కరెంట్ అఫైర్స్ (డిసెంబర్ 1 - 8 ) బిట్ బ్యాంక్
1. అబుదాబి గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్ విజేత ఎవరు ?
1) నికోరోస్బర్గ్
2) లేవిస్ హమిల్టన్
3) సెబాస్టియన్ వెటల్
4) డేనియల్ రిక్కీయార్డో
- View Answer
- సమాధానం: 2
వివరణ: అబుదాబి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను లేవిస్ హమిల్టన్ గెలుచుకున్నాడు. ఇది అతని కెరీర్లో 53వ టైటిల్.
- సమాధానం: 2
2. ఏ దేశంలో ఇటీవల " UNCITRAL" స్వర్ణోత్సవాలు నిర్వహించారు ?
1) అమెరికా
2) బ్రిటన్
3) జర్మనీ
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ వాణిజ్య చట్టాల ఏకీకరణ కోసం 1996లో ఐక్య రాజ్యసమితి సాధారణ సభ UNCITRALను ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2016 నవంబర్‌లో " గ్లోబల్ స్టాండర్డ్స్ ఫర్ రూల్ బేస్డ్ కామర్స్ " పేరిట ఢిల్లీలో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది.
UNCITRAL : United Nations Commission on International Trade Law
- సమాధానం: 4
3. హాంకాంగ్ సూపర్ సీరీస్ - 2016 మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?
1) తెయ్-ట్జు-యింగ్
2) పీవీ సింధు
3) హువాన్ డాన్సింగ్
4) ఇన్హుయి
- View Answer
- సమాధానం: 1
వివరణ: 12వ హాంకాంగ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును ఓడించి తెయ్-ట్జు-యింగ్ టైటిల్ సొంతం చేసుకుంది.
- సమాధానం: 1
4. ఆక్స్ఫర్డ్ ఆర్థికశాస్త్ర విభాగం నివేదిక ప్రకారం ఏ నగరం భారతదేశ ఆర్థిక రాజధానిగా అవతరించింది ?
1) ముంబై
2) హైదరాబాద్
3) చెన్నై
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆక్స్ఫర్డ్ ఆర్థికశాస్త్ర విభాగం ప్రపంచంలోని 50 మెట్రోపాలిటన్ నగరాల జాబితా తయారు చేసింది. రూ 2.53 లక్షల కోట్ల జీడీపీతో 30వ స్థానంలో నిలిచిన ఢిల్లీ దేశ ఆర్థిక రాజధానిగా అవతరించింది. రూ.2.51 లక్షల కోట్ల జీడీపీతో ముంబై 31వ స్థానాన్ని దక్కించుకుంది.
- సమాధానం: 4
5. 47వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) పనాజి
2) హైదరాబాద్
3) మైసూర్
4) పూణె
- View Answer
- సమాధానం: 1
వివరణ: గోవా రాజధాని పనాజిలో 47వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించారు. గోవా ప్రభుత్వ సహకారంతో డైరక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వేడుకలు నిర్వహించాయి.
- సమాధానం: 1
6. ఖతార్ ఓపెన్ టైటిల్ -2016 మహిళల విజేత ఎవరు ?
1) ఖోర్తజ మాడ్సన్
2) చార్లి హళ్
3) అదితి అశోక్
4) లెక్సి థామ్సన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఖతర్ రాజధాని దోహాలో మొదటి ఖతార్ మహిళల ఓపెన్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో నాన్న ఖోర్తజ మాడ్సన్ను ఓడించిన అదితి అశోక్ టైటిల్ కేవసం చేసుకుంది.
- సమాధానం: 3
7. ఆసియన్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించింది ఎవరు ?
1) హరి సుసాంతో
2) సుహస్ ఎల్వై
3) వాంగ్ హ్వన్
4) ల్యారీ చుక్మీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: బీజింగ్‌లో జరిగిన ఆసియన్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండోనేషియాకు చెందిన హరి సుసాంతోను ఓడించి సుహాస్ ఎల్ైవె (భారత్)బంగారు పతకాన్ని సాధించాడు. సుహాస్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్గర్ జిల్లా కలెక్టర్.
- సమాధానం: 2
8. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) నిర్వహించిన డేవిస్ కప్‌ను ఏ దేశం కైవసం చేసుకుంది ?
