కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 8 - 14) బిట్ బ్యాంక్
1. ఇటీవల పరీక్షలను ఆధార్‌తో లింక్ చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1) కేరళ
2) బీహర్
3) మధ్య ప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
2. ఇండియా, ఖజకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
1) PRABAL DOSTYK - 16
2) PRAKAMPAN DOSTK - 16
3) SANGHARSH - DOSTY - 16
4) VIRUPU - 16
- View Answer
- సమాధానం: 1
వివరణ: PRABAL DOSTYK అనగా దృఢమైన స్నేహం అని అర్థం. ఇండియా, ఖజకిస్థాన్ మధ్య మైతీసంబంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలు నిర్వహించారు.
- సమాధానం: 1
3. యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధం వల్ల ఎంత మంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు?
1) 10 మిలియన్లు
2) 30 మిలియన్లు
3) 50 మిలియన్లు
4) 80 మిలియన్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధంతో 50 మిలియన్ల పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు. ISIS వంటి ఉగ్రవాద సంస్థలు ఆత్మహుతి దాడులలో పిల్లల్నే ఎక్కువగా వాడుతున్నాయి.
- సమాధానం: 3
4. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది?
1) రూ.100 కోట్లు
2) రూ.225 కోట్లు
3) రూ.350 కోట్లు
4) రూ.450 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్‌లో ఐదు సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నారు. అవి బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, కోస్టల్ సర్క్యూట్, రామాయణ అండ్ క్రిష్ణా సర్క్యూట్, నార్త్ - ఈస్ట్ సర్క్యూట్. పర్యాటక రంగం ద్వారా దేశానికి పెద్ద ఎత్తున విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది. ఇది ఇండియా జీడీపీ వాటాలో 6.8%.
- సమాధానం: 4
5. దేశంలో గ్యాస్ వినియోగంను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రచారం ప్రారంభించింది?
1) Gas 4 India
2) Jago Grahak Jago
3) Pahel
4) Suvidha
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో గ్యాస్ వినియోగం పెంచడానికి పెట్రోలియం శాఖ ‘Gas 4 India’అనే పేరుతోప్రచారం ప్రారంభించింది. గ్యాస్ ఉత్పత్తిని పెంచుతూ తదనుగుణంగా వినియోగం పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారంభించారు.
- సమాధానం: 1
6. ఇటీవల ఏ దేశంతో వ్యాపార అభివృద్ధి కోసం ఇండియా ‘ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందం (PTA)’ను కుదుర్చుకుంది?
1) ఈకె్వడార్
2) కొలంబియా
3) చిలీ
4) అర్జెంటీనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం చిలీకి ఎగుమతి అయ్యే భారత వస్తువులకు 86% రాయితీ లభిస్తుంది.
- సమాధానం: 3
7. ఇటీవల చెన్నైలో కాన్సులేట్ ఏర్పాటు చేసిన దేశం ఏది?
1) చిలీ
2) అర్జెంటీనా
3) నైజీరియా
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 4
వివరణ: మెక్సికో భారత్‌లో తన మూడో కాన్సులేట్‌ను చెన్నైలో ఏర్పాటు చేసింది. ఇతర కాన్సులేట్లు ఉన్న ప్రాంతాలు న్యూఢిల్లీ, ముంబయి. 2015-16లో మెక్సికోకు ఇండియా ఎగుమతులు 2.8 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 4
8. జాతీయ పోషకాహార వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ మొదటి వారం
2) ఆగస్టు చివరి వారం
3) ఆగస్టు మూడో వారం
4) సెప్టెంబర్ రెండో వారం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ‘‘పోషక ఆహరం దేశానికి ఆధారం’’ అనే ఇతివృత్తంతో 2016 సెప్టెంబర్ మొదటి వారంలో పోషకాహార వారోత్సరాలు నిర్వహించారు.
