Skip to main content

Chairman of BBC: బీబీసీ చైర్మన్‌గా తొలిసారి భారతీయుడు.. రూ.1.68 కోట్ల వార్షిక వేతనం

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు.
Samir Shah Becomes First Indian Origin Chairman Of BBC   New BBC Chairman

72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్‌ గతంలో బీబీసీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పని చేశారు. 

బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఈ పదవిలో కొనసాగే సమీర్‌ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 సమీర్‌ను కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్‌ టీవీని ఈయన నడుపుతున్నారు.

Australian Senate: ఆస్ట్రేలియా సెనేట్‌కు భారత సంతతి వ్యక్తి ఎన్నిక

Published date : 23 Feb 2024 01:05PM

Photo Stories