1) క్రొయేషియా
2) అర్జెంటీనా
3) పోర్చుగల్
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: డేవిస్ కప్‌ను పురుషుల ప్రపంచ టెన్నీస్ కప్‌గానూ పిలుస్తారు. క్రొయేషియాను ఓడించి అర్జెంటీనాఈ కప్‌ను గెలుచుకుంది. ఆదేశం తరపున ఆడిన డెల్‌పొట్రో, ఫిడరికో డెల్బొనిస్ అర్జెంటీనాకు తొలిసారి డెవిస్ కప్‌ను అందించారు.
- సమాధానం: 2
9. ICFT యునెస్కో-గాంధీ పురస్కారానికి ఎంపికైన చిత్రం ఏది?
1) హరమోనియా
2) బెలుగా
3) కోల్డ్ ఆఫ్ కలందర్
4) అలామా
- View Answer
- సమాధానం: 3
వివరణ: టర్కీకి చెందిన ముస్తఫా కారా దర్శకత్వం వహించిన కోల్డ్ ఆఫ్ కలందర్ చిత్రం యునెస్కో-గాంధీ పురస్కారానికి ఎంపికైంది. పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువల ఇతివృత్తంతో ఈ సినిమాను తీశారు.
ICFT: International Council for Films and Television
- సమాధానం: 3
10. దేశంలో తొలి డిజిటల్ గ్రామం ఏది?
1) మంగళంపల్లి
2) అకోదర
3) రాలేగావ్ సిద్ధి
4) పాతరో
- View Answer
- సమాధానం: 2
వివరణ: డిజిటల్ విలేజ్ ప్రాజెక్టు కింద గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాకు చెందిన అకోదరను దత్తత తీసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు గ్రామాన్ని డిజిటలైజ్ చేసింది. గ్రామంలో అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్, డిజిటల్ పరికరాల ఏర్పాటుతో పాటు డిజిటల్ అక్ష్యరాస్యతకు కృషి చేసింది.
- సమాధానం: 2
11. ఆసియాలో అతిపెద్ద సైకిల్ హైవేను ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు ?
1) ఎటానా-మధుర
2) ఆగ్రా-మధుర
3) భోపాల్-ఆగ్రా
4) ఎటానా-ఆగ్రా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని ఎటానా నుంచి ఆగ్రా వరకూ దేశంలోనే తొలి, ఆసియాలో అతిపెద్ద సైకిల్ హైవేను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.
- సమాధానం: 4
12. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించిన భారతీయ చిత్రం ఏది?
1) పింక్
2) పీకూ
3) భజరంగీ భాయ్‌జాన్
4) భాజీరావ్ మస్తానీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళలపై జరిగే హింస ఇతివృత్తంగా తీసిన పింక్ చిత్రాన్ని ఐరాసలో ప్రదర్శించారు.
- సమాధానం: 1
13. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్-2016 విజేత ఎవరు?
1) పంకజ్ అద్వానీ
2) ఆండ్రూ పాగెట్
3) సొహైల్ వహేది
4) జువాజిన్ టంగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఖతార్ రాజధాని దోహలో జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో సొహైల్ వహేది విజేతగా నిలిచాడు. అతడు ఆండ్రూ పాగెట్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో ఆండ్రూ పాగెట్ చేతిలో ఓడిన పంకజ్ అద్వానీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
- సమాధానం: 3
14. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 1
2) డిసెంబర్ 3
3) డిసెంబర్ 5
4) డిసెంబర్ 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1988లో తొలిసారి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్ఐవీపై పజలలోఅవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 1న ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
2016 theme : hands up for HIV prevention
- సమాధానం: 1
15. ప్రపంచ ఆర్థిక ఫోరం గ్లోబల్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వాణిజ్యంలో తొలిస్థానంలో ఉన్న దేశం ?
1) లక్సంబర్గ్
2) హాంకాంగ్
3) నెదర్లాండ్స్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరం 136 దేశాల్లో సీమాంతర వాణిజ్య అవకాశాల కల్పనను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేసింది. ఈ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలువగా నెదర్లాండ్స్, హాంకాంగ్, లక్సంబర్గ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో భారత్ 102వ స్థానంలో నిలిచింది. రష్యా 105, చైనా 61 స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 4
16. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) నవంబర్ 18
2) నవంబర్ 26
3) డిసెంబర్ 2
4) డిసెంబర్ 8
- View Answer
- సమాధానం: 3
వివరణ: డిసెంబర్ 2న బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించాలని 1986లో ఐరాస సాధారణ సభతీర్మానించింది. సమాజంలో పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
- సమాధానం: 3
17. " కాస్ వర్డ్ బుక్ ఆఫ్ ది ఇయర్ " పురస్కారానికి ఎంపికైన పుస్తకం ఏది ?
