కరెంట్ అఫైర్స్ (అక్టోబర్ 17-24) బిట్ బ్యాంక్
1. 5వ ఇండియా అంతర్జాతీయ సిల్క్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) అహ్మదాబాద్
2) కోల్కత్తా
3) న్యూఢిల్లీ
4) కోయంబత్తూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచంలో సిల్క్ ఉత్పత్తిలో ఇండియా రెండో స్థానంలో ఉంది. మల్బరి, టస్సార్, ఇరి, ముగా రకాల పట్టును దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు. సిల్క్ ఉత్పత్తి, మార్కెటింగ్‌ను పెంపొందించడానికి ఇండియా అంతర్జాతీయ సిల్క్ ఉత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 3
2. దేశంలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఏ దేశంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇటలీ
2) జర్మనీ
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలోని వివిధ నౌకశ్రయాలకు రైల్వే సౌకర్యం కల్పించేందుకు లక్ష కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు జర్మనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ పోర్ట్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్ (IPRCL) ఇందులో భాగ్యస్వామం కలిగి ఉంది.
- సమాధానం: 2
3. ఇటీవల ‘ఫామ్ టూరిజం’ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) పశ్చిమ బెంగాల్
3) హిమాచల్ ప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 4
4. ఇటీవల కామన్వెల్త్ గ్రూప్ నుంచి సభ్యత్వం రద్దు చేసుకున్న దేశం ఏది?
1) మాల్దీవులు
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) బర్మా
- View Answer
- సమాధానం: 1
వివరణ: మాల్దీవుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మహమ్మద్ నషీద్‌ను 2012లో పదవి నుంచి తొలగించారు. 2012 నుంచి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో విఫలం కావడంతో, కామన్ వెల్త్ సంస్థ మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని హెచ్చరించింది.
- సమాధానం: 1
5. 17వ ఇండియా - ర ష్యా దేశాల వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) సెయింట్ పీటర్స్ బర్గ్
2) లెనిన్ గ్రాండ్
3) గోవా
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ వార్షిక సమావేశంలో ఇండియా - రష్యామధ్య 16 ఒప్పందాలు కుదిరాయి. S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నాలుగు Admiral Grigorovich-class missile నిర్మాణం, Kamov Ka-226 హెలిక్టాపర్లు, ఆంధ్రప్రదేశ్, హర్యానాలో స్మార్ట్ నగరాల అభివృద్ధి, రష్యా నుంచి ఇండియా గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం వంటి వాటిపై ఒప్పందాలు జరిగాయి.
- సమాధానం: 3
6. శ్రీ మహర్షి వాల్మీకీ జయంతి పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) వీరప్ప మొయిలీ
2) వీరన్న
3) జనార్ధన్ రెడ్డి
4) సిద్ధరామయ్య
- View Answer
- సమాధానం: 2
వివరణ: కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ మంత్రి వీరన్నకు శ్రీ మహర్షి వాల్మీకీ జయంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తారు.
- సమాధానం: 2
7. IAFP యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) రాజ్య వర్ధ్దన్ సింగ్
2) సునీల్ జైస్వాల్
3) డా. సంగీత కులకర్ణి
4) కీర్తిరాజ్ కుండలిక్ గైక్వాడ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ ఆహార భద్రత అసోసియేషన్ (IAEP) ప్రదానం చేసే యువ శాస్త్రవేత్త స్కాలర్షిప్ పురస్కారానికి కీర్తిరాజ్ కుండలిక్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఆయన ఆహార ప్యాకేజింగ్ రంగంలో ఆక్సిజన్ వాడకం మీద పరిశోధనలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఈ పురస్కారం కింద 2000 డాలర్లు నగదు బహుమతి లభిస్తుంది.
