సెప్టెంబర్ 2019 వ్యక్తులు
క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఆయన కుటుంబసభ్యుల విదేశీ ప్రయాణాలపై అమెరికా సెప్టెంబర్ 26న ఆంక్షలు విధించింది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటికీ అధికార కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో రౌల్ కాస్ట్రో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది. ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధిస్తున్నారని, ప్రస్తుతం 100 మంది క్యూబన్లు రాజకీయ ఖైదీలుగా ఉన్నారని విమర్శించింది. దివంగత విప్లవ నేత సోదరుడైన రౌల్ కాస్ట్రో(88) ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం వీలుకాదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై ఆంక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : అమెరికా
ఐఎంఎఫ్ ఎండీగా క్రిస్టలీనా జార్జియెవా
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా బల్గేరియాకు చెందిన క్రిస్టలీనా జార్జియెవా ఎంపికయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 25న ఐఎంఎఫ్ తెలిపింది. గతంలో ప్రపంచ బ్యాంక్ సీఈఓగా క్రిస్టలీనా విధులు నిర్వర్తించారు. 189 సభ్యులు కలిగిన ఐఎంఎఫ్‌కు నేతృత్వం వహించనున్న రెండో మహిళగా ఆమె నిలవనున్నారు. అంతర్జాతీయ వృద్ధి నిరాశపరుస్తున్న సమయంలో ఐఎంఎఫ్‌కు నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత అని ఈ సందర్భంగా క్రిస్టలీనా అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఎఫ్ ఎండీగా ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : క్రిస్టలీనా జార్జియెవా
ఐఈసీ చైర్మన్‌గా సురేశ్ చిట్టూరి
ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ఐఈసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐఈసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మొదటి ఆసియా వ్యక్తిగా సురేశ్ గుర్తింపు పొందనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సురేశ్ చిట్టూరి
ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 26వ అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా పదవీ విరమణ చేయడంతో భదౌరియా బాధ్యతలు స్వీకరించారు. 1980లో యుద్ధ విమాన పైలట్‌గా ఐఏఎఫ్‌లో ప్రవేశించిన భదౌరియా 40ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 26 రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 2019, మే నెల నుంచి వైమానిక దళం వైస్ చీఫ్‌గా భదౌరియా పనిచేస్తున్నారు.
భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు సెప్టెంబర్ 19న కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 26వ అధిపతిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా
తెలంగాణలో గాంధీ పుస్తకావిష్కరణ
ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన తెలంగాణలో గాంధీ, మహాత్మాగాంధీ ఇన్ తెలంగాణ అనే పుస్తకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. అలాగే సీఎం పీఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ ఏడేళ్ల క్రితం రాసిన ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను కూడా సీఎం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అక్టోబర్ 1న ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... మహాత్మాగాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ దీక్షల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి, స్వరాష్ట్రం సాధించగలిగామని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో గాంధీ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్
పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లికార్జున రావు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సీహెచ్ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. 2021 సెప్టెంబర్ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ మల్లికార్జునరావు ఈ పదవిలో ఉంటారని ఏసీసీ తెలిపింది. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా మల్లికార్జునరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పీఎన్‌బీలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ, సీఈఓగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సీహెచ్ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు
ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) నియమితులయ్యారు. పీఏసీతో పాటు మరో రెండు కమిటీలకు కూడా చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ సెప్టెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంచనాల కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన పీడిక రాజన్నదొర (సాలూరు-ఎస్టీ), పబ్లిక్ అండర్ టేకింగ్‌స కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట) నియామకమయ్యారు. ఒక్కొక్క కమిటీలో 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గల ఈ మూడు కమిటీల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ): పయ్యావుల కేశవ్ (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, మేరుగ నాగార్జున, భూమన కరుణాకరరెడ్డి, కరణం ధర్మశ్రీ, జోగి రమేశ్, కె.వి.ఉషశ్రీ చరణ్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి. ఎమ్మెల్సీలు: బీద రవిచంద్ర, డి.జగదీశ్వరరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం.
అంచనాల కమిటీ: పీడిక రాజన్నదొర (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): గుడివాడ అమర్‌నాథ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిరణ్‌కుమార్ గొర్లె, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కై లే అనిల్‌కుమార్, మాదిశెట్టి వేణుగోపాల్, మద్దాలి గిరిధరరావు, ఆదిరెడ్డి భవాని. ఎమ్మెల్సీలు: దువ్వారపు రామారావు, పర్చూరు అశోక్‌బాబు, వెన్నపూస గోపాల్‌రెడ్డి.
