కరెంట్ అఫైర్స్ ( ఫిబ్రవరి 22 - 28 ) బిట్ బ్యాంక్
1. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ?
1) మంగళం పల్లి
2) కొలనుపాక
3) ఫణిగిరి
4) గజ్వేల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ పథకం కింద దత్తాత్రేయ యాదాద్రి జిల్లాలోని కొలనుపాకను రెండేళ్ల పాటు దత్తత తీసుకున్నారు.
- సమాధానం: 2
2. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ?
1) రూ. 12 వేలు
2) రూ. 20 వేలు
3) రూ. 28 వేలు
4) రూ. 36 వేలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారు.
- సమాధానం: 1
3. ఇటీవల ఏ రాష్ట్రంలోని జైళ్లలో ఈ ములాఖత్‌ను ప్రారంభించారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఖైదీలతో మాట్లాడేందుకు ముందుగానే ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ముందుగా చంచల్‌గూడ జైల్లో ఈ విధానాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 2
4. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ?
1) గోవా
2) హైదరాబాద్
3) కోల్కత్తా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ కేంద్రం ఇంటర్నెట్ భద్రత సేవలను అందిస్తుంది. అలాగే కంప్యూటర్, మొబైల్ యూజర్లకు ఉచితంగా యాంటీ వైరస్ టూల్స్ ను అందిస్తుంది.
- సమాధానం: 4
5. జమ్ము కశ్మీర్ రాష్ట్రం 2017ను ఏ సంవత్సరంగా ప్రకటించింది ?
1) ఆపిల్ సంవత్సరం
2) మంచుపులి సంవత్సరం
3) మంచు తోడేలు సంవత్సరం
4) మిథేన్ సంవత్సరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశ, విదేశాలలో కశ్మీర్ ఆపిల్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 2017ను ఆపిల్ సంవత్సరంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హెక్టార్‌కు 50 - 70 మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత్‌లో ఏటా 20 లక్షల టన్నుల ఆపిల్ దిగుబడులు వస్తోండగా వీటిలో అత్యధికంగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.
- సమాధానం: 1
6. ప్రభుత్వ అందించే సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం చేసిన రాష్ట్రం ?
1) తెలంగాణ
2) గుజరాత్
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రభుత్వం నుంచే పొందే ప్రతి ప్రయోజనానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.
- సమాధానం: 2
7. అంతర్జాతీయ మెర్క్యురీ పురస్కారం 2016-17కు ఎంపికైన సంస్థ ఏది ?
1) ఎంటర్ ప్రెన్యుర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
2) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
3) సీసీఐ
4) ఎఫ్ఐసీసీఐ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ వ్యవస్థాపకత విద్య, పరిశోధన, సంస్థ నిర్మాణంలో శిక్షణ ఇస్తుంది.
- సమాధానం: 1
8. ఇటీవల ఐసీజీఎస్ షౌనక్ను ఎక్కడ జల ప్రవేశం చేయించారు ?
1) కొచ్చి
2) విశాఖపట్నం
3) గోవా
4) ముంబయి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐసీజీఎస్ షౌనక్ను గోవా షిప్‌యార్డులో నిర్మించారు. ఈ నౌకలో రెండు ఇంజిన్లు గల హెలికాప్టర్‌తో పాటు 5 హైస్పీడ్ బోట్లను తరలించవచ్చు. విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ నౌక భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీ చేపడుతుంది.
- సమాధానం: 3
9. ప్రతిష్టాత్మక జెనసిస్ ఓపెన్ - 2017 టైటిల్ విజేత ఎవరు ?
1) చార్లి హఫ్మాన్
2) థామస్ పీటర్స్
3) స్కాట్ బ్రౌన్
4) డస్టీన్ జాన్సన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అమెరికాలో జరిగిన జెనసిస్ ఓపెన్ - 2017 టైటిల్‌ను సొంతం చేసుకున్న డస్టీన్ జాన్సన్ ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరుకున్నాడు.
