PT Usha: ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష
Sakshi Education
భారత అథ్లెటిక్స్ దిగ్గజం, పరుగుల రాణి పీటీ ఉష క్రీడా పరిపాలకురాలి హోదాలో కొత్త బాధ్యతలు చేపట్టింది.
ప్రతిష్టాత్మక భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికైంది. ఈ పదవికి మరో నామినేషన్ లేకపోవడంతో ఉష ఏకగ్రీవ ఎంపిక గతంలోనే ఖరారు కాగా.. డిసెంబర్ 10వ తేదీ దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58 ఏళ్ల ఉష గుర్తింపు పొందింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ ఒక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులలో డోలా బెనర్జీ (ఆర్చరీ), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్) ఉండగా.. అథ్లెటిక్స్ కమిషన్ సభ్యులుగా మేరీకోమ్ (బాక్సింగ్), ఆచంట శరత్‌కమల్ (టేబుల్ టెన్నిస్) ఎంపికయ్యారు.
Volodymyr Zelensky: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్‌స్కీ
Published date : 12 Dec 2022 04:30PM