- సమాధానం: 4
8. ప్రతిష్టాత్మక గోల్డెన్ ఫుట్ పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) డిడియర్ డ్రోగ్బా
2) ఆండ్రెస్ ఇనిఎస్త
3) శ్యామూల్ ఎటో
4) గ్లియాన్లూగి బప్ఫోన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫుట్‌బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. 2016 అవార్డుకు ఇటలీ క్రీడాకారుడు Gianluigi Buffon ఎంపికయ్యాడు.
- సమాధానం: 4
9. 6వ ప్రపంచ వుషు ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకంను సాధించినది ఎవరు?
1) యెంగ్ కోమ్ జాసన్
2) బుద్ధ చంద్రసింగ్
3) పావ్ చూయ్
4) పిగ్వ క్వాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 6వ ప్రపంచ వుషు ఛాంపియన్షిప్ (6th World Junior Wushu Championship) బల్గేరియాలోని బౌర్గస్లో నిర్వహించారు. మణిపూర్‌కు చెందిన జాసన్యోంగ్ కోమ్ (Jason Yengkhom) 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలుచుకున్నాడు. వుషును 1949లో చైనాలో అభివృద్ధి చేశారు. ఇది చైనా మార్షల్ ఆర్ట్స్‌గా ప్రసిద్ధి.
- సమాధానం: 1
10. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 8
2) అక్టోబర్ 12
3) అక్టోబర్ 17
4) అక్టోబర్ 22
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1987లో మొదటిసారిగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు.
2016 ఇతివృత్తం: Moving from humiliation & exclusion to participation : Ending poverty in all its forms.
- సమాధానం: 3
11. బ్రిక్స్ అండర్ - 17 ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) ఇండియా
2) బ్రెజిల్
3) దక్షిణాఫ్రికా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రిక్స్దేశాల మొదటి U-17 ఫుట్‌బాల్ టోర్నమెంట్ గోవాలో నిర్వహించారు. దక్షిణాఫ్రికాను ఓడించి బ్రెజిల్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 2
12. 8వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) ఫోర్తలేజా
2) కజన్
3) గోవా
4) షాంఘై
- View Answer
- సమాధానం: 3
వివరణ: 8వ బ్రిక్స్ సమావేశాన్ని గోవాలో నిర్వహించారు. ఈ సదస్సులో బ్రిక్స్-బిమ్స్టెక్ నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్. 9వ బ్రిక్స్ సమావేశంను చైనాలో నిర్వహిస్తారు.
- సమాధానం: 3
13. రాష్ట్రీయసాంస్కృతిక మహోత్సవం - 2016 ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) మధురై
3) భువనేశ్వర్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం 2016 ను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌లో 10 రోజులపాటు నిర్వహించారు. న్యూఢిల్లీతో పాటు వారణాసి, బెంగళూరు, జమ్ము కాశ్మీర్ల్లో ఒకేసారిఈ ఉత్సవంను నిర్వహించారు. ఈ ఉత్సవం లక్ష్యం భారత సాంస్కృతిక వారసత్వం, కళలు, నృత్యం, సంగీతంను కాపాడటం.
- సమాధానం: 4
14. ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత సురక్షిత దేశం ఏది?
1) ఖతార్
2) ఫిన్లాండ్
3) యుఏఈ
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ట్రావెల్, టూరిజం రిపోర్ట్స్ ప్రకారం అత్యంత సురక్షిత దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో ఖతార్, యుఎఈ, ఐస్లాండ్ ఉన్నాయి.
- సమాధానం: 2
15. ఎయిర్పోర్ట్ ఆథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ ఏది?
1) ఛండిఘర్ ఎయిర్ పోర్ట్
2) రాయ్పూర్ఎయిర్ పోర్ట్
3) మంగళూరు ఎయిర్ పోర్ట్
4) ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎయిర్పోర్ట్ అథారిటీ విడుదల చేసిన నివేదికలో ఛండీఘర్ ఎయిర్ పోర్ట్ తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో రాయ్‌పూర్, మంగళూరు, ఉదయ్‌పూర్ నిలిచాయి. దక్షిణ భారతదేశంలో అత్యత్తమ ఎయిర్ పోర్ట్ మంగళూరు.