1) కరేజ్ అండ్ కన్వెక్షన్
2) ప్లేయింగ్ ఇట్ మైవే
3) హౌ ఐ బికెమ్ హిందూ
4) లివింగ్ షాడో
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రాస్ వర్డ్ బుక్ ఆఫ్ ది ఇయర్ ఆటోబయోగ్రఫీ కేటగరిలో సచిన్ టెండూల్కర్ స్వీయచరిత్ర ప్లేయింగ్ ఇట్ మేవే ఎంపికైంది. ఈ పుస్తకాన్ని రాయటంలో బొరియా మంజుదార్ సచిన్‌కు సహకరించారు.
- సమాధానం: 2
18. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) నవంబర్ 30
2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 10
4) డిసెంబర్ 25
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1984 డిసెంబర్ 2న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన పురుగుల మందుల పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని కాలుష్యం, నియంత్రణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని మొదలుపెట్టారు.
- సమాధానం: 2
19. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 10
2) డిసెంబర్ 8
3) డిసెంబర్ 6
4) డిసెంబర్ 3
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1992 డిసెంబర్ 3న తొలిసారి ఐరాస అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించింది.
2016 theme - Achieving 17 goals for the future we want
- సమాధానం: 4
20. ప్రతిష్టాత్మక " ఎస్క్వైర్స్ మ్యాగజైన్ " ఈ ఏటి మేటి అంతర్జాతీయ మహిళగా ఎవరిని ఎంపిక చేసింది ?
1) దీపికా పదుకొనె
2) ప్రియాంకా చోప్రా
3) మారియట్ మార్కస్
4) జెర్మీ లారెన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన ఎస్క్వైర్స్ మ్యాగజైన్ ఈ పురస్కారాలు ప్రదానం చేస్తుంది. 6వ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని దుబాయిలో నిర్వహించారు. ఈ ఏటి మేటి అంతర్జాతీయ మహిళగా దీపికా పదుకొనే పురస్కారాన్ని అందుకోగా పురుషుల విభాగంలో బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్ అవార్డు దక్కించుకున్నాడు. హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ గా ఒమర్ సామ్రా ఎంపికయ్యారు.
- సమాధానం: 1
21. 2016 సంవత్సరానికి ఫార్చూన్ ఇటీవల విడుదల చేసిన 50 ఉత్తమ వ్యాపారవేత్తల జాబితాలో తొలిస్థానంలో ఎవరు ఉన్నారు ?
1) సత్య నాదెళ్ల
2) ఆదిత్యపురి
3) మార్క్ జుకర్‌బర్గ్
4) అజయ్ బంగా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ నుంచి నలుగురు ఈ జాబితాలో చోటు సంపాదించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 5వ స్థానంలో నిలిచారు. ఏవో స్మిత్ కార్పొరేషన్ సీఈవో అజిత్ రాజేంద్ర 34వ స్థానం, హెచ్డీఎఫ్సీ ఎండీ ఆదిత్య పురి 36వ స్థానం, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా 40వ స్థానాన్ని దక్కించుకున్నారు.
- సమాధానం: 3
22. వాటర్ వేవ్ లేసర్‌ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు ?
1) ఇజ్రాయిల్
2) చైనా
3) భారత్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నీటి అలలు, కాంతి ద్వారా లేసర్ కిరణాలు ఉత్పత్తి అయ్యే విధానాన్ని ప్రపంచంలో తొలిసారి ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- సమాధానం: 1
23. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దీవులు ఎక్కడ ఉన్నాయి ?
1) మాల్దీవులు రీఫ్
2) గ్రేట్ బ్యారియర్ రీఫ్
3) న్యూ కాలేడొనియా బ్యారియర్ రీఫ్
4) మెసో అమెరికన్ బ్యారియర్ రీఫ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ దగ్గర గల గ్రేట్ బ్యారియర్ రీఫ్‌ను 1981లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సముద్ర వాతావరణంలో గణనీయమైన మార్పుల వల్ల ఇది వేగంగా నాశనం అవుతోందని ఇటీవల ఆస్త్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు.
