Skip to main content

Puneeth Rajkumar : బాలనటుడి నుంచి సూపర్‌స్టార్‌గా..సినిమా ప్ర‌స్థానం..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్, అక్టోబర్ 29 శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Puneeth Rajkumar
Puneeth Rajkumar

ఫిట్‌నెస్‌కు  ప్రాధాన్యత ఇచ్చే తమ అభిమాన హీరో అప్పు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం అలు అభిమానులతో పాటు, పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

సినిమా ప్ర‌స్థానం..

Puneeth rajkumar


1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.పునీత్‌  ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు.

వివాహాం:

పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌


పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. అలా కొనసాగిన వారి స్నేహం ఒకరిపై మరొకరికి ప్రేమను పెంచింది. ఎనిమిది నెలల స్నేహం తరువాత పునీత్‌ ఆమెకు ప్రపోజ్ చేయగా, ఆమె వెంటనే అంగీకరించింది. అయితే అన్ని ప్రేమ కథల్లాగానే వీరి స్టోరీలో కూడా అడ్డంకులూ, అభ్యంతరాలూ వచ్చాయి. కానీ ఒపిగ్గా పెద్ద వారిని ఒప్పంచి మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు. వీరి పెళ్లికి పునీత్ కుటుంబం సంతోషంగా ఒప్పుకున్నా,  అశ్విని కుటుంబం  అంగీకరించలేదు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం ఆమోదం తెలిపింది.
           చివరికి 1999న డిసెంబర్ ఒకటిన పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ ప్రశంసలందుకున్నారు. ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  సజావుగా సాగిపోతున్న  వీరి 20 ఏళ్ల కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో, పునీత్‌ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడటం విషాదం.

ఎవరీ అశ్విని రేవంత్‌..?
అశ్విని 1981లో కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండిల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. అనేక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా పని చేశారు. 2019లో పునీత్‌ ప్రొడ్యూస్‌ చేసిన కవల్‌దారి మూవీని ప్రెజంటర్‌గా వ్యవహరించారు. అలాగే వీరిద్దరూ పీఆర్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. అలా 2016లో మాయాబజార్‌, తరువాత ఫ్రెంచ్‌ బిర్యానీ, 02 లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలను తెరకెక్కించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబి నేషన్‌లో ఒక మూవీ ప్రీ-‍ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

తాకిడిని దృష్టిలో పెట్టుకుని..
పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను అక్టోబర్ 31, ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ప‌లువురు ప్ర‌ముఖులు..

Nandamuri Balakrishna


పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ఆయన పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ను ఓదార్చారు. మరికాసేపట్లో చిరంజీవి బెంగళూరుకు చేరుకోనున్నారు.ఇప్పటికే బాలకృష్ణ పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్‌ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్‌, శివబాలాజీ పునీత్‌కు నివాళులు అర్పించారు.

Published date : 30 Oct 2021 04:52PM

Photo Stories