హక్కుల నేత, పద్మభూషణ్ గ్రహీత 'ఇలా భట్' అస్తమయం
అసంఘటిత రంగ మహిళా కార్మిక సంఘం సేవాలో ప్రస్తుతం 20 లక్షల మంది సభ్యులున్నారు. ఇలా భట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1933లో జన్మించారు. కొద్ది కాలం పాటు టీచర్‌గా పనిచేశారు. అనంతరం అహ్మదాబాద్ వస్త్ర కార్మిక సంఘం న్యాయ విభాగంలో చేరారు. వస్త్ర రంగంలో పనిచేసే మహిళల కోసం 1972లో సేవాను నెలకొల్పారు. తర్వాత ఇతర రంగాలకూ విస్తరించింది. సేవా ఆధ్వర్యంలో సహకార బ్యాంకు స్థాపన, సూక్ష్మ రుణ ఉద్యమం మొదలయ్యాయి. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. గాంధీ సిద్ధాంతాలను ఆచరించే ఇలా భట్ మహాత్ముడు నెలకొల్పిన గుజరాత్ విద్యాపీఠ్‌కు చాన్స్‌లర్‌గా ఈ ఏడాది అక్టోబర్ వరకు కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలిగా, ప్రణాళికా సంఘం సభ్యురాలిగాను ఆమె పనిచేశారు. రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో శాంతి బహుమతి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్నారు. ఆమెకు అమిమాయి, మిహిర్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP