UASG: యూఏ అంబాసిడర్‌గా నియమితులైన భారతీయుడు?
పేటీఎం వ్యవస్థాకుడు విజయ్ శేఖర్ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూపులో చోటు సంపాదించుకున్నారు. యూనివర్సల్ యాసెప్టెన్స్ స్టీరింగ్ గ్రూపు (యూఏఎస్‌జీ).. శర్మను యూఏ (యూనివర్సల్ యాసెప్టెన్స్) అంబాసిడర్‌గా నియమించింది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్‌ఎన్) మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అవకాశం లేని భాషలకు సంబంధించి స్క్రిప్ట్‌లకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫారసు చేస్తుంటుంది. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నామని యూఏఎస్‌జీ చైర్‌పర్సన్ అజయ్ డాటా తెలిపారు. భాషల పరంగా ఉన్న అడ్డంకిని ఛేదించాలన్నది మా ఆలోచన అని పేర్కొన్నారు.
చదవండి: ఇన్వెస్టర్ల కోసం సెబీ అందుబాటులోకి తెచ్చిన యాప్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఏ (యూనివర్సల్ యాసెప్టెన్స్) అంబాసిడర్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : పేటీఎం వ్యవస్థాకుడు విజయ్ శేఖర్ శర్మ
ఎక్కడ : భారత్
ఎందుకు : ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్