- సమాధానం: 1
9. మొదటి IOT ఇండియా కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు?
1)న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) మైసూర్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
10. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రారంభించిన పార్టీ పేరు ఏమిటి?
1) గుడ్ మార్నింగ్ పంజాబ్
2) పంజాబీ ఆవాజ్
3) నవజీవన్ పంజాబ్
4) ఆవాజ్ -ఇ- పంజాబ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నవజ్యోత్ సింగ్ సిద్ధూ ‘ఆవాజ్ -ఇ- పంజాబ్’ పేరుతో, పంజాబ్ విజయాలు సాధిస్తుంది అనే స్లోగ న్‌తో నూతన పార్టీని స్థాపించారు.
- సమాధానం: 4
11. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎంత శాతం పన్నును బదిలీ చేయనున్నారు?
1) 22%
2) 32%
3) 42%
4) 52%
- View Answer
- సమాధానం: 3
వివరణ: గతంలో కేంద్ర పన్నుల నుంచి 32% రాష్ట్రాలకు పంచేవారు. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం ఈ పన్ను బదిలీని 42 శాతానికి పెంచారు.
- సమాధానం: 3
12. ఇటీవల మిస్ జపాన్‌గా ఎంపికైన ఇండో-జపనీస్ వనిత ఎవరు?
1) ప్రియాంక యేషికావా
2) అరుంధతి మిషికాకా
3) శారద యేషి కావా
4) సమంత మిషిమిషి
- View Answer
- సమాధానం: 1
వివరణ: 22 సంవత్సరాల ప్రియాంక యేషికావా మిస్ జపాన్‌గా ఎంపికైంది. ఈమె తండ్రి ఇండియన్ తల్లి జపాన్ దేశీయురాలు.
- సమాధానం: 1
13. ప్రతిష్టాత్మక ప్యాంగ్ కోర్ డైలాగ్ పురస్కారం- 2016కు ఎంపికైంది ఎవరు?
1) కె.చంద్ర శేఖర్ రావు
2) చంద్రబాబు నాయుడు
3) టి.ఆర్.జెలియాంగ్
4) మాణిక్ సర్కార్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రజలను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు చేసినందుకు గాను నాగాలాండ్ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్కి ప్యాంగ్ కోర్ డైలాగ్ పురస్కారాన్ని ఇచ్చారు. దారుల్ రుద్జున్, మలేషియా ప్రభుత్వం కలిసి ఈ పురస్కారంను ప్రారంభించాయి.
- సమాధానం: 3
14. ప్రతిష్టాత్మక ఎమ్.ఎమ్. బెన్నెట్స్ పురస్కారానికి ఎంపికైన నవల ఏది?
1) The Secret
2) Into the hidden valley
3)Silent Valley
4) Mass Speaking
- View Answer
- సమాధానం: 2
వివరణ: 19వ శతాబ్దంలో ఎమ్.ఎమ్. బెన్నెట్స్ బ్రిటిష్ చరిత్ర, నెపోలియన్ యుద్ధాల మీద విశేష పరిశోధన చేశాడు. ఈయన గౌరవార్థం చరిత్రలో మంచి పరిశోధనలు చేసిన వారికి ఈ పురస్కారం ఇస్తారు.
స్టువర్ట్ బ్లాక్బర్న్ రాసిన ‘Into the hidden valley’ అనే చారిత్రక ఫిక్షన్లో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ‘అపతని అనే గిరిజన తెగ’ చేసిన పోరాటాల గురించి రాశాడు.
- సమాధానం: 2
15. ఇటీవల ‘ఇన్శాట్ 3DR’ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వాహక నౌక పేరు ఏమిటి?
1) GSLV - D05
2) GSLV - F05
3) GSLV - E05
4) GSLV - C05
- View Answer
- సమాధానం: 2
వివరణ: GSLV సిరీస్‌లో F05 పదవ వాహకనౌక. ఇది 2,211 కేజీల బరువుగల ఇన్శాట్ 3DR అనే అత్యాధునిక వాతవరణ ఉపగ్రహంను క క్ష్యలో ప్రవేశపెట్టింది.
