కరెంట్ అఫైర్స్ (జూన్ 16 - 23) బిట్ బ్యాంక్
1. MGNREGP కింద జాతీయ పురస్కారం అందుకున్న పథకం ఏది ?
1) మిషన్ భగీరథ
2) ప్రాజెక్ట్ జల్‌సంచయ్
3) ప్రాజెక్ట్ కావేరి
4) మిషన్ ఇంద్రధనస్సు
- View Answer
- సమాధానం: 2
వివరణ: బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో నీటి సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన జల్ సంచయ్ పథకానికి MGNREGP జాతీయ పురస్కారం లభించింది.
- సమాధానం: 2
2. ISSF ప్రపంచ కప్ 2017 పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) జితూరాయ్, హీనాసిద్ధు
2) రోసెట్టి గాబ్రియెల్, త్రాషారో నికోలా
3) జాంగ్ జాంగ్ జాంగ్, కిమ్ ఎల్డర్స్
4) రూని నట్టాలై, హ్యూవాంగ్ జీన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అజర్‌బైజాన్‌లోని గాబాలాలో జరిగిన ఈ టోర్నీలో 10 మీటర్ల మిక్స్డ్ డబుల్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జీతూరాయ్, హీనా సిద్ధు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
- సమాధానం: 1
3. ''యుగ్ పురుష్, భారత రత్న, అటల్ జీ'' పుస్తక రచయిత ఎవరు ?
1) వెంకయ్య నాయుడు
2) బీరేంద్రకుమార్ చౌదరి
3) బిషుపాదరాయ్
4) రమేశ్ పొఖ్రియాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేశ్ పొఖ్రియాల్.. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవిత చరిత్రపై ఈ పుస్తకాన్ని రచించారు.
- సమాధానం: 4
4. ప్రపంచ ఆల్బినిజం అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 23
2) జూన్ 18
3) జూన్ 13
4) జూన్ 10
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2014 డిసెంబర్ 18న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా జూన్ 13న అంతర్జాతీయ ఆల్బినిజం (బొల్లి) అవగాహన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించింది. దీంతో బాధపడే వారు సమాజం నుంచి వివక్ష ఎదుర్కోకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 3
5. భారత్, ఆస్ట్రేలియా ఇటీవల ఏ పేరుతో ద్వైపాక్షిక నౌక విన్యాసాలు నిర్వహించాయి ?
1) INDEAUS - 17
2) AUSINDEX - 17
3) AUSIEX - 17
4) INAU - 17
- View Answer
- సమాధానం: 2
వివరణ: రెండు దేశాల నావికా దళాల మధ్య సఖ్యత కోసం ఆస్ట్రేలియాలోని ఫ్రెమంట్లేలో వారం రోజుల పాటు ఈ నౌకా విన్యాసాలను నిర్వహించారు.
- సమాధానం: 2
6. ఇటీవల అంతర్జాతీయ కార్మిక కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు ?
1) రోమ్
2) టోక్యో
3) న్యూఢిల్లీ
4) జెనీవా
- View Answer
- సమాధానం: 4
వివరణ: జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో బాల కార్మికులకు సంబంధించిన రెండు కన్వెన్షన్లకు భారత్ అంగీకారం తెలిపింది. అవి కన్వెన్షన్ 138 - పనిచేసే కనీస వయస్సు నిర్ణయించడం.. కన్వెన్షన్ 182 - బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధించడం.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 35 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారు.
- సమాధానం: 4
7. ANUGA- 2017లో జర్మనీకి సహ భాగస్వామిగా ఎంపికైన దేశం ఏది ?
1) చైనా
2) ఇంగ్లండ్
3) భారత్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార, పానీయాల వాణిజ్య ప్రదర్శన ANUGAను జర్మనీలోని కొలోన్(cologne)లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భారత్ సహ భాగస్వామిగా వ్యవహరించింది.
- సమాధానం: 3
8. 100 అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) గూగుల్
2) ఆపిల్
3) మైక్రోసాఫ్ట్
4) ఫేస్బుక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రాండ్స్ టాప్ 100 అత్యంత విలువైన ప్రపంచ బ్రాండ్ల జాబితాలో 245 బిలియన్ డాలర్ల విలువతో గూగుల్ తొలి స్థానంలో ఉంది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
9. డీఆర్డీవో ఇటీవల పరీక్షించిన నాగ్ క్షిపణి ద్వారా వేటిని నాశనం చేస్తారు ?
1) గెడైడ్ క్షిపణులు
2) యుద్ధ విమానాలు
3) యుద్ధ ట్యాంకులు
4) నిఘా రాడార్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: మూడో తరానికి చెందిన నాగ్ క్షిపణిని యుద్ధ ట్యాంకులను నాశనం చేసేందుకు అభివృద్ధి చేశారు.
- సమాధానం: 3
10. భారత్‌లో ఇటీవల ఏ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు ?
1) భితారిగన్
2) ధాండుకా
3) మంగళవరం
4) కుల్‌తాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హర్యానాలోని ధాండుకా గ్రామం బహిరంగ మల విసర్జన రహితంగా మారినందుకు గాను సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ఆ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు.
- సమాధానం: 2
11. నలంద విశ్వవిద్యాలయంతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది ?
1) హార్వర్డ్ విశ్వవిద్యాలయం
2) సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం
3) తైవాన్ జాతీయ విశ్వవిద్యాలయం
4) దక్షిణ కొరియా విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణకొరియాకు చెందిన అకాడమీ ఆఫ్ కొరియన్ స్టడీస్ ఫర్ అకడమిక్ కొపరేషన్తో నలంద విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సునయన్ సింగ్ నలంద విశ్వవిద్యాలయం ప్రస్తుత వీసీగా ఉన్నారు.
- సమాధానం: 4
12. దేశంలో డయేరియా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
1) ఐడీసీఎఫ్
2) ఐసీడీఎస్
3) ఐడీఈఎఫ్
4) ఐఎంపీఎస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: IDCF - Intensified diarrhoea control fortnight
- సమాధానం: 1
13. ప్రపంచ ఆవిష్కరణల ఇండెక్స్ 2017లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) చైనా
2) స్విట్జర్లాండ్
3) స్వీడన్
4) నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కార్నెల్ విశ్వవిద్యాలయం, INSEAD, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ ఇండెక్స్‌ను రూపొందించాయి. ఇందులో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో ఉంది. స్వీడన్, నెదర్లాండ్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 60వ స్థానంలో ఉంది.
- సమాధానం: 2
14. 2016లో అత్యధిక చెల్లింపులు ఏ దేశానికి వెళ్లాయి ?
1) చైనా
2) జపాన్
3) భారత్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి సంస్థ (ifad) '' Sending money home : contributing to the SDGS, one family at a time'' పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు 62.7 బిలియన్ డాలర్లను భారత్‌కు పంపారు. రెండో స్థానంలో ఉన్న చైనాకు ఆ దేశ ప్రజలు 61 బిలియన్ డాలర్లు పంపారు. 29.9 బిలియన్ డాలర్లతో ఫిలిప్పైన్స్ మూడో స్థానంలో ఉంది.
- సమాధానం: 3
15. నాన్నియోడ్ రాజన్ మెమొరియల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) శ్రీధరన్
2) ఇ.మేఘనాథ్
3) గౌతమ్ ముఖర్జీ
4) రామ్ లల్లా
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిల్మ తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (TRCMPU) నాన్నయోడ్ రాజన్ మెమొరియల్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. 2017 సంవత్సరానికి గాను మెట్రో పితామహుడు ఇ. శ్రీధరన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- సమాధానం: 1
16. అంతర్జాతీయ మాన్‌బుకర్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు ?
1) నోహ ముఖర్జీ
2) ఆనా విలియమ్స్
3) సోఫియా మాస్సన్
4) డేవిడ్ గ్రాస్మోన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇజ్రాయెల్‌కు చెందిన డేవిడ్ గ్రాస్మోన్ A horse walks in to a bar నవలకు గాను ఇంటర్నేషనల్ మాన్‌బుకర్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఈ పురస్కారం కింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి అందిస్తారు. 1969 నుంచి ఇంగ్లీష్‌లో ఎంపిక చేసిన నవలకు ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నారు.
- సమాధానం: 4
17. అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రిబ్యునల్ సభ్యురాలిగా ఎంపికైన భారతీయురాలు ఎవరు ?
1) రాధా సంతలపూడి
2) నీరూ చదా
3) శర్మిష్ట కుమార్
4) శతరూప భట్టాచార్య
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశాల మధ్య సముద్ర జలాల వివాదాల పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితి 1996లో ITLOS (International tribunal for the law of the sea)ని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది సభ్యులుంటారు. వీరిని ఓటింగ్ ద్వారా నామినేట్ చేస్తారు. ITLOS పరిపాలన కార్యాలయం హాంబర్గ్ (జర్మనీ)లో ఉంది. నీరూ చదా 9 ఏళ్ల పాటు ఇందులో సభ్యురాలుగా ఉంటారు.
- సమాధానం: 2
18. అటల్ ఇన్నోవేషన్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1) నారాయణ మూర్తి
2) కె.తారకరామారావు
3) రామనాథన్ రమణన్
4) చంద్రశేఖర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: రామనాథన్ రమణన్ ప్రస్తుతం టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఈయన ఎటువంటి జీత భత్యాలు లేకుండా రేండేళ్ల పాటు ఈ సంస్థ డెరైక్టర్‌గా ఉంటారు. దేశంలో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు, నూతన వ్యాపార ప్రోత్సాహం, స్వయం ఉపాధి కల్పన అటల్ ఇన్నోవేషన్ హబ్ లక్ష్యం.
- సమాధానం: 3
19. బ్లాక్‌హోల్స్ అధ్యయనం కోసం అంతరిక్షంలోకి టెలిస్కోప్‌ను పంపిన దేశం ఏది ?
1) చైనా
2) జపాన్
3) యూఏఈ
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: లాంగ్‌మార్చ్ 4బీ రాకెట్ ద్వారా చైనా 2.5 టన్నుల బరువున్న అంతరిక్ష టెలిస్కోప్‌ను నింగిలోకి పంపింది. ఎక్సరే మాడ్యులేషన్ టెలిస్కోప్ ద్వారా బ్లాక్‌హోల్స్ ఆవిర్భావం, స్వభావం, అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయనున్నారు.
- సమాధానం: 1
20. పశువుల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆన్లైన్ ద్వారా పశువుల విక్రయాలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం Pashubazar.telangana.gov.in వైబ్‌సైట్‌ను ప్రారంభించింది. వారాంతపు సంతల్లో పశువులను విక్రయించేందుకు రైతులు ఎదుర్కొంటున్న వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- సమాధానం: 2
21. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 23
2) జూన్ 20
3) జూన్ 18
4) జూన్ 15
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏటా జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవాన్ని (world elder abuse awareness day) నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2011లో తీర్మానించింది. వృద్ధులపై వేధింపుల నివారణ కోసం ఈ రోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- సమాధానం: 4
22. ఇటీవల ''సబ్కా సాథ్, సబ్కా వికాస్ సమ్మేళన్''ను ఎక్కడ నిర్వహించారు ?
1) గోవా
2) న్యూఢిల్లీ
3) ముంబయి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ సహాయంతో ముంబయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- సమాధానం: 3
23. వాతావరణ ప్రభావ సర్వేలో భారత్ స్థానం ఎంత ?
1) 125
2) 100
3) 75
4) 50
- View Answer
- సమాధానం: 3
వివరణ: యూకేకు చెందిన మని సూపర్ మార్కెట్ నిర్వహించిన ఈ సర్వేలో మొజాంబిక్ తొలి స్థానంలో ఉంది. పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం ఆధారంగా ఇందులో దేశాలకు ర్యాంకులు కేటాయించారు. ఆఫ్రికాలోని చాలా దేశాలు అతి తక్కువ కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ 75వ స్థానంలో ఉంది.
- సమాధానం: 3
24. ప్రతిష్టాత్మక డోర్తి ఆర్జ్నర్ డెరైక్టర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) లిన్నే రామేనే
2) మీరా నాయర్
3) సోఫియా కొప్పోలు
4) నాన్సీ మేయర్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: డోర్తి ఆర్జ్నర్ అమెరికా డెరైక్టర్ గిల్డ్‌లో తొలి మహిళా సభ్యురాలు. ఈమె గౌర వార్థం 1992లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. తొలి పురస్కారాన్ని బార్బ్రా స్ట్రీసాండ్కు ప్రదానం చేశారు.
క్వీన్ ఆఫ్ కాత్వీ చిత్రానికి గాను మీరా నాయర్ ఇటీవల ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
- సమాధానం: 2
25. 5వ భూపెన్ హజరికా జాతీయ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) యెషే డోర్జిథాంగ్చి
2) సర్బానంద సోనోవాల్
3) యువరాజ్ భరణ్ యాదవ్
4) వినయ్ కృష్ణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కవి యెషే డొర్జిథాంగ్చి ఇటీవల ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన సర్హద్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రారంభించింది.
- సమాధానం: 1
26. ట్రాన్స్జండర్లకు ఉచిత విద్య అందించనున్న తొలి భారతీయ విశ్వవిద్యాలయం ఏది ?
1) ఉస్మానియా విశ్వవిద్యాలయం
2) మానోమోనియం సుందరనార్ విశ్వవిద్యాలయం
3) మధురై కామరాజ్ నాడర్ విశ్వవిద్యాలయం
4) ఆంధ్ర విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2017-18 నుంచి ట్రాన్స్ జండర్లకు ఉచిత విద్య అందించనున్నట్లు తమిళనాడులోని మానోమోనియం సుందరనార్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
- సమాధానం: 2
27. ఇటీవల ఏ దేశం భారతీయుల ఖాతాల వివరాల ఇచ్చేందుకు అంగీకరించింది ?
1) జర్మనీ
2) ఇంగ్లండ్
3) పనామా
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల వివరాలు ఇచ్చేందుకు ఇటీవల స్విట్జర్లాండ్ అంగీకరించింది.
- సమాధానం: 4
28. కుసుమరాజు రాష్ట్రీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) రామనందన్
2) ఘంటమనేని కృష్ణారావు
3) శివప్రకాశ్
4) పాయునందన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రముఖ కన్నడ రచయిత హెచ్ ఎస్ శివ ప్రకాశ్ కుసుమరాజ్ రాష్ట్రీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, ఒక జ్ఞాపిక అందజేస్తారు.
- సమాధానం: 3
29. ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందనున్న ప్రముఖ వ్యక్తి ఎవరు ?
1) పి.టి. ఉష
2) అశ్విని నాచప్ప
3) అంజుజార్జ్
4) గీతాంజలి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐఐటీ కాన్పూర్ 50 వ కాన్వకేషన్‌లో గౌరవ డాక్టరేట్‌ను పి.టి. ఉషకు ప్రదానం చేయనుంది.
- సమాధానం: 1
30. తూర్పు, పశ్చిమ జర్మనీల ఏకీకరణ పితామహుడు ఎవరు ?
1) మార్టిన్ బొర్మన్
2) హెల్ముట్ కోల్
3) విల్లి బ్రాండ్ట్
4) క్రిస్టియన్ ఉల్ఫ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: హెల్ముట్ కోల్ ఇటీవల మరణించారు. ఆయన 1982 నుంచి 1998 వరకు జర్మనీకి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు.
- సమాధానం: 2
31. ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూన్ 8
2) జూన్ 12
3) జూన్ 18
4) జూన్ 17
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏటా జూన్ 17న ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 1994లో తీర్మానం చేసింది.
2017 థీమ్ : our land our home our future
- సమాధానం: 4
32. ఆసియాన్ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూన్ 15
2) జూన్ 17
3) జూన్ 19
4) జూన్ 21
- View Answer
- సమాధానం: 1
వివరణ: డెంగ్యూ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 15న ఆసియాన్ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2017 థీమ్ : United fight against dengue
- సమాధానం: 1
33. దేశంలో మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన ఏ ఆశ్రమం ఇటీవల వందేళ్లు పూర్తిచేసుకుంది?
