు చివరి నాటికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు మొత్తం ఎన్ని మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి?
1) 918 మిలియన్లు
2) 818 మిలియన్లు
3) 1018 మిలియన్లు
4) 1028 మిలియన్లు
- View Answer
- సమాధానం: 1
36. సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు, బోధన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో ఏ సంస్థ చేతులు కలిపింది?
1) వాట్స్‌యాప్
2) మైక్రోసాఫ్ట్
3) గూగుల్
4) ఫేస్బుక్
- View Answer
- సమాధానం: 2
37. ‘హెలికాప్టర్ల ద్వారా కనెక్టివిటీని విస్తరించడం’ అనే థీమ్‌తో 2019 తొలి హెలికాప్టర్ సదస్సు ఎక్కడ జరిగింది?
1) గువాహటి, అసోం
2) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) డెహ్రడూన్ , ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 4
38.నార్వే (కింగ్డమ్ ఆఫ్ నార్వే) తదుపరి భారత రాయబారిగా 2019 సెప్టెంబర్ 6న ఎవరు నియమితులయ్యారు?
1) బి. బాల భాస్కర్
2) సందీప్ చౌదరీ
3) హరీశ్ దాస్
4) సంతోష్ మిస్రి
- View Answer
- సమాధానం: 1
39. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సంజీబ్ రాయ్
2) ఎ.ఎన్. శర్మ
3) వినయ్ కుమార్ సక్సేనా
4) రాజన్ బాబు
- View Answer
- సమాధానం: 3
40. మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయిన తరువాత రాజీనామా చేసిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు?
1) విజయ కమలేష్ తాహిల్‌రమణి
2) గీతా మిట్టల్
3) మంజులా చెల్లూర్
4) ఇందిరా బెనర్జీ
- View Answer
- సమాధానం: 1
41. ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ బృందాన్ని ‘ఆస్కార్ ఆఫ్ సైన్స్‘ అవార్డుగా పిలిచే ప్రాథమిక భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ బహుమతితో ఎందుకు సత్కరించారు?
1) అతిపురాతన జీవిని కనుగొన్నందుకు
2) కిలోగ్రామును పునర్నిర్వచించినందుకు
3) పల్సర్లను కనుగొన్నందుకు
4) ప్రపంచంలోనే తొలిసారిగా కృష్ణబిలం ఛాయాచిత్రాన్ని అందించినందుకు
- View Answer
- సమాధానం: 4
42. చంద్రుని ఉపరితలం నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో నుంచి సంబంధాల్ని కోల్పోయిన చంద్రయాన్– 2 ల్యాండర్ పేరు?
1) విక్రమ్
2) వైకింగ్ 2
3) ఫీనిక్స్
4) ల్యూనార్ పోలార్
- View Answer
- సమాధానం: 1
43.‘మిడ్–మాన్సూన్ 2019 మెరుపు’ నివేదిక ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మెరుపు తాకిళ్లు ఎదుర్కొన్న రాష్ట్రం?
1) ఒడిశా
2) పశ్చిమ బెంగాల్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
44. గంటకు 216 కిలోమీటర్ల (134 మైళ్లు) ప్రచండ గాలులతో జపాన్‌లోని టోక్యోను తాకిన తుఫాను ఏది?
1) టోకేజ్ తుఫాను
2) ఫక్సాయ్ తుఫాను
3) ట్రామీ తుఫాను
4) జేబి తుఫాను
- View Answer
- సమాధానం: 2
45.ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్షిప్ జియు–జిట్సు 2019 లో కాంస్య పతకాన్ని (52 కిలోలు) గెలుచుకున్న మహిళా అథ్లెట్?
1) కోమల్ రావ్
2) రితికా సింగ్
3) అనుపమా స్వైన్
4) తులసీ హెలెన్
- View Answer
- సమాధానం: 3
46. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జనరల్ కౌన్సెల్, కంపెనీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
1) జొనాథన్ హాల్
2) ఎర్ల్ ఎడ్డింగ్స్
3) గ్రిగర్ బార్క్లే
4) ఇషాన్ మని
- View Answer
- సమాధానం: 1
47. ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన మహ్మద్ నబీ ఏ దేశ క్రికెటర్ ?
1) అఫ్గనిస్తాన్
2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్
4) భారత్
- View Answer
- సమాధానం: 1
48. యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ (యుఎస్ ఓపెన్) టెన్నిస్ ఛాంపియన్షిప్– 2019లో రోజర్ ఫెదరర్‌పై ఒక సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ఆటగాడు?
1) సుమిత్ నగల్
2) యుకీ భాంబ్రీ
3) ప్రజ్నేశ్ గున్నేశ్వరన్
4) రాంకుమార్ రామనాథన్
- View Answer
- సమాధానం: 1
49. టీ20ఐ ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానే కాక, తొలి డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్?
1) లసిత్ మలింగ
2) కసున్ రజిత
3) జెఫ్రీ వండర్సే
4) సురంగా లక్మల్
- View Answer
- సమాధానం: 1
50. జాతీయ పౌష్టికాహార వారాన్ని(ఎన్ఎన్డబ్ల్యూ) ఎప్పుడు పాటిస్తారు?
1) సెప్టెంబరు 4–10
2) సెప్టెంబరు 3–9
3) సెప్టెంబరు 2–8
4) సెప్టెంబరు 1–7
- View Answer
- సమాధానం: 4