New Chief Justice of Supreme Court: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా లలిత్
Sakshi Education
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్.వి.రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో.. తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్. దీంతో ఆయన పేరును జస్టిస్ రమణ సిఫార్సు చేశారు. కాగా ఈ నెల 26వ తేదీన జస్టిస్ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Aug 2022 07:10PM