- సమాధానం: 4
10. 4వ జాతీయ బయో డైవర్సిటీ కాంగ్రెస్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) చెన్నై
2) పుణె
3) భువనేశ్వర్
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2017 థీమ్ - స్థిరమైన అభివృద్ధికి జీవ వైవిధ్యం (Mainstreaming Biodiversity for Sustainable Development)
- సమాధానం: 4
11. ఏ సంవత్సరం లోపు ప్రతి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2022
2) 2020
3) 2018
4) 2017
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా 2018 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
- సమాధానం: 3
12. ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ?
1) ప్రొ. సత్యభామా దాస్ బిజు
2) డా. సలీం అలీ
3) డా. రాధామోహన్
4) డా. నరేంద్ర మోహన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ సత్యభామా దాస్ బిజు కప్పలపై అనేక పరిశోధనలు జరిపారు. ప్రపంచంలోనే అతి చిన్న కప్పలను పశ్చిమ కనుమలలో ఆయన కనుగొన్నారు.
- సమాధానం: 1
13. "ది పీపుల్స్ మహారాజా " పుస్తక రచయిత ఎవరు ?
1) రాజేంద్ర వర్మ
2) సునీల్ ముఖర్జీ
3) కుశ్వంత్ సింగ్
4) అమరీందర్ సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ది పీపుల్స్ మహారాజా అనే పేరుతో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవిత చరిత్రను కుశ్వంత్ సింగ్ రాశారు.
- సమాధానం: 3
14. మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది ?
1) హౌరా - ఎర్నాకులం
2) ముంబయి - టాటానగర్
3) భిలాయ్ - చెన్నై
4) భోపాల్ - కోల్కత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేదే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్. సాధారణ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. మొదటి ఎక్స్‌ప్రెస్ హౌరా-ఎర్నాకులం మధ్య ప్రారంభమైంది. రెండో ఎక్స్‌ప్రెస్ ముంబయి - టాటానగర్ మధ్య ప్రారంభం కానుంది.
- సమాధానం: 1
15. అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు ?
1) సేలం
2) భిలాయి
3) టాటానగర్
4) కన్నూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేరళ రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురం సిటిజన్ ఇండియా ఛారిటబుల్ ట్రస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కన్నూర్‌లో రూ. 300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు.
- సమాధానం: 4
16. రైల్వే భద్రత కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) జర్మనీ
2) జపాన్
3) ఇటలీ
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం రైల్వే ట్రాక్‌ల తనిఖీ, ట్రాక్ వెల్డింగ్, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి అంశాల్లో జపాన్ సాంకేతిక సహకారం అందిస్తుంది.
- సమాధానం: 2
17. మొదటి బ్రిక్స్ షెర్పా సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) చైనా
2) భారత్
3) రష్యా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనాలోని నాన్జింగ్ - జియాన్ష్ ప్రావిన్స్‌లో బ్రిక్స్ షెర్పా మొదటి సమావేశాన్ని నిర్వహించారు.
- సమాధానం: 1
18. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని నగదు రహితంగా మార్చేందుకు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) మాస్ట్రో
2) సిర్రస్
3) వీసా
4) సీసీ ఎవెన్యూస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: విశాఖపట్నం నగరాన్ని క్యాష్ లెస్ సిటీగా మార్చేందుకు అమెరికాకు చెందిన వీసా కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 70 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులను వంద శాతానికి తీసుకెళ్లేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
- సమాధానం: 3
19. అంతర్జాతీయ బౌద్ధ సదస్సుని ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1) అమరావతి
2) పుణె
3) గయ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకి 15 దేశాల నుంచి 63 ప్రతినిధులు హాజరయ్యారు.
- సమాధానం: 4
20. ఐబీఏ బ్యాంకింగ్ పురస్కారాలలో Best Financial Inclusion Initiatives విభాగంలో అవార్డు గెలుచుకున్న బ్యాంకు ఏది ?