- సమాధానం: 1
16. మాతృభూమి సాహిత్య పురస్కారం 2016నకు ఎంపికైంది ఎవరు?
1) శివాజి సావంత్
2) అంజలి కులకర్ణి
3) సి. రాధా కృష్ణన్
4) పూర్ణ చంద్ర తేజస్వీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: మళయాళ సాహిత్యానికి సేవ చేసిన వారిని గౌరవించటానికి 2001లో మాతృభూమి పత్రిక ‘మాతృ భూమి సాహిత్య పురస్కారం’ను ప్రారంభించింది. ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు ప్రదానం చేస్తారు. రాధాకృష్ణన్ పి రవి మళయాళ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు.
- సమాధానం: 3
17. WBC ఏసియా వెల్టర్‌వెయిట్ టైటిల్ విజేత ఎవరు?
1) బెన్ కైట్
2) క్రిస్ జాన్
3) కిమ్డక్ కో
4) నీరజ్ గోయత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: WBC Asia welterweight title టోర్నమెంట్‌ను న్యూఢిల్లీలో నిర్వహించారు. ఆస్ట్రేలియాకు చెందిన బెన్కైట్ను ఓడించి నీరజ్ గోయత్ ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
- సమాధానం: 4
18. చైనీస్ తైపి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2016ను గెలుచుకుంది ఎవరు?
1) డారెన్ ల్యూ
2) సౌరభ్ వర్మ
3) చెన్ చీ - లీన్ వాంగ్
4) హంగ్ లింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తైపిలో జరిగిన చైనీస్ తైపి ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో మలేషియాకు చెందిన డారెన్ ల్యూను ఓడించి సౌరభ్ వర్మ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్ విజేత ఆయుమిమైన్ (Ayumi mine).
- సమాధానం: 2
19. సార్క్ సూఫి ఉత్సవం 2016ను ఎక్కడ నిర్వహించారు?
1)జైపూర్
2) కాబూల్
3) ఢాకా
4) లాహోర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ ఉత్సవాన్ని ఫౌండేషన్ ఆఫ్ సార్క్ రైటర్స్ అండ్ లిటరేచర్ (FOSWAL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా జైపూర్‌లో నిర్వహించాయి. సార్క్ దేశాల నుంచి ఈ ఉత్సవానికి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
- సమాధానం: 1
20. లాటిన్ అమెరికాలో మొట్టమొదటి ఏనుగుల శాంక్చుయరీని ప్రారంభించిన దేశం ఏది?
1) బ్రెజిల్
2) అర్జెంటీనా
3) ఈక్వెడార్
4) బొలీవియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ శాంక్చుయరీ ఫర్ ఎలిఫెంట్స్ బ్రెజిల్లో మొట్టమొదటి ఏనుగుల శాంక్చుయరీని 2,800 ఎకరాల స్థలంలో ప్రారంభించింది.
- సమాధానం: 1
21. భారత మార్కెట్ క్యాపిటలైజేషన్లో అత్యంత విలువైన కంపెనీ ఏది?
1) ఇన్ఫోసిస్
2) ఓఎన్ జీసీ
3) టీసీఎస్
4) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో టీసీఎస్ మొదటి స్థానంలో ఉంది. టీసీఎస్మార్కెట్ విలువ 4.66 ట్రిలియన్లు. తర్వాతి స్థానాల్లో రిలయన్స్ (3.49 ట్రిలియన్లు), హెచ్డీఎఫ్సీ (3.21 ట్రిలియన్లు), ఐ.టి.సి. (2.90 ట్రిలియన్లు), ఓఎన్జీసీ (2.37 ట్రిలియన్లు).
- సమాధానం: 3
22. ఇండియాలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ పభుత్వ అనుమతిని పొందింది?