- సమాధానం: 2
16. ప్రపంచ అక్షరాస్యత దినం ఏ రోజున జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 3
2)సెప్టెంబర్ 5
3) సెప్టెంబర్ 7
4) సెప్టెంబర్ 8
- View Answer
- సమాధానం: 4
వివరణ: 50వ ప్రపంచ అక్షరాస్యత దినంను సెప్టెంబర్ 8న యునెస్కో నిర్వహించింది.
ఇతివృత్తం: ‘‘గతంను అధ్యయనం చేసి, భవిష్యత్తును పునర్నిర్మించుకుందాం’’.
- సమాధానం: 4
17. ఇటీవల NSSO నిర్వహించిన సర్వే ప్రకారం అత్యంత శుభ్రమైన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) మిజోరామ్
3) సిక్కిం
4) హిమచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: NSSO 2015 మే-జూన్‌లో 3,788 గ్రామాల్లోని 73,176 గృహాల్లో మరుగుదొడ్ల వాడకం పై సర్వే చేసి అత్యంత శుభ్రమైన రాష్ట్రంగా సిక్కింను ప్రకటించింది. జాబితాలో తర్వాతి స్థానాల్లో కేరళ, మిజోరామ్, హిమాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం 14వ స్థానంలో, జార్ఖండ్ చివరి స్థానంలో ఉన్నాయి.
- సమాధానం: 3
18. నాల్గో ఆసియాన్ - ఇండియాన్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) మనీలా
2) వియన్షేన్
3) బ్యాంకాక్
4) హొచిమిన్ సిటి
- View Answer
- సమాధానం: 2
వివరణ: లావోస్ రాజధాని వియన్షేన్ (Vientiane) లో 4వ ఆసియన్ - ఇండియా సదస్సుతో పాటు 11వ తూర్పు ఆసియా సదస్సు కూడా నిర్వహించారు.
- సమాధానం: 2
19. ఇటీవల ఫార్చున్ విడుదల చేసిన ‘51 అత్యంత శక్తి వంతమైన మహిళల జాబితా’ లో మొదటి స్థానంలో ఉన్న మహిళ ఎవరు?
1) మేరీ బారా
2) ఇంద్రానూయి
3) మార్లిన్ హ్యుసన్
4) గిన్ని రొమెట్టి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫార్చున్ విడుదల చేసిన 51 శక్తివంతమైన మహిళలల జాబితాలో జనరల్ మోటార్ CEO, చైర్మన్ మేరీ బారా మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రానూయి, మూడో స్థానంలో లాక్ హిడ్ మార్టిన్ CEO మార్లిన్ హ్యుసన్, నాల్గో స్థానంలో IBM సిఈవో, చైర్మన్ గిన్న రోమెట్టి ఉన్నారు.
- సమాధానం: 1
20. నాసా ఆస్టరాయిడ్స్ నుంచి ధూళి కణాల సేకరణ కోసం ఒక అంతరిక్ష మిషన్‌ను ప్రారంభించింది. దీని వ్యయం ఎంత ?
1) 800 మిలియన్ డాలర్లు
2) 700 మిలియన్ డాలర్లు
3) 600 మిలియన్ డాలర్లు
4) 500 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భూమికి అతి దగ్గరగా ఉన్న ఆస్టరాయిడ్ నుంచి ధూళి కణాలలను సేకరించడం కోసం "OSIRIS REx’’ అనే సోలార్ నౌకను పంపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం 800 మిలియన్ డాలర్లు.
- సమాధానం: 1
21. ‘ICGSసారధి’ నౌకను ఏ ప్రాంతంలో జల ప్రవేశం చేయించారు?