1) కర్ణాటక బ్యాంకు
2) మహేష్ బ్యాంకు
3) దుర్గా విలాస్ బ్యాంకు
4) విజయా బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
21. కావేరి నది ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్
2) జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
3) జస్టిస్ సుమిత్రా సేన్
4) జస్టిస్ నానావతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: జస్టిస్ బల్బీర్ సింగ్ స్థానంలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కావేరి నది ట్రైబ్యునల్ ఛైర్మన్గానియమితులయ్యారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ప్రాంతాలు ఈ ట్రైబ్యునల్ పరిధిలోకి వస్తాయి.
- సమాధానం: 2
22. భారతీయ ఎయిర్టెల్ సంస్థ ఏ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేయనుంది ?
1) జియో
2) ఐడియా
3) టెలినార్
4) వొడాఫోన్
- View Answer
- సమాధానం: 3
23. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉగాండా పర్యటనలో ఏ అంశంపై ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు ?
1) ఆహార ఉత్పత్తులు
2) శక్తి రంగం
3) వస్త్రాలు
4) సాఫ్ట్వేర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫిబ్రవరి 21 - 23 వరకు ఉగాండాలో పర్యటించిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ శక్తి, అంతరిక్ష రంగంలో శిక్షణ, పౌర అవసరాల కోసం అణుశక్తి అంశాలపై ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
- సమాధానం: 2
24. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏ అంతర్జాతీయ బ్యాంకుతో రుణ ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంకు
3) ప్రపంచ బ్యాంకు
4) యూరోపియన్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ ( 800 కి.మీ.) నిర్మాణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు 375 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్మించే 2500 కి.మీ. తూర్పు కోస్తా ఆర్థిక కారిడార్‌లో ఇది తొలి ప్రాజెక్టు.
- సమాధానం: 1
25. ఇటీవల ఇజ్రాయెల్‌తో భారత్ కుదుర్చుకున్న క్షిపణుల ఒప్పందం విలువ ఎంత ?
1) రూ.5000 కోట్లు
2) రూ.9,000 కోట్లు
3) రూ.13,000 కోట్లు
4) రూ.17,000 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం భారత్, ఇజ్రాయెల్ కలిసి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్య శ్రేణి క్షిపణులను తయారు చేస్తాయి. వీటికి 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది.
- సమాధానం: 4
26. భారత్‌లో ఎక్కువ ముడి చమురు ఏ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది ?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత చమురు ఉత్పత్తిలో అత్యధిక శాతం ముంబై నుంచి వస్తోంది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ ఉంది. రాజస్థాన్‌లోని క్షేత్రాల నుంచి ఏటా 90 లక్షల టన్నులు చమురు ఉత్పత్తి అవుతుంది. మొత్తం దేశ ఉత్పత్తిలో ఇది 24 శాతం.
- సమాధానం: 3
27. డా. సత్యపాల్ మెమోరియల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) శశిబాత్ర
2) వీరేంద్ర శర్మ
3) మేఘనూర్ దేశాయ్
4) పరమ్ జిత్ సింగ్ గిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూకే-భారత్ సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గాను వీరేంద్ర వర్మకు డా.సత్యపాల్ మెమోరియల్ పురస్కారం ప్రదానం చేశారు. భారత సంతతికి చెందిన ఆయన యూకేలో లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు.
- సమాధానం: 2
28. ఆసియా హాకీ ఫెడరేషన్‌కు ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) తెంగుక్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా
2) దాతో తయ్యబ్ క్రమ్
3) అభిజిత్ సర్కార్
4) లీగువో చావో
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆసియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు తెంగుక్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా. ఉపాధ్యక్షుడు అభిజిత్ సర్కార్. ఈ ఫెడరేషన్లో 30 సభ్య దేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్‌లో ఉంది.
