Chand Basha: సంగీత దర్శకుడు చాంద్ బాషా మృతి
Sakshi Education
నృత్యదర్శకురాలు సుచిత్ర తండ్రి, గేయ రచయిత చంద్రబోస్ మామ, సంగీత దర్శకుడు చాంద్ బాషా (92) జనవరి 6వ తేదీ హైదరాబాద్‌లో మృతి చెందారు.
చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీత దర్శకునిగా చేశారు. తెలుగులో ‘ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు’, కన్నడంలో ‘అమర భారతి, చేడిన కిడికి’ వంటి పలు చిత్రాలకు స్వరాలందించారు. చాంద్ బాషాకి ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు ఉన్నారు. వారిలో సుచిత్ర కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమా తెరకెక్కించారు.
Senior Actor Kaikala Satyanarayana : ప్రముఖ సినీనటుడు సీనియర్ నటుడు కైకాల కన్నుమూత.. ఈయన జీవిత ప్రస్థానం ఇలా..
Published date : 09 Jan 2023 01:00PM