1) శాంతినికేతన్
2) వార్ధా ఆశ్రమం
3) సేవాగ్రామ్
4) సబర్మతి ఆశ్రమం
- View Answer
- సమాధానం: 4
వివరణ: గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున 1917లో ఆశ్రమం ఏర్పాటు చేశారు. 1917 నుంచి 1930 వరకు గాంధీ, కస్తూరిబా తో కలిసి ఇందులో ఉన్నారు.
ఇటీవల ఈ ఆశ్రమం వందేళ్ల పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గోపాల కృష్ణ గాంధీ రచించిన '' లెటర్స్ టూ గాంధీ'', ''పయనీర్ ఆఫ్ సత్యాగ్రహ'' పుస్తకాలను విడుదల చేశారు.
- సమాధానం: 4
34. భారత్ తొలిసారి ఏ దేశానికి సరుకు రవాణా కోసం వాయు రవాణా కారిడార్‌ను ప్రారంభించింది ?
1) అఫ్గనిస్తాన్
2) భూటాన్
3) నేపాల్
4) టిబెట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అఫ్గనిస్తాన్‌కు చెందిన అరియానా అఫ్గన్ ఎయిర్‌లైన్స్ ద్వారా భారత్ నుంచి సరుకులు, వస్తువులను ఆ దేశానికి పంపనున్నారు.
- సమాధానం: 1
35. ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 30
2) జూన్ 24
3) జూన్ 18
4) జూన్ 16
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఏటా జూన్ మూడో ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు.
- సమాధానం: 3
36. భారత్‌లో ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందిన తొలి భవనం ఏది ?
1) తాజ్‌మహల్
2) హోటల్ తాజ్ ప్యాలెస్
3) ఎర్రకోట
4) పార్లమెంట్ భవనం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ట్రేడ్ మార్క్ చట్టం 1999లో అమల్లోకి వచ్చింది. భారత్ నుంచి ఈ మార్క్ పొందిన తొలి భవనం తాజ్ ప్యాలెస్ (ముంబయి). ఎవరైనా తాజ్ ప్యాలెస్ ఫోటోలను వాణిజ్య పరంగా వాడుకోవాలంటే తప్పనిసరిగా ఆ సంస్థ నుంచి అనుమతి పొందాలి.
- సమాధానం: 2
37. ఇటీవల ఏ దేశం భారతీయుల కోసం ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ?
1) బ్రిటన్
2) అమెరికా
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2017 జూలై 1 నుంచి ఆస్ట్రేలియా పర్యాటక వీసా కోసం భారతీయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
- సమాధానం: 4
38. ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(UNHCR) ఇటీవల వెలువరించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఎంత మంది శరణార్థులు ఉన్నారు ?
1) 60.01 మిలియన్లు
2) 65.6 మిలియన్లు
3) 75.02 మిలియన్లు
4) 85.6 మిలియన్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: UNHCR నివేదిక ప్రకారం యుద్ధాలు, అంతర్గత సమస్యల వల్ల అనేక మంది వివిధ దేశాలకు లేదా వివిధ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో జర్మనీ తొలి స్థానంలో ఉండగా అమెరికా, ఇటలీ, టర్కీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 2
39. భారత్‌లో ఎఫ్-16 విమానాల తయారీ కోసం లాక్హిడ్ మార్టిన్ సంస్థ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్
2) రిలయన్స్ డిఫెన్స్
3) మహీంద్రా అండ్ మహీంద్రా
4) హ్యుందాయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లో ఎఫ్-16 విమానాల ఉత్పత్తి యూనిట్‌ను లాక్హిడ్ మార్టిన్ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- సమాధానం: 1
40. జీఎస్టీ సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) సల్మాన్ ఖాన్
2) అమితాబ్ బచ్చన్
3) అమీర్‌ఖాన్
4) షారూఖ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సౌహార్థ రాయబారిగా నియమితులయ్యారు.
- సమాధానం: 2
41. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 30
2) జూన్ 27
3) జూన్ 23
4) జూన్ 20
- View Answer
- సమాధానం: 4
వివరణ: 2000 సంవత్సరం నుంచి ఏటా జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐరాస లెక్కల ప్రకారం 55 శాతం శరణార్థులు అఫ్గనిస్తాన్, ఇరాక్, సోమాలియా, సిరియా, సుడాన్ దేశాలకు చెందినవారు.