1) కొచ్చిన్
2) ముంబయి
3) విశాఖపట్నం
4) గోవా
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్తోస్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ICGSసారధిని గోవాలో జలప్రవేశం చేయించారు. దీని పొడవు 105 మీటర్లు. ఇది గరిష్ఠంగా 26 నాట్ల వేగంతో ఆగకుండా 6000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు.
- సమాధానం: 4
22. మార్లెబోన్ క్రికెట్ క్లబ్లో గౌరవ జీవితకాల సభ్యత్వం పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు?
1) మిథాలీ రాజ్
2) సుష్మా వర్మ
3) అంజుమ్ చోప్రా
4) దీప్తి శర్మ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మార్లెబోన్ క్రికెట్ క్లబ్‌ను 1787లో లండన్‌లో ప్రారంభించారు. అంజుమ్ చోప్రా ఢిల్లీ నుంచి భారత మహిళ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
- సమాధానం: 3
23. ‘Anything But Khamosh ’ పుస్తక రచయిత ఎవరు?
1) రాజేంద్ర పుష్కర్
2) భారతి ప్రధాన్
3) అదానీ సనద్
4) సమీర్ గోయల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ జర్నలిస్టు భారతి ప్రధాన్, రాజకీయ నాయకుడు, బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా జీవిత చరిత్రను ‘Anything But Khamosh’ పేరుతో రాశారు.
- సమాధానం: 2
24. స్వచ్ఛ సర్వేక్షణ్ ఇండెక్స్ ప్రకారం మైదాన ప్రాంతంలో అతి శుభ్రమైన జిల్లా ఏది?
1) నల్గొండ
2) సింధు దుర్గ్
3) నాడియా
4) సిమ్లా
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్వచ్ఛ సర్వేక్షణ్ లేదా శుభ్రత ఇండెక్స్ ప్రకారం మైదాన ప్రాంతంలో అతిశుభ్రమైన జిల్లాగా మహరాష్ట్రకు చెందిన సింధు దుర్గ్ ఎంపికైంది. తర్వాతి స్థానాల్లో నాడియా, సతారా ఉన్నాయి.
- సమాధానం: 2
25. స్వచ్ఛ సర్వేక్షణ్ ఇండెక్స్ప్రకారం పర్వత ప్రాంతంలో అతిశుభ్రమైన జిల్లా ఏది?
1) వెస్ట్ సిక్కిం
2) సిమ్లా
3) మండి
4) వెస్ట్ సిక్కిం
- View Answer
- సమాధానం: 3
వివరణ: పరత్వ ప్రాంతంలో అతిశుభ్రమైన జిల్లాగా హిమచల్ప్రదేశ్కు చెందిన ‘మండి’ ఎంపికైనది. తర్వాతి స్థానాల్లో వెస్ట్ సిక్కిం, సిమ్లా , ఈస్ట్ సిక్కిం ఉన్నాయి.
- సమాధానం: 3
26. ఇటీవల కార్మికుల కోసం పెన్షన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) తెలంగాణ
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ పెన్షన్ పథకం ప్రకారం 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.300, 80 సంవత్సరాలు నిండిన కార్మికుల నెలకు రూ.500 పెన్షన్ ఇస్తారు.
- సమాధానం: 1
27. 6వ IUCN ప్రపంచ పరిరక్షణ సమావేశం 2016లో ఎక్కడ నిర్వహించారు?
1) మనీలా
2) వియన్షేన్
3) హొనలులు
4) రియో డి జనీరో
- View Answer
- సమాధానం: 3
వివరణ: ‘Planet at the crossroads’ థీమ్‌తో హవాయి రాజధాని హొనలులులో 6వ IUCN సమావేశం నిర్వహించారు. IUCN అద్యక్షుడు - జాంగ్ జీన్ షెంగ్.
- సమాధానం: 3
28. గురు కేలుచరణ్ మహాపాత్ర పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు?