- సమాధానం: 3
29. తొలి అంతర్జాతీయ జిప్‌లైన్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) స్పెయిన్ - పోర్చుగల్
2) ఫాన్స్ - స్విట్జర్లాండ్
3) ఆస్ట్రియా - జర్మనీ
4) పోలాండ్ - జర్మనీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: లిమిట్ జీరో పేరుతో స్పెయిన్ - పోర్చుగల్ మధ్య 2,362 అడుగుల పొడవైన అంతర్జాతీయ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
30. 74వ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు ?
1) ఫిబ్రవరి 21
2) ఫిబ్రవరి 22
3) ఫిబ్రవరి 23
4) ఫిబ్రవరి 24
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1944 ఫిబ్రవరి 24న కేంద్ర ఎక్సైజ్ అండ్ సాల్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ఏటా ఆ రోజుని ఎక్సైజ్ దినోత్సవంగా నిర్వహిస్తారు.
- సమాధానం: 4
31. డోస్మోచె ఉత్సవాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
1) హిమాచల్ ప్రదేశ్
2) జమ్మూ కశ్మీర్
3) ఉత్తరాఖండ్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 2
వివరణ: జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోని బౌద్ధ ఆశ్రమాలలో ఏటా ఫిబ్రవరిలో డోస్మోచె ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో మాస్క్ నృత్యాలు ప్రధాన ఆకర్షణ.
- సమాధానం: 2
32. 112 అడుగుల ఆది యోగి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ?
1) శ్రీశైలం
2) కాశి
3) కోయంబత్తూరు
4) రామేశ్వరం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్మించింది. 2017 ఫిబ్రవరి 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదియోగి- ది సోర్స్ ఆఫ్ యోగా పుస్తకాన్ని విడుదల చేశారు.
- సమాధానం: 3
33. భారత్‌లో పర్వతాలపై తొలి సైకిల్ మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) డార్జిలింగ్
2) షిమ్లా
3) ఊటీ
4) అరకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో తొలి పర్వత సైకిల్ మార్గాన్ని డార్జిలింగ్‌లో నిర్మించారు.సెంచల్ వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ మీదుగా వెళ్లే ఈ సైకిల్ మార్గం పొడవు 20 కిలోమీటర్లు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
- సమాధానం: 1
34. ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఈ ఏటి మేటి వ్యాపారవేత్తగా ఎవరిని ఎంపిక చేసింది ?
1) అభయ్ ఫిరోడియా
2) నవీన్ తివారీ
3) సమక్ సంగ్లా
4) వివేక్ చాంద్ సెహగల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: వివేక్ చాంద్ సెహగల్ మదర్ సన్ సుమీ సిస్టమ్స్ ఛైర్మన్. ఈ సంస్థ ఆటోమొబైల్స్ విడి భాగాలు తయారు చేస్తుంది. ఫోర్స్ మోటార్స్ ఛైర్మన్ అభయ్ ఫిరోడియా బిజినెస్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 4
35. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం ఎవరు పొందారు ?
1) స్వాతి పిరమల్
2) చందుభాయ్ విరాని
3) ఉదయ్ శంకర్
4) నందన్ నిలేకని
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆధార్ ప్రాజెక్టుని విజయవంతంగా నిర్వహించినందుకు నందన్ నిలేకని ఈ పురస్కారం పొందారు. స్టార్టప్ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్ వ్యవస్థాపక సీఈవో అవార్డు అందుకున్నారు.
- సమాధానం: 4
36. ఎఫ్ఐహెచ్ హాకీ స్టార్ పురస్కారాలలో 2016 సంవత్సర ఉత్తమ క్రీడాకారుడి అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
1) జాన్ జాన్ డోహ్మెన్
2) డేవిడ్ హర్ట్
3) డాని కేర్రీ
4) ఆర్థర్ వాన్ డోలెన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాన్ జాన్ డోహ్మెన్ బెల్జియం హాకీ జట్టు కెప్టెన్. ఉత్తమ పురుషుల గోల్ కీపర్‌గా డేవిడ్ హర్ట్(ఐర్లాండ్) , వర్ధమాన హాకీ క్రీడాకారుడిగా ఆర్థర్ వాన్ డోలెన్ (బెల్జియం), ఉత్తమ కోచ్‌గా డాని కేర్రీ (గ్రేట్ బ్రిటన్) ఎంపికయ్యారు.