- సమాధానం: 4
42. 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు ?
1) జూన్ 8
2) జూన్ 16
3) జూన్ 21
4) జూన్ 28
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 థీమ్ : Yoga for health
- సమాధానం: 3
43. ప్రపంచ పబ్లిక్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 23
2) జూన్ 20
3) జూన్ 17
4) జూన్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐక్యరాజ్య సమితి 2003 నుంచి ఏటా జూన్ 23న పబ్లిక్ సర్వీస్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
2017 థీమ్ : The future is Now
- సమాధానం: 1
44. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత ఎవరు ?
1) కాజుమాసా సకాయ్
2) సోన్ వాన్ హో
3) పారుపల్లి కశ్యప్
4) కిదాంబి శ్రీకాంత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కాజుమాసా సకాయ్ను ఓడించి కిదంబి శ్రీకాంత్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టోర్నీ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సోన్ వాన్ హోను ఓడించాడు.
- సమాధానం: 4
45. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) కజన్
2) ప్రటోరియా
3) బీజింగ్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ సమావేశాన్ని చైనాలోని బీజింగ్‌లో నిర్వహించారు. భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.కే. సింగ్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.
- సమాధానం: 3
46. అరుణ గ్రహంపైకి ఇస్రో పంపిన మంగళయాన్ జీవితకాలం ఎంత ?
1) 6 నెలలు
2) 12 నెలలు
3) 18 నెలలు
4) 24 నెలలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2013 నవంబర్ 5న ఇస్రో మంగళయాన్ ప్రయోగం చేపట్టింది. ఇది 11 నెలల పాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఉపగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహ జీవితకాలం 6 నెలలు (180 రోజులు). కానీ ఇది వెయ్యి రోజుల పాటు మార్స్ ఆర్బిట్‌లో ఉంది. 715 ఫోటోలు తీసి పంపింది.
- సమాధానం: 1
47. ఇటీవల యునిసెఫ్ నూతన సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) రిచర్డ్ ట్యూబర్
2) పీటర్ శిడోల్ఫ్
3) ముజున్ అల్మెల్లెహన్
4) యుస్ర మర్థిని
- View Answer
- సమాధానం: 3
వివరణ: సిరియా నుంచి వచ్చిన 19 ఏళ్ల శరణార్థి ముజున్ అల్మెల్లెహన్ను యునిసెఫ్ సౌహార్థ రాయబారిగా నియమించింది. శరణార్థిగా ఉండి రాయబారిగా నియమితుైలైన తొలి వ్యక్తి, అతి చిన్న వయస్కురాలు ముజున్.
- సమాధానం: 3
48. ఎల్ అండ్ టీ సంస్థ ఏ ప్రాంతంలో భారత నేవీ కోసం ఫ్లోటింగ్ డాక్‌ను నిర్మించింది ?
1) కట్టుపల్లి
2) దుగరాజపట్నం
3) నాగపట్నం
4) పారాదీప్
- View Answer
- సమాధానం: 1
వివరణ: చెన్నైకు దగ్గరలోని కట్టుపల్లి ప్రాంతంలో రూ. 468 కోట్ల వ్యయంతో ఎల్ అండ్ టీ దీనిని నిర్మించింది. దీని పొడవు 185 మీటర్లు. వెడల్పు 40 మీటర్లు.
- సమాధానం: 1
49. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రోబోట్లను వినియోగించిన దేశంలోని తొలి నగరం ఏది ?
1) హైదరాబాద్
2) ఇండోర్
3) భోపాల్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రొ.రాహుల్ తివారి, ప్రొ. అనిరుధ్ శర్మ సంయుక్తంగా ట్రాఫిక్‌ను నియంత్రించే రోబోను అభివృద్ధి చేశారు.
- సమాధానం: 2
50. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూన్ 10
2) జూన్ 14
3) జూన్ 18
4) జూన్ 23
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆధునిక ఒలింపిక్స్ క్రీడలను 1894 జూన్ 23న ప్రారంభించారు. దీనిని పురస్కరించుకొని 1948 నుంచి ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4