కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021)
1. 7 మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది?
ఎ) ₹4900 కోట్లు
బి) ₹5500 కోట్లు
సి) ₹4800 కోట్లు
డి) ₹4455 కోట్లు
- View Answer
- Answer: డి
2. మహాబాహు బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) అసోం
బి) పశ్చిం బంగా
సి) మేఘాలయ
డి) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
3. నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న యుక్తవయస్సులోని బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత లక్ష్యంతో స్వచ్ఛ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తమిళనాడు
సి) కర్ణాటక
డి) కేరళ
- View Answer
- Answer: ఎ
4. ధూళి నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వీయ-పర్యవేక్షణ కోసం 'ధూళి కాలుష్య నియంత్రణ స్వీయ-అంచనా పోర్టల్'ను ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది?
ఎ) న్యూఢిల్లీ
బి) ఉత్తరాఖండ్
సి) హరియాణ
డి) తమిళనాడు
- View Answer
- Answer: ఎ
5. ప్రతిరోజూ 15 లక్షల మందికి టీకాలు వేసేందుకు మిషన్ కవచ్కుండల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) బిహార్
సి) మహారాష్ట్ర
డి) హరియాణ
- View Answer
- Answer: సి
6. భారత్ లో తొలి ఇ-ఫిష్ మార్కెట్ - ‘ఫిష్వాలే’ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) అసోం
బి) ఒడిశా
సి) తమిళనాడు
డి) కేరళ
- View Answer
- Answer: ఎ
7. ఇ-ఎఫ్ఐఆర్ సేవ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ) ఉత్తరాఖండ్
బి) కేరళ
సి) ఆంధ్రప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
8. ఫిషరీస్, పశుసంవర్ధక & పాడిపరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల ఏ రాష్ట్రంలో రివర్ ర్యాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
ఎ) గుజరాత్
బి) బిహార్
సి) ఉత్తర ప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
9. కెరీర్ గైడెన్స్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘దేశ్కే మెంటర్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) మహారాష్ట్ర
బి) ఉత్తరప్రదేశ్
సి) ఢిల్లీ
డి) కేరళ
- View Answer
- Answer: సి
10. కింది రెండు సుదూర సరకు రవాణా రైళ్లలో దక్షిణ-మధ్య రైల్వేలో మొదటి సారి విజయవంతంగా నడపుతున్నది?
ఎ) అక్స్, అగ్ని
బి) గరుడ, అక్స్
సి) పవన్, త్రిశూల్
డి) త్రిశూల్, గరుడ
- View Answer
- Answer: డి
11. దేశంలోని ఆర్థిక మండలాలకు బహుళ-మోడల్ కనెక్టివిటీ కోసం ప్రధాని మోదీ ఏ ప్రణాళికను ప్రారంభించారు?
ఎ) గతిశక్తి
బి) వాయుఅక్షయ్
సి) శక్తిక్షేత్ర
డి) ప్రమాణ్ శక్తి
- View Answer
- Answer: ఎ
12. పరిశ్రమకు తగిన నైపుణ్య శిక్షణను విద్యార్థులకు అందించడానికి నాస్కామ్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) అసోం
బి) ఉత్తరప్రదేశ్
సి) కర్ణాటక
డి) కేరళ
- View Answer
- Answer: సి
13. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు, ఎన్నికలలో పాల్గొనడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?
ఎ) తమిళనాడు
బి) బిహార్
సి) హరియాణ
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
14. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల సంఖ్యను మార్చి 2024 నాటికి ఎన్ని కేంద్రాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) 11500
బి) 12000
సి) 11000
డి) 10000
- View Answer
- Answer: డి