1) పెట్రో చైనా
2) బ్రిటిష్ పెట్రోలియం
3) పెట్రో నైజీరియా
4) రాయల్ డచ్‌షెల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూరప్‌లో 3వ అతిపెద్ద ఆయిల్ కంపెనీ బ్రిటిష్ పెట్రోలియం. ఈ కంపెనీ మనదేశంలో2000 కోట్లు పెట్టుబడితో 3500 పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మనదేశంలో రాయల్ డచ్‌షెల్ 82 పెట్రోల్ బంకులను నిర్వహిస్తుంది.
- సమాధానం: 2
23. ఇటీవల IUCN ఏ జంతువును అంతరించి పోయే జీవ జాతుల జాబితాలో చేర్చింది?
1) కాశ్మీర్ జింక
2) కృష్ణ జింక
3) గంగా డాల్ఫిన్
4) గరియాల్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) కాశ్మీర్ రెడ్ స్టాగ్ (జింక)ను అతి తొందరలో అంతరించి పోయే జాబితాలో చేర్చింది. ప్రస్తుతం వీటి జనాభా 150 మాత్రమే.
- సమాధానం: 1
24. ప్రపంచంలో అత్యధిక వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన దేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) పాకిస్థాన్
3) ఇంగ్లాండ్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1974లో మొదటిసారి భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌లను ఆడింది. ఇటీవల ధర్మశాలలో జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లతో ఇండియా 900 వన్డే మైలురాయిని దాటింది. ఇండియా తర్వాత ఆస్ట్రేలియా 888, పాకిస్థాన్ 866 మ్యాచ్‌లు ఆడింది.
- సమాధానం: 4
25. ప్రపంచ ఆస్టియో పోరోసిస్ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 15
2) అక్టోబర్ 20
3) అక్టోబర్ 23
4) అక్టోబర్ 27
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1997లో మొదటి సారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ ఆస్టియో పోరోసిన్ ఫౌండేషన్ (IOF) ప్రజల్లో ఆస్టియో పోరోసిస్ వ్యాధి నివారణ, నిర్ధారణ చిక్సిత మీద అవగాహన పెంచటానికి కృషి చేస్తుంది.
2016 ఇతివృత్తం: Love your bones - Protect your future.
- సమాధానం: 2
26. అంతర్జాతీయ స్టాటిస్టికల్ పురస్కారం 2016 కు ఎవరు ఎంపికయ్యారు?
1) డేవిడ్ కాక్స్
2) సుసాన్ మర్ఫి
3) జయంత్ కుమార్ ఘోష్
4) పీటర్ ఆర్మీటేజ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్టాటిస్టిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారికి పపంచ స్టాటిస్టికల్ కాంగ్రెస్ ఈ పురస్కారాన్నిప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. అవార్డు కింద 75,000 డాలర్లు నగదు బహుమతిని అందిస్తారు.
- సమాధానం: 1
27. జాతీయ పోలీసు సంస్మరణ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 12
2) అక్టోబర్ 16
3) అక్టోబర్ 21
4) అక్టోబర్ 23
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1959లో ఇండియా పోలీసులను చైనా మిలటరీ చంపివేసింది. వారి స్మారకార్థం 1960 నుంచి అధికారికంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
- సమాధానం: 3
28. 2018 రష్యాలో జరిగే పిఫా పుట్‌బాల్ ప్రపంచకప్ మస్కట్‌గా దేనిని ఎంచుకున్నారు?
1) మిస్కా
2) జబివక
3) వోల్వరైన్
4) అముర్ పులి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రష్యాలో స్థానికంగా ఉండే జబివక అనే తోడేలును 2018 పిఫా పుట్‌బాల్ క్రీడల మస్కట్‌గా ప్రకటించారు.
- సమాధానం: 2
29. స్వదే శీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి - ఎలక్ట్రిక్ బస్సును తయారు చేసిన సంస్థ ఏది?
