KKR India: కేకేఆర్ సలహాదారుగా నియమితులైన బ్యాంకింగ్ దిగ్గజం?
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ ఇండియాకు సీనియర్ సలహాదారుగా బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్ నియమితులయ్యారు. తక్షణం ఈ నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. పెట్టుబడుల నిర్ణయాల విషయంలో ఆయన అపార అనుభవాన్ని వినియోగించుకుంటామని నవంబర్ 9న పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న కామత్, బ్రిక్స్ ఏర్పాటు చేసిన బహుళజాతి బ్యాంక్– న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా 2015 నుంచి 2020 వరకూ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఆయన ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిన్ చైర్మన్‌గా పనిచేశారు.
ఎన్‌బీఎఫ్‌ఐడీ చైర్మన్‌గా...
దేశంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల రుణ సదుపాయాల కల్పనకు కొత్తగా స్థాపించిన నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌బీఎఫ్‌ఐడీ)కి చైర్‌పర్సన్‌గా కామత్ 2021, అక్టోబర్ నెలలో నియమితులయ్యారు. ద్రవ్యలోటు విషయంలో కేంద్రం కొంత సరళతర వైఖరిని అవలంభించాలని కామత్ గతంలో సూచించిన సంగతి తెలిసిందే.
చదవండి: డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ నిర్వహించనున్న హ్యాకథాన్ పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ ఇండియాకు సీనియర్ సలహాదారుగా నియమితులైన బ్యాంకింగ్ దిగ్గజం?
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : కేవీ కామత్
ఎందుకు : పెట్టుబడుల నిర్ణయాల విషయంలో కేకేఆర్ సంస్థకు సహకరించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్