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ: చిర్ల జగ్గిరెడ్డి (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): గ్రంథి శ్రీనివాస్, కిలారి వెంకట రోశయ్య, జొన్నలగడ్డ పద్మావతి, అన్నా రాంబాబు, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్. ఎమ్మెల్సీలు: ఎం.వెంకట సత్యనారాయణరాజు, గునపాటి దీపక్‌రెడ్డి, సోము వీర్రాజు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : పయ్యావుల కేశవ్
పాఠశాల విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ కాంతారావు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ ఆర్.కాంతారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సెప్టెంబర్ 19న జీవీ జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికిగాను పాఠశాల విద్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
జస్టిస్ రెడ్డి కాంతారావు శ్రీకాకుళం జిల్లాలో 1954 మే 10న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1979లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసిన ఆయన 980లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1993లో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. తర్వాత వివిధ హోదాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. 2008లో హైకోర్టు అదనపు న్యాయమూర్తి, 2010లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016లో పదవీ విరమణ చేశారు. 2017 నుంచి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) హైదరాబాద్ బెంచ్ జ్యుడీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : జస్టిస్ ఆర్.కాంతారావు
ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చెర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఉన్నత విద్యారంగంలోని లోపాల్ని సరిచేసి ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొనేలా ఈ రంగాన్ని తీర్చిదిద్దేందుకు విద్యా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య నియామకంతో ఇప్పటివరకు కొనసాగుతున్న రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఏఎఫ్‌ఆర్‌సీ)ని ప్రభుత్వం రద్దు చేసింది.
జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నల్లగొండ జిల్లా వలిగొండ మండలం, నెమిలికాల్వ గ్రామంలో 1951 మార్చి 10న జన్మించారు. హైదరాబాద్ సిటీ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చెర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
అమెరికా ఎన్‌ఎస్‌ఓగా ఓబ్రియాన్
అమెరికా జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఓ)గా రాబర్ట్ ఓబ్రియాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న అమెరికా ప్రభుత్వ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల శాఖలో ఓబ్రియాన్ పనిచేస్తున్నారు. 2017 జనవరి నుంచి ట్రంప్ హయాంలో ఎన్‌ఎస్‌ఓగా నియమితులైన నాలుగో అధికారి ఓబ్రియాన్. ఎన్‌ఎస్‌ఓగా ఓబ్రియాన్ ముందున్న సవాళ్లలో అణ్వస్త్రాల నిర్మూలనకు ఉత్తరకొరియాను ఒప్పించడం, ఇరాన్‌తో అమెరికా విభేదాలు, ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల సమస్యల పరిష్కారం ప్రధానమైనవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఓ)గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : రాబర్ట్ ఓబ్రియాన్
ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా
భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు సెప్టెంబర్ 19న కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2019, సెప్టెంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. 1980లో యుద్ధ విమాన పైలట్‌గా ఉన్న రాకేశ్ 40ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 26 రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. 2019, మే నెల నుంచి వైమానిక దళం వైస్ చీఫ్‌గా రాకేశ్ పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వైమానిక దళం నూతన అధిపతిగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియా
తేజస్‌లో రక్షణ మంత్రి ప్రయాణం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. దీంతో తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ నిలిచారు. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి సెప్టెంబర్ 19న దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో ఆయన చక్కర్లు కొట్టారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది’ అని అన్నారు. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.
ఏబీసీ నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు. ముంబైలో సెప్టెంబర్ 20న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019-20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మధుకర్ కామత్
హిమాలయన్ ఒడిస్సీ పుస్తకావిష్కరణ
హిమాలయన్ ఒడిస్సీ అనే పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 19న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మలయాళంలోని ‘హైమవత భువిల్’ పుస్తకాన్ని ‘హిమాలయన్ ఒడిస్సీ’ పేరిట కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ వీరేంద్రకుమార్ అనువదించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజల ఆలోచన సరళి మారుతున్నందున నేతలు కూడా సమస్యల మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాలయన్ ఒడిస్సీ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
మద్రాస్ హైకోర్టు సీజే రాజీనామా
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కె. తహిల్ రమణి రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపారు. రమణి స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినీత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 6న రమణి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సెప్టెంబర్ 6 నుంచే ఆమె రాజీనామా అమల్లోకి వచ్చినట్లయింది.