1) మహీంద్రా అండ్ మహీంద్రా
2) టాటా ట్రక్స్
3) బజాజ్ ఆలియంజ్
4) అశోక్ లే లాండ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: హిందుజా గ్రూప్‌కు చెందిన అశోక్ లే లాండ్ సంస్థ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్సును స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది.
- సమాధానం: 4
30. ప్రతిష్టాత్మక సెవన్ స్టార్ లగ్జరీ, లైఫ్ స్టెల్ పురస్కారానికి ఎంపికైన రైలు ఏది?
1) మహారాజ ఎక్స్‌ప్రెస్
2) దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
3) రాజధాని ఎక్స్‌ప్రెస్
4) శతాబ్ది ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ రైల్వేకు చెందిన అత్యంత విలాసవంతమైన రైలు మహారాజ ఎక్స్‌ప్రెస్ ప్రతిష్టాత్మక సెవన్ స్టార్ లగ్జరీ, లైఫ్‌స్టెల్ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 1
31. ఇటీవల ఏ సంస్థ ‘సెప్టెంబర్ 2016’ ను అత్యంత వేడి నెలగా ప్రకటించింది?
1) ఇస్రో
2) చైనిస్ అంతరిక్ష సంస్థ
3) నాసా
4) యూరప్ సైన్స్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: నాసాకు చెందిన Goddard Institute for Space Studies 2016 సెప్టెంబర్నుఅత్యంత వేడి నెలగా ప్రకటించింది.
- సమాధానం: 3
32. గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ముఖ్యమైన నగరాల జాబితాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది?
1) ముంబయి
2) లండన్
3) న్యూయార్క్
4) టోక్యో
- View Answer
- సమాధానం: 2
వివరణ: జపాన్‌కు చెందిన మోరి మెమొరియల్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్బన్ స్ట్రాటజీస్ సంస్థ ‘గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్’ 2016ను తయారు చేసింది. 70 అంశాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన నివేదికలో మొదటి స్థానంలో లండన్, రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో టోక్యో ఉన్నాయి. ఈ జాబితాలో ముంబయి 39వ ర్యాంకులో ఉంది.
- సమాధానం: 2
33. మేక్ ఇన్ ఇండియా అందించే Sustainable Manufacturing Award 2016నకు ఎంపికైన సంస్థ ఏది?
1) మహీంద్రా అండ్ మహీంద్రా
2) రిలయన్స్ డిఫెన్స్
3) మారుతి ఉద్యోగ్
4) టాటా స్టీల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మేక్ ఇన్ ఇండియా పురస్కారాలు 7 కేటగిరీల్లో ప్రదానం చేస్తారు. నాణత్య ప్రమాణాల నిర్వహణ, పర్యావరణ ప్రమాణాల పరిరక్షణ విభాగంలో టాటా స్టీల్ ఇండస్ట్రీస్ ఈ పురస్కారానికి ఎంపికైంది.
- సమాధానం: 4
34. IATA ప్రకారం ఏ సంవత్సరంలోపు ఇండియా మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఎదుగుతుంది?
1) 2026
2) 2023
3) 2021
4) 2018
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1945 క్యూబాలోని హవానాలో IATA సంస్థ ఏర్పాటు అయ్యింది. ప్రపంచంలోని విమానయాన రంగం వృద్ధి, గమనం, ఉత్తమ ఎయిర్ పోర్ట్‌లు, వంటి అంశాల మీద నివేదికలను ఇస్తుంది. 2026 లోపు ఇండియా ఏవియేషన్ మార్కెట్లో మూడో స్థానంలోకి వెళుతుంది. యూకే నాల్గో స్థానానికి పడిపోతుంది. 2029 లోపు చైనా, USA ను వెనక్కి నెట్టి మొదటి స్థానంను ఆక్రమిస్తుంది.
- సమాధానం: 1
35. ఇటీవల INS తిహయును ఎక్కడ జల ప్రవే శం చేయించారు?
