కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
1. శ్రీ ధన్వంతరీ జనరిక్ మెడికల్ స్టోర్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) ఉత్తరాఖండ్
సి) బిహార్
డి) హరియాణ
- View Answer
- Answer: ఎ
2. అన్ని గ్రామ పంచాయతీల్లో భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు కోసం మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్‌పై ఏ రాష్ట్రం సంతకం చేసింది?
ఎ) మహారాష్ట్ర
బి) తమిళనాడు
సి) కేరళ
డి) హరియాణ
- View Answer
- Answer: బి
3. "జష్న్-ఎ-జఫ్రాన్"ను ఇ-ప్రారంభం చేసిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ) తమిళనాడు
బి) తెలంగాణ
సి) జమ్ము, కశ్మీర్
డి) లడాఖ్
- View Answer
- Answer: సి
4. భారత నౌకాదళ ఆయుధ సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, USAతో ఎంత మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ₹378 కోట్లు
బి) ₹401 కోట్లు
సి) ₹356 కోట్లు
డి) ₹423 కోట్లు
- View Answer
- Answer: డి
5. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఎన్ని PM MITRA (టెక్స్టైల్) పార్కుల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది?
ఎ) 6
బి) 7
సి) 8
డి) 9
- View Answer
- Answer: బి
6. ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన అమలును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
ఎ) మహారాష్ట్ర
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: బి
7. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా సిటీ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూపొందించిన ప్రాజెక్ట్ కింద ఎన్ని నగరాలు కవర్ అయ్యాయి?
ఎ) 100
బి) 280
సి) 340
డి) 400
- View Answer
- Answer: డి
8. మొట్టమొదటి ఆధార్ హ్యాకథాన్ 2021ని ఏ ప్రభుత్వ సంస్థ నిర్వహించనుంది?
ఎ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్
సి) UIDAI
డి) నీతి ఆయోగ్
- View Answer
- Answer: సి
9. ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ (IGRUA) డ్రోన్ శిక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ఉత్తరాఖండ్
బి) హరియాణ
సి) హిమాచల్ ప్రదేశ్
డి) గుజరాత్
- View Answer
- Answer: బి
10. ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన (PMASBY)ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) ప్రయాగ్‌రాజ్
బి) లక్ నవూ
సి) వారణాసి
డి) కాన్పూర్
- View Answer
- Answer: సి
11. నీతి ఆయోగ్ ప్రారంభించిన డిజి-బుక్ పేరు?
ఎ) ఇన్నోవేషన్స్ ఫర్ యూ
బి) ఇన్నోవేషన్స్ బై యూ
సి) ఇన్నోవేషన్స్ అండ్ యూ
డి) ఇన్నోవేషన్స్ టు యూ
- View Answer
- Answer: ఎ
12. నిర్మాణ, పారిశ్రామిక కార్మికులకు సబ్సిడీ ధరలకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) హరియాణ
బి) ఉత్తరప్రదేశ్
సి) గుజరాత్
డి) మహారాష్ట్ర
- View Answer
- Answer: సి