2018, ఆగస్టు 8న తహిల్ రమణిని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019, ఆగస్టు 28న ఆమెను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రమణి కొలీజియాన్ని కోరినప్పటికీ కొలీజియం తిరస్కరించింది. 2020 ఏడాది అక్టోబరులో రమణి పదవీ విరమణ పొందాల్సిఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : జస్టిస్ వి.కె. తహిల్ రమణి
మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీనటుడు నారమల్లి శివప్రసాద్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 21 తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ 1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూటిపల్లిలో జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించిన ఆయన కొంతకాలం వైద్యుడిగా సేవలందించారు. 1999లో సత్యవేడులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి సమాచార, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాల సమయంలో శివప్రసాద్ రోజుకో వేషధారణతో నిరసన తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ఎంపీ, సినీనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నారమల్లి శివప్రసాద్ (68)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఏఐఎంఐఎం పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు. అలాగే పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ-అంచనాల కమిటీ) చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్‌స కమిటీ(పీయూసీ) చైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉమ్మడి సభా కమిటీలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సెప్టెంబర్ 22న ప్రకటించారు.
వివిధ కమిటీల్లోని సభ్యుల వివరాలు
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)
చెర్మన్: అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), సభ్యులు: జైపాల్‌యాదవ్ (కల్వకుర్తి), రవీంద్రకుమార్ నాయక్ (దేవరకొండ), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్ అర్బన్), గ్యాదరి కిషోర్ (తుంగతుర్తి), విఠల్‌రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి (నర్సంపేట), శ్రీధర్‌బాబు (మంథని), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఎమ్మెల్సీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, సయ్యద్ జాఫ్రీ, డి.రాజేశ్వర్‌రావు.
పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ)
చైర్మన్: సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), సభ్యులు: కోనేరు కోనప్ప (సిర్పూర్ కాగజ్‌నగర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), రాజాసింగ్ (గోషామహల్), ఎమ్మెల్సీలు: మీర్జా ఉల్ హసన్ ఎఫెండీ, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత.
పబ్లిక్ అండర్ టేకింగ్‌స కమిటీ(పీయూసీ)
చైర్మన్: ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), సభ్యులు: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (కోరుట్ల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అబ్రహాం (ఆలంపూర్), శంకర్‌నాయక్ (మహబూబాబాద్), దాసరి మనోహర్ రెడ్డి (పెద్దపల్లి), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ), అహ్మద్ పాషా ఖాద్రి (యాకుత్‌పురా), కోరుకంటి చందర్ (రామగుండం), ఎమ్మెల్సీలు: నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్, జీవన్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : అక్బరుద్దీన్ ఒవైసీ
భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) సెప్టెంబర్ 23న ముంబైలో కన్నుమూశారు. 1952-53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లలో 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో ఆయన ఆడారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్ టెండూల్కర్ ప్రతిభను గుర్తించి తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : మాధవ్ ఆప్టే(86)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ప్రముఖ నటుడు వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ (51) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. నల్గొండ జిల్లాలోని కోదాడలో 1969 డిసెంబర్ 30న ప్రభాకర్-సావిత్రి దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. దాదాపు 600 సినిమాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’తో వెండితెరకు పరిచయం అయ్యారు. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రేమాభిషేకం సినిమాను ఆయనే నిర్మించారు. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : వేణుమాధవ్ (51)
ఎక్కడ : సికింద్రాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకేశ్
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ముకేశ్ సంపద రూ.3,80,700 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని సెప్టెంబర్ 25న విడుదలైన ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ముకేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా జాబితాలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్‌పీ హిందూజా అండ్ ఫ్యామిలీ రెండవ స్థానంలో నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లుగా ఉంది. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు.
హురున్ రిచ్ లిస్ట్-ముఖ్యాంశాలు
- రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే.
- అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు.
- రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం.
- సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2 శాతం పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది.
- మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26శాతం) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి.
- స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు.
- జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు.
- సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ నుంచి ఉన్నారు.