1) కొచ్చి
2) విశాఖపట్నం
3) కోల్కత్తా
4) గోవా
- View Answer
- సమాధానం: 2
వివరణ: కార్ నికొబార్ తరగతికి చెందిన ఫాస్ట్ ఎటాక్ నౌక INS Tihayu (తిహయు)ను తూర్పు నావికదళంలో చేర్చి, విశాఖపట్నంలో జల ప్రవేశం చేయించారు. ఈ నౌక పొడవు 49.9 మీ. వెడల్పు 7.5 మీ. ఇది 12-14 నాట్ల గరిష్ట వేగంతో ఆగకుండా 2000 కి.మీ. ప్రయాణం చేయగలదు.
- సమాధానం: 2
36. మొదటి బ్రిక్స్ - బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) బీజింగ్
3) ఢాకా
4) ఇస్లామాబాద్
- View Answer
- సమాధానం:1
37. ఇటీవల ఇండియాను సందర్శించిన మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఎవరు?
1) యింగ్లక్ షినవత్ర
2) మెగావతి
3) థెయిన్ సీన్
4) అంగ్సాన్సూకి
- View Answer
- సమాధానం: 4
38. 28వ అకౌంటెంట్ జన రల్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 28వ అకౌంటెంట్ జనరల్ కాన్ఫరెన్స్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.
- సమాధానం: 3
39. ఇటీవల ‘కౌసల్య సేతు’ పేరుతో విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి కోసం పథకంను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) రాజస్థాన్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా మహారాష్ట్ర కౌసల్య సేతు పేరుతో పథకంను ప్రారంభించింది.
- సమాధానం: 2
40. రెండవ ఇండియా, చైనా వ్యూహత్మక సైనిక విన్యాసాలు ఏ ప్రాంతంలో నిర్వహించారు?
1) లడఖ్
2) నాథులా కనుమ
3) టెజూ
4) జై రామపూర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: Sino India Cooperation 2016 పేరుతో లడఖ్‌లో సంయుక్త విన్యాసాలు నిర్వహించారు.
- సమాధానం: 1
41. వాతవరణ మార్పులను తట్టుకోవడానికి ఇటీవల ఏ బ్యాంక్ బంగ్లాదేశ్‌కు రెండు బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది?
1) ఏసియా అభివృద్ధి బ్యాంక్
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
3) ప్రపంచ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ జపాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బంగ్లాదేశ్‌లో వాతవరణ మార్పులు వలన కల్గిన ఇబ్బందులను ఎదుర్కోవడానికి 2 బిలియన్ డాలర్ల రుణాన్ని, చిన్న పిల్లల్లో పోషకాహారం లోపం తగ్గించటం కోసం 1 బిలియన్ డాలర్ల రుణాన్ని పపంచ బ్యాంక్మంజూరు చే సింది.
- సమాధానం: 3
42. ఇటీవల ఇండియా, రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఆకుల - 2 సబ్‌మెరైన్ విలువ ఎంత?
1) 1 బిలియన్ డాలర్లు
2) 2 బిలియన్ డాలర్లు
3) 3 బిలియన్ డాలర్లు
4) 5 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: Akula-2 అనే న్యూక్లియర్ సబ్ మెరైన్ను రష్యా నుంచి ఇండియా లీజుకు తీసుకోనుంది. ఈ ఒప్పందం విలువ 2 బిలియన్ డాలర్లు. 2020-21 లోపు ఆకుల - 2 ఇండియాకు వస్తుంది. ప్రస్తుతం భారత నౌకదళంలో ఆకుల తరగతికి చెందిన K-152 నెర్సా (INS చక్ర) 2012 నుంచి విధులు నిర్వహిస్తుంది.
- సమాధానం: 2
43. ఇటీవల న్యూయార్క్ స్టాక్ ఎకే్సంజ్లో లిస్ట్ అయిన ఇండియన్ సోలార్ కంపెనీ ఏది?