- సమాధానం: 2
24. ఆసియాన్ యూత్ కరాటే ఛాంపియన్షిప్ విజేత ఎవరు ?
1) బావో జేమ్
2) బీమ్ వాంగ్
3) జుచురో డాజుమి
4) హషిమ్ మన్సూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 7 ఏళ్ల వయసున్న హషిమ్ మన్సూర్ ఆసియాన్ యూత్ కరాటే ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందాడు.
- సమాధానం: 4
25. హర్న్ బిల్ ఉత్సవాలను ఏరాష్ట్రంలో నిర్వహిస్తారు ?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) నాగాలాండ్
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నాగా జాతి వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం హర్న్ బిల్ ఉత్సవాలను నిర్వహిస్తారు.
- సమాధానం: 3
26. జాతీయ నేవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 4
2) డిసెంబర్ 8
3) డిసెంబర్ 12
4) డిసెంబర్ 16
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించగా అందులో నేవీ కీలక పాత్ర పోషించింది. దానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న భారత జాతీయ నేవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 1
27. టైమ్స్ ఇటీవల విడుదల చేసిన విశ్వ విద్యాలయాల ర్యాంకింగ్స్ -2017లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన భారతీయ విద్యాసంస్థ ఏది?
1) ఐఐటీ ముంబై
2) ఐఐఎస్సీ
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఉన్నత విద్యలో బ్రిక్స్, అభివృద్ధి చెందుతున్న దేశాల విశ్వవిద్యాలయాల టైమ్స్ ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్సీ 14వ స్థానంలో నిలిచింది. ఐఐటీ ముంబై 26వ స్థానం దక్కించుకోగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ 36వ స్థానంలో నిలిచాయి. పరిశోధన, బోధన, పోటీతత్వం, జ్ఞాన సమపార్జన వంటి 13 అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేశారు.
- సమాధానం: 2
28. ఎస్బీఐలో ఇటీవల విలీనమైన ఆర్థిక సంస్థ ఏది?
1) ఎస్బీహెచ్
2) ఆంధ్రా బ్యాంకు
3) భారతీయ మహిళా బ్యాంకు
4) ఐసీఐసీఐ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు విలీనాన్ని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.
- సమాధానం: 3
29. చంద్రుడి మీదకు అంతరిక్ష నౌకను పంపేందుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) NASA
2) ESA
3) JAXA
4) టీమ్ ఇండస్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బెంగళూరుకు చెందిన అంతరిక్ష టెక్నాలజీ సంస్థ-టిమ్ ఇండస్ చంద్రుడి మీదకు వాహక నౌకను పంపేందుకు ఇస్రోతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 60 మిలియన్ డాలర్లు.
- సమాధానం: 4
30. భారత్ ఇటీవల ఏ దేశంతో ఫిరంగుల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
1) రష్యా
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదించేందుకు ఫిరంగులను వాడతారు. భారత్ అమెరికా నుంచి 145 ఆల్ట్రా లైట్ వెయిట్ ఫిరంగులను కొనుగోలు చేస్తోంది. వీటి బరువు 4,100 కేజీలు. 24 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఇవి ధ్వంసం చేయగలవు. ఈ ఫిరంగులను అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరించనున్నారు. ఈ ఒప్పందం విలువ 750 మిలియన్ డాలర్లు.
- సమాధానం: 2
31. ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 5
2) డిసెంబర్ 7
3) డిసెంబర్ 9
4) డిసెంబర్ 11
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఏటా డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జీవం మనుగడలో నేలల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
- సమాధానం: 1
32. యునెస్కో సాంస్కృతికఅదృశ్య (INTANGIBLE)వారసత్వ జాబితాలో ఇటీవల చేర్చిన నృత్యం ఏది ?
1) థింసా నృత్యం
2) వంగాల నృత్యం
3) రూంబా నృత్యం
4) గుస్తాడి నృత్యం
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2003లో సాంస్కృతిక అదృశ్య వారసత్వ సమావేశం నిర్వహించిన యునెస్కో 2008 నుంచి ఈ జాబితాను వెలువరిస్తోంది. క్యూబాకు చెందిన రూంబా నృత్యాన్ని ఇటీవల ఈ జాబితాలో చేర్చారు. బెల్జియంకు చెందిన బీర్, పోర్చుగీసు కుండలు, ఉగాండా సాంప్రదాయ సంగీతాన్నీ జాబితాలో చేర్చారు.