1) రాజ్ కపూర్
2) రిషి కపూర్
3) రాజేంద్ర కుమార్
4) జరానా దాస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ ఒడిస్సీ నాట్యకారుడు గురు కేలుచరణ్ మహాపాత్ర గౌరవర్థం 1995లో ఒడిశా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రారంభించింది. ఒడిశా నటి జరానా దాస్, కిశోర్ మహాంతి జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 4
29. QS ప్రపంచ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఏది?
1) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2) స్టాన్ఫోర్డ్
3) హర్వార్డ్
4) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: Quacquarelli Symonds Ltd అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ విశ్వవిద్యాలయాలకు రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్‌లో మొదటి స్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాతి స్థానాల్లో స్టాన్ఫోర్డ్, హర్వార్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి IIT Bombay (219), IIT Delhi (185), IIS (152), IIT Madras (249), IIT Kanpur (302), IIT Khargpur (313) చోటు దక్కించుకున్నాయి.
- సమాధానం: 1
30. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) ఫొర్తలేజా
3) షాంఘై
4) ప్రిటొరియా
- View Answer
- సమాధానం: 3
31. స్కొచ్ స్మార్ట్ గవర్నెన్స్ గోల్డ్ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) జార్ఖండ్
3) గోవా
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 45వ స్కాచ్ మెరిట్ పురస్కారం, స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్ గోల్డ్ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం జార్ఖండ్. ‘ముఖ్యమంత్రి జనసంవాద్ సెంటర్’ అనే ప్రాజెక్ట్‌కు ఈ పురస్కారం లభించింది.
- సమాధానం: 2
32. ‘సమాజ్ వాది పెన్షన్ యోజన’ పథకం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైంది ఎవరు?
1) కరీనా కపూర్
2) కాజోల్
3) మాధురి దీక్షిత్
4) విద్యాబాలన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 28 ఫిబ్రవరి 2014న సమాజ్ వాది పెన్షన్ యోజనను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో పొదుపును ప్రోత్సహించి, సేకరించిన వారికి ఆర్థిక సహాయం చేస్తారు. ఈ పథకం కింద నెలకు రూ.500 రూపాయలు, గరిష్టంగా రూ.750 వరకు చెల్లిస్తారు.
- సమాధానం: 4
33. ప్రతిష్ఠాత్మక SangSom Six Red స్నూకర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించినది ఎవరు?
1) పంకజ్ అద్వానీ
2) స్టువర్ట్ బింగ్ హమ్
3) డింగ్ జున్హి
4) స్టిఫెన్ మగుయ్యిర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: థాయిలాండ్‌లో జరిగిన సాంగ్ సోమ్ సిక్స్ రెడ్ స్నూకర్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో డింగ్ జున్హి, స్టువర్ట్ బింగ్ హమ్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతకాన్ని గెలుచుకున్న పంకజ్ అద్వానీఈ పోటీలో పతకం గెలిచిన మొదటి భారతీయుడుగా నిలిచాడు.
- సమాధానం: 3
34. ‘Six machine ’ పుస్తక రచయిత ఎవరు?
1) క్రిస్ గేల్
2) రికీ పాటింగ్
3) వీరేంద్ర సెహ్వాగ్
4) అనురాగ్ ఠాకూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వెస్టిండీస్ పముఖ కికెటర్ క్రిస్గెల్ ‘సిక్స్ మేషిన్’ అనే పేరుతో తన స్వీయ చరిత్రను రాసుకున్నాడు. వైకింగ్ - పెంగ్విన్ యూకే సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది.
- సమాధానం: 1
35. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ -13
2) సెప్టెంబర్ - 10
3) సెప్టెంబర్ - 8
4) సెప్టెంబర్ - 6
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంస్థ (IASP), ప్రపంచ మానసిక ఆరోగ్య ఫెడరేషన్ సంయుక్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించాయి. 1960లో ఇర్వీన్ రింగేల్, నార్మన్ ఫర్బరౌ IASP ని ప్రారంభించారు.