ర్యాంకు | వ్యక్తి | కంపెనీ | సంపద (రూ. కోట్లలో) |
1 | ముకేశ్ అంబానీ | రిలయన్స్ ఇండస్ట్రీస్ | 3,80,700 |
2 | హిందూజా సోదరులు | హిందూజా గ్రూప్ | 1,86,500 |
3 | అజీమ్ ప్రేమ్‌జీ | విప్రో | 1,17,100 |
4 | లక్ష్మీ నివాస్ మిట్టల్ | ఆర్సెలర్ మిట్టల్ | 1,07,300 |
5 | గౌతమ్ అదానీ | అదానీ ఎంటర్‌ప్రెజైస్ | 94,500 |
6 | ఉదయ్ కోటక్ | కోటక్ మహీంద్రా బ్యాంక్ | 94,100 |
7 | సైరస్ ఎస్ పూనావాలా | సీరమ్ ఇన్‌స్టిట్యూట్ | 88,800 |
8 | సైరస్ పలోంజీ మిస్త్రీ | షాపూర్‌జీ పలోంజీ గ్రూప్ | 76,800 |
9 | షాపూర్ పలోంజీ | షాపూర్‌జీ పలోంజీ గ్రూప్ | 76,800 |
10 | దిలీప్ సింఘ్వీ | సన్ ఫార్మా ఇండస్ట్రీస్ | 71,500 |
ఏపీ విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్‌కు సీఈవోగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన రాజస్థాన్ బాలిక
బ్రిటన్‌లోని దక్షిణ ఇంగ్లండ్ నుంచి ఉత్తర ఫ్రాన్స్ వరకు ఉన్న ఇంగ్లిష్ చానెల్‌ను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ బాలిక గౌర్వి సింఘ్వీ(16) సెప్టెంబర్ 11న విజయవంతంగా ఈదింది. 40 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను 13 గంటల 26 నిమిషాల్లోనే గౌర్వి ఈదగలిగింది. ఈ క్రమంలో అత్యంత పిన్నవయస్సులో ఈ ఘనత సాధించిన భారతీయ బాలికగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఆమె ముంబై తీరంలోని జుహు నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల 22 నిమిషాల్లో ఈదింది.
ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన అతిపిన్న వయస్సు బాలిక థామస్ గ్రెగరీ. బ్రిటన్‌కు చెందిన ఈ బాలిక 1988లో తన 11 ఏళ్ల వయస్సులో ఇంగ్లిష్ చానెల్‌ను ఈదింది. ఆ తర్వాత ఈ చానెల్‌ను ఈదడానికి కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన రాజస్థాన్ బాలిక
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : గౌర్వి సింఘ్వీ(16)
గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్
ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత వర్ధమాన అథ్లెట్ హిమదాస్ వ్యవహరించనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం పెప్సీకో ఇండియా సెప్టెంబర్ 12న హిమదాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రపంచ చాంఫియన్ పీవీ సింధు, స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్యాటొరేడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు హిమదాస్ ఎంపికైన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : భారత అథ్లెట్ హిమదాస్
ఏపీ ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణరావు నియమితులయ్యారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ బీ రామారావు ఇప్పటివరకు ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఈబీసీ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణరావు
ఏపీ పాఠశాల విద్యాకమిషన్ చైర్మన్‌గా కాంతారావు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు నియమితులు కానున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కమిషన్‌కు వైస్ చైర్మన్‌గా జాతీయ స్థాయిలో పేరు పొందిన విద్యారంగ నిపుణుడు ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్యదర్శి స్థాయి అధికారి సీఈవోగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జస్టిస్ రెడ్డి కాంతారావు
రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకావిష్కరణ
మాజీ కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) వినోద్ రాయ్ రచించిన ‘‘రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను (బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని అన్నారు. ఫిర్యాదుదారులు న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఏపీ టెండర్ల కమిటీ చైర్మన్‌గా జస్టిస్ శివశంకరరావు
ఆంధ్రప్రదేశ్ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు సెప్టెంబర్ 14న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : హెకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా మధుసూదన్‌రెడ్డి
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు (ఐఆర్‌ఏఎస్) చెందిన అధికారి ఎం.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో రైల్వే శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. కర్ణాటకలో మూడేళ్ల పాటు రైల్వే విభాగ ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. మరోవైపు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డి.వాసుదేవరెడ్డి నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఎం.మధుసూదన్‌రెడ్డి
వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సెప్టెంబర్ 15న బులెటిన్ విడుదల చేసింది. ఈ కమిటీలో వివిద పార్టీలకు చెందిన 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
మరికొన్ని కమిటీల ఏర్పాటు
వాణిజ్య కమిటీతో పాటు ఇతర శాఖలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా జయంత్ సిన్హా (బీజేపీ) నియమితులయ్యారు. అలాగే హోం శాఖ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్‌శర్మ(కాంగ్రెస్), పశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కేశవరావు (టీఆర్‌ఎస్), రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కమిటీ చైర్మన్‌గా టీజీ వెంకటేశ్(బీజేపీ) నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : వి.విజయసాయిరెడ్డి
ఎందుకు : వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను పరిశీలించేందుకు
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి సెప్టెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌రెడ్డి చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య లోకాయుక్త ఉద్యోగుల విభజన పూర్తి కానందున... హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం నుంచే జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్డు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ పదవీ కాలం అక్టోబర్ 29వ తేదీ వరకు ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగార్జునరెడ్డి నియామకం అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది.
హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో సంచలన తీర్పులు వెలువరించిన జస్టిస్ నాగార్జునరెడ్డి 1956 డిసెంబర్ 5న వైఎస్సార్ జిల్లా, గడికోట గ్రామంలో జన్మించారు. 1979లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1989-1996 వరకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. తరువాత బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఏపీ హైకోర్టు, ఓఎన్‌జీసీ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. 2006 సెప్టెంబర్ 11న ఏపీ ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 డిసెంబర్ 4న పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు(72) కన్నుమూశారు. హైదరాబాద్‌లో తన స్వగృహంలో సెప్టెంబర్ 16న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించినప్పటికీ కోడెల మృతి చెందారని ఆస్పత్రి వైద్యులు సెప్టెంబర్ 16న ప్రకటించారు.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్మీనర్సమ్మ దంపతులకు కోడెల శివప్రసాదరావు జన్మించారు. ప్రముఖ వైద్యుడిగా నరసరావుపేట ప్రాంతంలో పేరుపొందారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఎన్టీఆర్, చంద్రబాబునాయడు హయాంలో మంత్రి పదవులు చేపట్టారు. 1987 నుంచి 1988 వరకు హోం శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 1996 నుంచి 1997 మధ్య భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, 1997 నుంచి 1999 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : కోడెల శివప్రసాదరావు(72)
ఎక్కడ : హైదరాబాద్
ఏడీబీ అధ్యక్ష పదవికి నకావో రాజీనామా
ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అధ్యక్షుడు టకెహికో నకావో తన పదవికి రాజీనామా చేశారు. 2020, జనవరి 16 నుంచి ఈ రాజీనామా అమల్లోకి ఏడీబీ సెప్టెంబర్ 17న ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు రాజీనామా చేయటంతో కొత్త అధ్యక్షుడిని నిర్ణీత విధానం ప్రకారం ఎన్నుకుంటామని తెలిపింది. ఫిలీప్పీన్స్ రాజధాని మనీలా కేంద్రంగా ఏడీబీ పనిచేస్తుంది. 2013, ఏప్రిల్ 28న ఏడీబీ అధ్యక్షునిగా నకావో బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : టకెహికో నకావో
తొలి మహిళా సైనిక దౌత్యాధికారిగా అంజలి
విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పారు. రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్ అటాచీ’గా అంజలి సెప్టెంబరు 10న బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని మాస్కోలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. విదేశాలతో సంబంధాలు నెలకొల్పడంలో దౌత్యాధికారి కీలకపాత్ర పోషిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళ
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : వింగ్ కమాండర్ అంజలి సింగ్
ఎక్కడ : మాస్కో, రష్యా
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ సెప్టెంబర్ 18న ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. ప్రస్తుతం జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ రాజస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ హృతికేశ్ రాయ్ కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తించారు.