- సమాధానం: 3
33. రెండవ ఐసీసీఆర్ విశిష్ట ఇండాలజిస్ట్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) డా. సన్ యాంగ్
2) ప్రొ. యూ లాంగ్ యూ
3) డా. రంజిత్ పాల్
4) డా.కె.పి.రావ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాకు చెందిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొ. యూ లాంగ్ యూ ఐసీసీఆర్ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
- సమాధానం: 2
34. పీరియాడిక్ టేబుల్లో ఇటీవల ఎన్ని మూలకాలను కొత్తగా చేర్చారు ?
1) 10
2) 08
3) 06
4) 04
- View Answer
- సమాధానం: 4
వివరణ: కొత్త చేర్చిన మూలకాలు : nihonium (nh) 113, moscovium (mc) 115, tennessine (ts) 117, organesson (og) 118
- సమాధానం: 4
35. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ -2016 విజేత ఎవరు ?
1) విశ్వనాథన్ ఆనంద్
2) సెర్గీ కర్జకిన్
3) పెంటేల హరికృష్ణ
4) మాగ్నస్ కార్లసన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రష్యాకు చెందిన సెర్గి కర్జకిన్ను ఓడించి మాగ్నస్ కార్లసన్ (నార్వే) టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- సమాధానం: 4
36. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 3
2) డిసెంబర్ 4
3) డిసెంబర్ 5
4) డిసెంబర్ 7
- View Answer
- సమాధానం: 4
37. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో అత్యుత్తమ వ్యాపారవేత్త ఎవరు ?
1) జాంగ్ యన్ షిన్
2) చెంగ్ వై
3) కెంజీసకాయ్
4) అనిష్ వోహ్రి
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫోర్బ్స్ ఆసియా అత్యుత్తమ వ్యాపార వేత్తల నివేదిక - 2016లో దిది చుక్షింగ్ కంపెనీ సీఈవో చెంగ్వై తొలి స్థానంలో నిలిచారు. ఈయన చైనాలో రైడ్ షేరింగ్ వ్యాపారాన్ని నాలుగేళ్లలో 4 వందల పట్టణాలకు విస్తరించారు. 300 మిలియన్ ప్రయాణికులు సంస్థ సేవలను వినియోగిస్తున్నారు. సంస్థ మార్కెట్ విలువ 17.7 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 2
38. యునిసెఫ్ ఆడ్రీ హెప్ బర్న్ మానవత్వ పురస్కార గ్రహీత ఎవరు ?
1) హిల్లరీ క్లింటన్
2) ఆల్గోర్
3) కాటి పెర్రీ
4) లీకషింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: చిన్న పిల్లల రక్షణకు కృషి చేసినందుకు యునిసెఫ్ సౌహార్థ రాయబారి కాటి పెర్రీ ఆడ్రీ హెప్ బర్న్ మానవత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ది స్పిరిట్ ఆఫ్ కంపాషన్ పురస్కారాన్ని ప్రముఖ రచయిత, మానవతావాది మాల్ ఆండర్సన్ అందుకున్నారు.
- సమాధానం: 3
39. ఆసియాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రదానం చేసే మెంబర్ అసోషియేషన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఏ సంస్థ ఎంపికైంది ?
1) AIFF
2) CFA
3) JFA
4) VFF
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో ఫుట్‌బాల్ క్రీడ విస్తరణ, అభివృద్ధికి చేసిన కృషితో పాటు పారదర్శక విధానాలు అవలంబిస్తున్నందుకు ఏఐఎఫ్ఎఫ్ ఈ పురస్కారానికి ఎంపికైంది.
AIFF- All India foot ball federation
- సమాధానం: 1
40. 7వ ప్రపంచ ఆయుర్వేద సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూయార్క్
2) లండన్
3) కోల్‌కత
4) సిడ్నీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచ ఆయుర్వేద ఫౌండేషన్, ఆయుష్ మంత్రిత్వశాఖ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో కోలకతాలో ప్రపంచ ఆయుర్వేద సమావేశాన్ని నిర్వహించారు. పర్యావరణ హితమే ముఖ్య ఉద్దేశంగా సమావేశాలు సాగాయి.