- సమాధానం: 2
36. ఇటీవల ఏ ప్రాంతాల్లో పాలిథీన్ వాడకంను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది?
1) పారిశ్రామిక వాడలు
2) విమానశ్రయాలు
3) రైల్వే స్టేషన్లు
4) మాన్యుమెంట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: 50 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న పాలిథీన్ సంచులను జాతీయ స్మారక కట్టడాలకు 100 మీ. పరిధిలోవాడకుండా కేంద్ర ప్రభుత్వంనిషేధం విధించింది. ఈ నిషేధం అక్టోబర్ 2 నుంచి అమల్లోకొచ్చింది.
- సమాధానం: 4
37. న్యూఢిల్లీ - ముంబయిల మధ్య నడపనున్న టాల్గో రైలును ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు?
1) బ్రిటన్
2) స్పెయిన్
3) స్వీడన్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న టాల్గో రైలు గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఈ రైలు న్యూఢిల్లీ - ముంబయి మధ్య 1,389 కి.మీ. దూరంను 11 గంటల 48 నిమిషాలలో చేరుతుంది.
- సమాధానం: 2
38. ప్రపంచంలో అతి పెద్ద బుల్లెట్ రైలు వ్యవస్థను నిర్మించిన దేశం ఏది?
1) జపాన్
2) స్పెయిన్
3) చైనా
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2000 కి.మీ.తో ప్రపంచంలో అతి పెద్ద బుల్లెట్ రైలు వ్యవస్థను చైనా ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా 300 kmph వేగంతో ప్రయాణిస్తుంది. చెన్నై, న్యూఢిల్లీల మధ్య బుల్లెట్ రైలు వ్యవస్థ నిర్మాణం కోసం చైనా అధ్యయనం ప్రారంభించింది.
- సమాధానం: 3
39. 9వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ పురస్కారం 2016నకు ఎంపికైన రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫూడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ 9వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ సమావేశంను న్యూఢిల్లీలోనిర్వహించింది. ఈ సమావేశంలో ఒడిశాకు 9వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హర్యానా ఉత్తమ హర్టికల్చర్ రాష్ట్రంగా ఎంపికైంది.
- సమాధానం: 1
40. ‘తమిళ రత్న’ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) రఘరామ్ రాజన్
2) జయలలిత
3) సుబ్రమణ్యస్వామి
4) చిదంబరం
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతూ, పారదర్శక పాలనను ప్రజలకు అందించే విధంగా చేసినందుకుగాను అమెరికా తమిళ సంఘం సుబ్రమణ్య స్వామికి ‘తమిళ రత్న’ పురస్కారాన్ని ఇచ్చింది.
- సమాధానం: 3
41. ‘‘ ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం’’ ఎక్కడ ఉంది?
1) రాంచీ
2) రాయ్‌పూర్
3) రాయ్‌గడ్
4) రామచంద్రపూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయంలో రూ.4.92 కోట్లు వ్యయంతో వ్యవసాయ మ్యూజియంను ప్రారంభించారు. ఈ మ్యూజియం ద్వారా వ్యవసాయంలో వాడవలసిన పద్ధతులు, వ్యవసాయ సంబంధ సమస్యలు, వాటి పరిష్కారాలు గురించి వివ రిస్తారు.
- సమాధానం: 2
42. ఇటీవల పోస్టల్ శాఖ ప్రారంభించిన హెల్ప్‌లైన్ సెంటర్ నెంబర్ ఏది?
1) 1000
2) 1505
3) 1900
4) 1924
- View Answer
- సమాధానం: 4
వివరణ: పోస్టల్ శాఖ ‘1924’ అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది మూడు భాషల్లో పనిచే స్తుంది.
