Skip to main content

Ravindra Narayana Ravi: తమిళనాడు గవర్నర్‌గా ప్రమాణం చేసిన మాజీ ఐపీఎస్‌?

తమిళనాడు రాష్ట్ర 26వ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్‌ రవీంద్ర నారాయణ్‌ రవి(ఆర్‌ఎన్‌ రవి) ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సెప్టెంబర్‌ 18న జరిగిన కార్యక్రమంలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజిబ్‌ బెనర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఎంకే స్టాలిన్, ప్రతిపక్ష నేత కె. పళనిస్వామి హాజరయ్యారు. మాజీ ఐపీఎస్‌ అయిన ఆర్‌ఎన్‌ రవి 2014 ఆగస్టు 29న నాగా శాంతి చర్చల్లో కేంద్ర తరఫున నియమితులయ్యారు. 2019 ఆగస్టు 1 నుంచి 2021 సెప్టెంబర్‌ 15 వరకు నాగాలాండ్‌ గవర్నర్‌గా పని చేశారు. ఇప్పటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన భన్వరిలాల్‌ పురోహిత్‌ పంజాబ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.

చ‌ద‌వండి: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ప్రమాణం చేసిన సైన్యాధికారి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తమిళనాడు రాష్ట్ర 26వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 18
ఎవరు    : మాజీ ఐపీఎస్‌ రవీంద్ర నారాయణ్‌ రవి(ఆర్‌ఎన్‌ రవి)
ఎక్కడ    : రాజ్‌భవన్, చెన్నై
ఎందుకు  : ఇప్పటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన భన్వరిలాల్‌ పురోహిత్‌ పంజాబ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో...

Published date : 20 Sep 2021 01:31PM

Photo Stories