సుప్రీంకోర్టు జడ్జీల గరిష్ట సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 31న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో సెప్టెంబర్ 6న తుదిశ్వాస విడిచారు. 1924, ఫిబ్రవరి 21న బ్రిటిష్ పాలనలోని రొడీషియా(ప్రస్తుత జింబాబ్వే)లో ముగాబే జన్మించారు. 1960లో జింబాంబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జానూ) పార్టీని స్థాపించారు. స్వాతంతా్ర్యనంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1987 నుంచి 2017 వరకు దేశ అధ్యక్ష హోదాలో కొనసాగారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు. ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్ మగగ్వా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : రాబర్ట్ ముగాబే (95)
ఎందుకు : వయోభారం, అనారోగ్యం కారణంగా
వైఎస్సార్ ఛాయలో వల్లీశ్వర్ పుస్తకావిష్కరణ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద పీఆర్‌ఓగా పనిచేసిన వల్లీశ్వర్ రచించిన ’వైఎస్సార్ ఛాయలో జి.వల్లీశ్వర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 8న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. సంస్కారవంతమైన వ్యక్తిత్వంత్డో వైఎస్సార్ ఓ విశిష్టతను చాటారనీ, మనిషిలో నిజాయితీ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని ఆయన భావించేవారని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ ఛాయలో వల్లీశ్వర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఎక్కడ : హైదరాబాద్
గుజరాత్ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్
గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ సెప్టెంబర్ 8న ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విక్రమ్‌నాథ్ అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం 2019, ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది. అయితే ఈ నియామకానికి మోకాలడ్డిన కేంద్రం ఆయన పేరును తిప్పిపంపింది. దీంతో జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీంతో కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గుజరాత్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి దాదాపు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియావకం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : జస్టిస్ విక్రమ్‌నాథ్
ప్రముఖ న్యాయ కోవిదుడు రామ్ జెఠ్మలానీ కన్నుమూత
ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 8న ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జెఠ్మలానీ అంత్యక్రియలు సెప్టెంబర్ 8న ఢిల్లీలో లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. 1923 సెప్టెంబర్ 14వ తేదీన సింథ్(పాకిస్తాన్)లోని షికార్‌పూర్‌లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు. అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.
దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి జెఠ్మలానీ చేరుకున్నారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది.
రాజకీయంగానూ పేరు..
అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా జెఠ్మలానీ పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది.
వాదించిన కేసుల్లో కొన్ని..
సుదీర్ఘ వృత్తి జీవితంలో జెఠ్మలానీ అనేక అంశాలను చేపట్టారు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్‌ల తరఫున కూడా వాదించారు.
- దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా
- మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున
- హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల కేసుల్లో
- 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జిలానీ తరఫున
- విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
- హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా తరఫున
- దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున
- 2013లో మైనర్‌పై రేప్ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు.
ఏమిటి : ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 9న ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్‌రెడ్డి 1945 ఏప్రిల్ 18న వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, పైడిపాళెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కడపలో బీఎస్‌సీ పూర్తి చేసిన ఆయన బెంగళూరు బీఎంఎస్ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1972లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
ప్రముఖ క్రిమినల్ లాయర్, మాజీ ఎంపీ ఊటుకూరు రామిరెడ్డి వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించిన లక్ష్మణ్‌రెడ్డి 1976లో జిల్లా మునిసిఫ్‌గా నియమితులయ్యారు. ఈ హోదాలో పలు ప్రాంతాల్లో చేసి 1990లో జిల్లా జడ్జి గ్రేడ్- 2గా పదోన్నతి పొందారు. ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా సంగారెడ్డి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో పనిచేసి 1997లో జిల్లా జడ్జి గ్రేడ్- 1గా పదోన్నతి పొందారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డెరైక్టర్‌గా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. 2005లో హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2006లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2007లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) హైదరాబాద్ బెంచ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
అలీబాబా చైర్మన్ జాక్ మా రాజీనామా
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా సెప్టెంబర్ 10న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ ప్రస్తుత సీఈఓ డానిఝెల్ ఝాంగ్ జాక్ మా స్థానంలో చైర్మన్‌గా నియమితులయ్యారు. సంస్థ గ్రూప్ బోర్డులో డెరైక్టర్‌గా జాక్ మా కొనసాగనున్నారు. 2013లో అలీబాబా గ్రూప్ సీఈఓ పదవి నుంచి జాక్ మా తప్పుకున్నారు. చైనా ఎగుమతులను అమెరికన్ రిటైలింగ్ కంపెనీలకు అనుసంధానించేందుకు అలీబాబాను 1999లో జాక్‌మా స్థాపించారు. చైనాలో వినియోగదారుల నుంచి ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తించి, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాల్లోకీ ఆయన గ్రూపును విస్తరింపజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : జాక్ మా
అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాన్ బోల్టన్‌కు ఉద్వాసన
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాన్ బోల్టన్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 10న ట్రంప్ వెల్లడించారు. ఉగ్రసంస్థ తాలిబన్ ప్రతినిధులతో క్యాంప్ డేవిడ్‌లో రహస్యంగా భేటీ కావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై ఇరువురి మధ్య వాడీవేడీ వాదనలు జరగడంతో బోల్టన్‌ను తప్పించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాన్ బోల్టన్‌కు ఉద్వాసన
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
దేశంలోనే పిన్నవయసు గవర్నర్‌గా తమిళిసై
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలైన తమిళిసై సౌందరరాజన్(58) సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన గవర్నర్‌గా ఆమె గుర్తింపుపొందారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలకు నియమితులైన 28 గవర్నర్లలో ఒక్క తమిళి సై మాత్రమే 60 ఏళ్లలోపు వయసువారు. గుజరాత్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆచార్య దేవవ్రత్(60) పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(85) దేశంలోనే అత్యంత పెద్దవయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. హరిచందన్ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(84) రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 28 మంది గవర్నర్లలో చాలామంది 70-79 ఏళ్ల వయసువారే ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో సెప్టెంబర్ 11న జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయతో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ ప్రమాణం చేయించారు. కల్‌రాజ్ మిశ్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : బండారు దత్తాత్రేయ
ఎక్కడ : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా మిశ్రా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రమోద్ కుమార్ మిశ్రా(71) నియమితులయ్యారు. అలాగే ప్రధాని ముఖ్య సలహాదారుగా మాజీ కేబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా(64) నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1972 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారైన మిశ్రా, 2014-19 మధ్యకాలంలో ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని ఉన్నత పదవుల భర్తీ విషయంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, విద్యుత్, మౌలికవసతులు, ఆర్థిక రంగాల్లో ఆయనకు విశేషానుభవం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రమోద్ కుమార్ మిశ్రా
ఏపీలో జస్టిస్ శివశంకర్‌రావుకు టెండర్ల బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలను తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ సెప్టెంబర్ 11న ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.
జస్టిస్ శివశంకరరావు 1959 మార్చి 29వతేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం సకుర్రు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పూర్తి చేసిన ఆయన నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించిన శివశంకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చారు. 2019, ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలు అప్పగింత
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు
ఏపీ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నారాయణ
ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ కమిషన్ సభ్యులుగా సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన వ్యవహారాలను బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుంది.
భారతదేశంలో శ్రీశైలం పుస్తకావిష్కరణ
శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్ర, సంస్కృతి, వీర శైవమత విశిష్టతను తెలిపే ‘దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాకులో ఆగస్టు 30న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి ఈ పుస్తకాన్ని గ్రంథస్తం చేశారు. శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్రతోపాటు పంచమఠాలు, అక్కమహాదేవి చరిత్ర, పండుగలు, జాతరలు, మధ్యయుగం నాటి వీరశైవ మత వ్యాప్తి, అనాటి నాణేల విశిష్టతను ఈ పుస్తకం తెలియజేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం
ఎక్కడ : ఏపీ సచివాలయం
పీఎంవో నుంచి వైదొలిగిన సెక్రటరీ మిశ్రా
ప్రధానమంత్రి కార్యలయం(పీఎంవో)లో ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి ఆగస్టు 30న వైదొలిగారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా ప్రధాని మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. దీంతో రెండు వారాలపాటు ఆయన తాత్కాలికంగా కొనసాగుతారు. 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు.
మిశ్రా పీఎంవో నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఇటీవలే కేబినెట్ కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన పీకే సిన్హాను పీఎంఓలో ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’(ఓఎస్డీ)గా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎంవో నుంచి వైదొలిగిన ప్రిన్సిపాల్ సెక్రటరీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : నృపేంద్ర మిశ్రా
భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ షిరీన్ మాథ్యూస్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జడ్జిగా నామినేట్ చేశారు. కాలిఫోర్నియా సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్టికల్-3 జడ్జీగా మాథ్యూస్ పేరును అధ్యక్షుడు ప్రతిపాదించినట్లు నేషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ (ఎన్‌ఏపీఏబీఏ) తెలిపింది. ఆమె పేరు ఆమోదం పొందితే షిరీన్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన మొదటి అమెరికా మహిళగా, భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తారని పేర్కొంది. జీవిత కాలం ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో ఆమె అసిస్టెంట్ అటార్నీగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి
ఎవరు: అటార్నీ షిరీన్ మాథ్యూస్
ఎక్కడ: కాలిఫోర్నియా