- సమాధానం: 4
43. వెనిస్ చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ పురస్కారానికి ఎంపికైన చిత్రం ఏది?
1) ది ఉమెన్ హు లెఫ్ట్
2) యూగ్రే ఇండియన్ గాడసెస్
3) ది స్వాలోస్
4) ది సోసైటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: లార్ డయాజ్ (Lar Diaz)ఫిలిపైన్స్ భాషలో తీసిన ‘The Woman Who Left’ సినిమా గోల్డెన్ లయన్ పురస్కారానికి ఎంపికైనది. వెనిస్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడుగా ఆస్కార్ మార్టినింజ్ (The distinguished citizen), ఉత్తమ నటిగా ఎమ్మాస్టొన్ (La La Land) ఎంపికయ్యారు.
- సమాధానం: 1
44. యూ.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) రాఫెల్ నాదల్
2) నోవాక్ జకొవిచ్
3) రోజర్ ఫెదరర్
4) స్టాన్ వావ్రింకా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 136 వ యూ.ఎస్. ఓపెన్ టెన్నిస్ క్రీడలు న్యూయార్క్ నగరంలో జరిగాయి. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్టాన్ వావ్రింకా, మహిళల టైటిల్‌ను ఏంజెలిక్ కెర్బర్ గెలుచుకున్నారు.
- సమాధానం: 4
45. ‘‘ యునెటైడ్ నేషన్ డే ఫర్ సౌత్ కోపరేషన్’’ ను ఏ రోజున నిర్విహ ంచుకుంటారు?
1) సెప్టెంబర్ 8
2) సెప్టెంబర్ 10
3) సెప్టెంబర్ 12
4) సెప్టెంబర్ 1
- View Answer
- సమాధానం: 3
46. జాతీయ హిందీ దావస్ ను ఏ రోజున జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 12
2) సెప్టెంబర్ 14
3) సెప్టెంబర్ 16
4) సెప్టెంబర్ 20
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1949సెప్టెంబర్14న రాజ్యాంగ సభ హిందీని జాతీయ భాషగా గుర్తించిన సందర్భంగా జాతీయ హిందీ దివస్‌ను నిర్వహిస్తారు.
- సమాధానం: 2
47. హర్యానాలో జవహర్లాల్ నెహ్రూ కెనాల్ పునర్నిర్మాణం కోసం ఎన్ని కోట్లు మంజూరు చేశారు?
1) రూ. 143
2) రూ. 234
3) రూ. 341
4) రూ. 432
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రతి వ్యవసాయ భూమికి నీరు అనే లక్ష్యంతో జవహర్లాల్ నెహ్రు కాలువ పునర్నిర్మాణం కోసం రూ. 143 కోట్లు కేటాయించారు.
- సమాధానం: 1
48. కింది వాటిలో ఏ రాష్ట్రం చదువుకునే బాలికలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనుంది?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) హర్యానా
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
49. ప్రపంచంలో అతి ఎత్తై వంతెనను ఎక్కడ నిర్మించారు?
1) స్కెస్కాపర్
2) బైపాన్ జియాంగ్
3) లోస్కాపర్
4) వియోన్షన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాలోని బైపాన్ (Beipan)నదిపైభూమి నుంచి 565 మీటర్ల (1,854 అడుగులు) ఎత్తులో బైపాన్ జియంగ్ (Beiponjiang)అనే వంతెనను నిర్మించారు.
- సమాధానం: 2
50. ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్షిప్ 2016లో కాంస్య పతకాన్ని సాధించినది ఎవరు?
1) సుస్మితా రాయ్
2) యె ఇన్ క్యూ
3) చోనిన్ చాన్
4) జోసెఫి సియావో
- View Answer
- సమాధానం: 1
వివరణ: సిక్కింకు చెందిన సుస్మితా రాయ్ దక్షిణ కొరియాలోనిచియోంగివ్ (Cheongiu) లో జరిగిన ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్షిప్లో కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 1