- సమాధానం: 1
37. 6వ ఆసియాన్ పారా - రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించింది ఎవరు ?
1) హరిందర్ సింగ్
2)దివిజ్ సింగ్
3) అభిషేక్
4) మహమ్మద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బహ్రెయిన్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో భారత్ మూడు పతకాలు గెలుచుకుంది. అభిషేక్ (ఛండీగఢ్) బంగారు పతకాన్ని గెలుచుకోగా దివిజ్ సింగ్ వెండి, హరిందర్ సింగ్ కాంస్య పతకాలు సాధించారు.
- సమాధానం: 3
38. న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత సంపన్న నగరం ఏది ?
1) బెంగళూరు
2) ముంబయి
3) ఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఈ నివేదిక ప్రకారం ముంబయి సంపద 820 మిలియన్ డాలర్లు. 450 బిలియన్ డాలర్లతో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా 320 బిలియన్ డాలర్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ దక్షిణాఫ్రికా కేంద్రంగా పనిచేస్తోంది.
- సమాధానం: 2
39. ప్రతిష్టాత్మక విశాఖ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) గౌరవ్ కృష్ణ
2) రాజ్‌నాథ్ సింథియా
3) రాజేంద్ర వర్మ
4) డా. యోగిని సతర్కర్ పాండే
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ కవి వి. వి. షిర్ వాక్కర్ గౌరవార్థ్ధం యశ్వంత్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ విశాఖ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఏటా ముగ్గురు కవులకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.
- సమాధానం: 4
40. భారత్‌లో అతి తక్కువ శిశు మరణాలు గల రాష్ట్రం ఏది ?
1) గోవా
2) సిక్కిం
3) కేరళ
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో శిశు మరణాల రేటు 42గా ఉంది (ప్రతి వెయ్యి మందికి శిశువులకు 42 మరణాలు). గోవా, కేరళ రాష్ట్రాల్లో అతి తక్కువ శిశు మరణాలు నమోదవుతున్నాయి.
- సమాధానం: 1
41. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) పారిస్
2) న్యూయార్క్
3) బార్సిలోనా
4) రియో డి జనిరో
- View Answer
- సమాధానం: 3
వివరణ: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మొబైల్ సంస్థల సమావేశాల్లో అతి పెద్దది. దీనిని జీఎస్ఎమ్ఏ నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే నోకియా సంస్థ కొత్త ఫీచర్లతో 3310 ఫోన్‌ను విడుదల చేసింది.
- సమాధానం: 3
42. 89వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమా ఏది ?
1) లా లా ల్యాండ్
2) మూన్ లైట్
3) మాంచెస్టర్ బై ది సీ
4) ఎరైవల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 89వ ఆస్కార్ (అకాడమీ) అవార్డుల్లో మూన్ లైట్ సినిమా ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది. ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్ ), ఉత్తమ నటుడు - కాసే అప్లెక్ ( మాంచెస్టర్ బై ది సీ ), ఉత్తమ దర్శకుడుగా - డామియన్ చాజెల్లా ( లా లా ల్యాండ్ ) ఎంపికయ్యారు.
- సమాధానం: 2
43. Espn Cricinfo అవార్డుల్లో 2016 సంవత్సరానికి ఉత్తమ కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) స్టీవ్ స్మిత్
2) కార్లోస్ బ్రాత్ వైట్
3) అలెస్టర్ కుక్
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ అవార్డుల్లో ఉత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా బెన్ స్టోక్స్, ఉత్తమ టెస్ట్ బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్, ఉత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌గా క్వింటాక్ డి కాక్, ఉత్తమ వన్డే బౌలర్‌గా సునీల్ నరైన్ ఎంపికయ్యారు.
- సమాధానం: 4
44. ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ ప్రకారం భారత్‌లో ఏటా తెగుళ్ల ద్వారా ఎంత శాతం పంటలు నష్టపోతున్నాం ?
1) 35 శాతం
2) 25 శాతం
3) 15 శాతం
4) 10 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐసీఏఆర్ ప్రకారం తెగుళ్ల వల్ల ఏటా 30 నుంచి 35 పంట నష్టం వాటిల్లుతోంది. ఈ తెగుళ్లలలోని నెమిటోడ్స్ పురుగుల వల్ల 60 మిలియన్ టన్నుల మేర పంట దిగుబడులు తగ్గుతున్నాయి.
- సమాధానం: 1
45. దేశంలో తొలి హెలిపోర్ట్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
1) ముంబయి
2) కోల్కత్తా
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూఢిల్లీలోని రోహిణి వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన హెలిపోర్ట్ ఆసియాలోనే మొదటిది. దీనిని పవన్ హాన్స్ లిమిటెడ్ నిర్మించింది.
- సమాధానం: 4
46. బీసీసీఐ జీవిత కాల సౌఫల్య పురస్కారానికి ఎంపికైన మహిళ ఎవరు ?
1) డయానా ఎడుల్జ్
2) శాంతా రంగస్వామి
3) శుభాంగి కులకర్ణి
4) పూర్ణిమారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: బీసీసీఐ ఏటా అందించే సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి శాంతా రంగస్వామి ఎంపికయ్యారు. మహిళా క్రికెటర్‌కు ఈ అవార్డుని ప్రకటించడం ఇదే తొలిసారి. ఈమెతో పాటు రాజేంద్ర గోయల్, పద్మాకర్ శివాల్కర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 2
47. ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా గుర్తింపు పొందిన భారతీయ బీచ్ ఏది ?
1) రామకృష్ణా బీచ్
2) మెరీనా బీచ్
3) అరబిందో బీచ్
4) రాధానగర్ బీచ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పర్యాటకుల ఇచ్చిన సమాచారం ద్వారా ట్రిప్ అడ్వైజర్ సంస్థ ప్రపంచంలోని బీచ్‌లకు ర్యాంకింగ్స్ కేటాయించింది. ఇందులో హావ్లాక్ దీవి (అండమాన్ నికోబార్) లోని రాధానగర్ బీచ్ ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. అలాగే ఆసియాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బీచ్‌గా baia do sancho fernando de noronha ( బ్రెజిల్ ) గుర్తింపు పొందింది.
- సమాధానం: 4
48. ఉగాండా అంతర్జాతీయ సిరీస్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1) జార్జెస్ జుల్ పాల్
2) ఎడ్విన్ ఎక్రింగ్
3) అహ మ్మద్ సలహ్
4) డోమా ఆమ్రో
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉగాండా అంతర్జాతీయ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎడ్విన్ ఎక్రింగ్ను ఓడించి జార్జెస్ జుల్ పాల్ టైటిల్ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 1
49. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 28
2) ఫిబ్రవరి 26
3) ఫిబ్రవరి 24
4) ఫిబ్రవరి 22
- View Answer
- సమాధానం: 1
వివరణ: సర్ సీవీ రామన్1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీనికి గుర్తుగా ఏటా ఆ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
50. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఐపీఎస్ ఎవరు ?
1) కిరణ్ బేడి
2) అరుణా బహుగుణ
3) డోలే బర్మన్
4) దమయంతి సేన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అరుణా బహుగుణ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఇటీవలే పదవీ విరమణ పొందారు. సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఐపీఎస్‌గా కూడా ఆమె గుర్తింపు పొందారు.
- సమాధానం: 2