1) సన్ సోలార్ ప్రై లిమిటెడ్
2) సువెనెసోలార్ ప్రై లిమిటెడ్
3) కావేరి సోలార్
4) అజుర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
44. ప్రపంచ రైల్వే షూటింగ్ ఛాంపియన్షిప్ కప్‌ను గెలుచుకున్న రైల్వే ఏది?
1) కెనడియన్
2) ఇండియన్ రైల్వే
3) అమెరికన్ రైల్వే
4) జర్మన్ రైల్వే
- View Answer
- సమాధానం: 2
45. ఇటీవల పిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) అర్జెంటీనా
2) జర్మనీ
3) బ్రెజిల్
4) బెల్జియం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిపా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో అర్జెంటీనా ఉంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, బ్రెజిల్, బెల్జియం ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా ర్యాంకు 137.
- సమాధానం: 1
46. ప్రతిష్టాత్మక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2016 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) నయన్ ఖనోల్కర్
2) ఎన్. ధవళ్దత్తా
3) సుధారక్ ఓల్వె
4) బెను సేన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ పురస్కారాన్నినేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వైల్డ్‌లైఫ్ సంస్థ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ పోటీకి 30 దేశాల నుంచి 50,000 ఫోటోలు వచ్చాయి. నయన్ ఖనోల్కర్ తీసిన The Alley cat ఫోటోకి ఈ పురస్కారం ప్రదానం చేశారు.
- సమాధానం: 1
47. ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఓటర్ ఎడ్యుకేషన్’ సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) బీజింగ్
2) సింగపూర్
3) న్యూఢిల్లీ
4) టోక్యో
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మొదటి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఓటర్ ఎడ్యుకేషన్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
- సమాధానం: 3
48. ఇటీవల ఇరోమ్ షర్మిలా ప్రారంభించిన నూతన పార్టీ ఏది?
1) ఆవాజ్ - ఎ - మణిపురి
2) పిపుల్ రిసర్జెన్స్, జస్టిస్ అలయన్స్
3) పిపుల్స్ జస్టిస్ పార్టీ
4) మణిపురి గణపరిషత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మణిపూర్‌లో ఆర్మ్డ్ పోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని ఇరోమ్ షర్మిలా16 సంవత్సరాలు నిరహారదీక్ష చేసింది. ఇటీవల నిరాహార దీక్షను విరమించి, ఎన్నికల్లో పోటీ చేసి ఈ చట్టంను రద్దు చేయించేందుకు ‘పీపుల్స్ రిసర్జెన్స్, జస్టిస్ అలయెన్స్ పార్టీని ప్రారంభించింది.
- సమాధానం: 2
49. ఇటీవల న్యూవరల్డ్ వెల్త్ సంస్థ విడుదల చే సిన ‘అత్యంత సంపన్న నగరాల జాబితా’ లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది?
1) శాన్ ఫ్రాన్సిస్కో
2) టోక్కో
3) న్యూయార్క్
4)లండన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూవరల్డ్ వెల్త్ సంస్థఅత్యంత సంపన్న నగరాల జాబితాను విడుదల చేసింది. మొదటి స్థానంలో లండన్ 2.7 ట్రిలియన్ డాల్లర్లతో ఉంది. తర్వాత స్థానాల్లో న్యూయార్క్ (2.6 ట్రిలియన డాలర్లు), టోక్యో (2.2 ట్రిలియన్) డాలర్లు, శాన్ ఫాన్సిస్కో (1.9 ట్రిలియన్ డాలర్లు.) ఈ జాబితాలో ముంబయి 820 బిలియన్ల డాలర్లతో 14వ స్థానంలో ఉంది.
- సమాధానం: 4
50. ఐక్యరాజ్య సమితి దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 18
2) అక్టోబర్ 20
3) అక్టోబర్ 24
4) అక్టోబర్ 26
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్య సమితి దినోత్సవంను 1948 నుంచి అక్టోబర్ 24న నిర్వహిస్తున్నారు. 2016 ఇతివృత్తం: Freedom first.
- సమాధానం: 3