Venkaiah Naidu: ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని ఎవరు రచించారు?
సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన ‘రాజ్ కపూర్– ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. డిసెంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... చలనచిత్రాల్లో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, అసభ్యత యువత మనసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయన్నారు. రాజ్ కపూర్ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని చెప్పారు. రాజ్ కపూర్ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని తీసుకొచ్చారు.
యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని..
డిసెంబర్ 14న వారణాసిలో సద్గురు సదాఫల్‌దేవ్ విహంగం యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న స్వర్‌వేద్ మహామందిర్ ఆలయంలో సద్గురు సదాఫల్‌దేవ్, స్వతంత్రదేవ్ మహరాజ్, విజ్ఞాన్‌దేవ్ మహరాజ్‌లకు నివాళులర్పించారు.
చదవండి: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన ‘రాజ్ కపూర్– ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్