- సమాధానం: 3
41. త్రిపిఠక్ సుత్రపథ్ మహోత్సవాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించారు ?
1) కాశీ
2) జమ్ము
3) బోద్‌గయ
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పది రోజుల త్రిపిఠక్ సూత్రపథ్ మహోత్సవాన్ని బోద్‌గయలో డిసెంబర్ 2న ప్రారంభించారు. అనేక దేశాల నుంచి సుమారు 3 వేల మందికిపైగా బౌద్ధ సన్నాసులు ఈ ఉత్సవాలకు తరలివచ్చారు.
- సమాధానం: 3
42. IAAF- పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం-2016కు ఎంపికైన క్రీడాకారుడు ఎవరు ?
1) ఉసెన్ బోల్ట్
2) మైఖెల్ ఫెల్ప్స్
3) కార్ల్ లేవిస్
4) మెస్సీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2016తో కలిపి మొత్తం ఆరుసార్లు ఉసెన్ బోల్ట్ ఐఏఏఎఫ్ అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం అందుకున్నాడు. మహిళల అత్యుత్తమ అథ్లెట్‌గా ఇథియోపియాకు చెందిన అల్మాజ్ ఆయన ఎంపికైంది. ఆమె రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది.
- సమాధానం: 1
43. విద్యుత్ సహాయంతో అణు ఇంధనాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వారు ?
1) భారత్
2) రష్యా
3) జపాన్
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 2
44. ప్రపంచంలో అతిపెద్ద పక్షుల ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) ఆస్తానా
2) కజన్
3) ఫోర్త లేజా
4) ఆగ్రా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఉత్తరప్రదేశ్ పర్యావరణ, పర్యాటక అభివృద్ధి కోసం ఆగ్రాలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. చంబల్ అభయారణ్యం బహ్తెహసిల్లో జరిపిన పక్షి ఉత్సవాలకు 26 దేశాల నుంచి 40 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
- సమాధానం: 4
45. ప్రతిష్ఠాత్మక గంగాధర్ జాతీయ పురస్కారం-2015కు ఎవరు ఎంపికయ్యారు ?
1) శ్రీనిధి అగర్వాల్
2) సత్యనారాయణఅగర్వాల్
3) డా.రామ్ నారాయణ్
4) లీలాథర్ జగూడి
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒడిశాకు చెందిన గంగాధర్ మెహ్రా గౌరవార్థం సంబల్పూర్ విశ్వవిద్యాలయం 1989నుంచి గంగాధర్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. పురస్కార గ్రహీతకు రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందించి శాలువాతో సత్కరిస్తారు.
- సమాధానం: 4
46. ప్రతిష్ఠాత్మక ఆసియన్ గోల్ఫ్ టూర్ టైటిల్-2016 విజేత ఎవరు ?
1) ముఖేశ్ కుమార్
2) జాపన్ డే
3) ఆడమ్ స్కాట్
4) జస్టిన్ రోజన్
- View Answer
- సమాధానం: 1
47. దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి నితి ఆయోగ్ ప్రతి జిల్లాకు ఎన్ని రూపాయలు కేటాయించింది ?
1) రూ. 10 లక్షలు
2) రూ. 5 లక్షలు
3) రూ. 3 లక్షలు
4) రూ. లక్ష
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి చోట డిజిటల్ లావాదేవీలు పెంచడానికి నితి ఆయోగ్ ప్రతి జిల్లాకు రూ.5 లక్షలు కేటాయించింది.
- సమాధానం: 2
48. దేశానికి అత్యధిక ఎఫ్‌డీఐలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?
1) ఫ్రాన్స్
2) అమెరికా
3) మారిషస్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలలో 33 శాతం మాషిషస్ నుంచి వస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందం విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి దోహదం చేస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్, అమెరికా, యూకే, నెదర్లాండ్స్ ఉన్నాయి.
- సమాధానం: 3
49. 6వ హార్ట్ ఆఫ్ ఆసియా మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
1) టెల్ అవివ్
2) ఇస్తాంబుల్
3) షాంఘై
4) అమృత్సర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: Theme : పత్యక్ష సవాళ్లను ఎదుర్కోవడం, శ్రేయస్సును సాధించటం
- సమాధానం: 4