Skip to main content

Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంతో ఘ‌న విజ‌యం.. ద్రౌపది ముర్ము ప్రస్థానం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంతో ఘ‌న విజ‌యం సాధించారు.
Presidential Election 2022 Winner Draupadi Murmu
Presidential Election 2022 Winner Draupadi Murmu

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో పాటు బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63 శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. జూలై 25వ తేదీన దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పట్టాభిషేకం చేయనున్నారు. ఎన్డీయే కూటమి తరపున ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసిన విష‌యం తెల్సిందే. ఇక ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా బరిలో దిగిన విష‌యం తెల్సిందే.

ద్రౌపది ముర్ము ప్రస్థానం
సొంతూరు : ఒడిశాలోని     మయూర్‌భంజ్‌ 
పుట్టిన తేదీ : 1958 జూన్‌ 20 (64 ఏళ్లు)
తండ్రి    : బిరంచి నారాయణ్‌ తుడు    (చనిపోయారు) 
భర్త    : శ్యామ్‌ చరణ్‌ ముర్ము (మరణించారు) 
విద్య    : భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్‌ యూనివర్సిటీ నుంచి బీఏ 
సంతానం : ఇద్దరు కుమారులు (మరణించారు)
కూతురు : ఇతిశ్రీ ముర్ము 
పార్టీ    : బీజేపీ 
పదవులు    : 

  • ఒడిశా ఎమ్మెల్యే(2000–09), జార్ఖండ్‌ గవర్నర్‌ (2015–21), 2000లో ఏర్పాటైన జార్ఖండ్‌కు ఐదేళ్ల పూర్తికాలం పనిచేసిన మొదటి గవర్నర్‌ 
  • శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఆనరరీ అసిస్టెంట్‌ టీచర్‌.
  • అనంతరం ఒడిశా నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పనిచేశారు. 
  • 1997లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం. 
  • 1997లో రాయ్‌రంగాపూర్‌ కౌన్సిలర్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక 
  • 2000లో రాయ్‌రంగాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక 
  • 2002 వరకు కేబినెట్‌లో రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా 
  • 2002 నుంచి 2004 వరకు మత్య్స, పశుసంవర్థక శాఖ బాధ్యతలు 
  • 2002–09 మధ్యకాలంలో మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌ 
  • 2004–09 మధ్య రాయ్‌రంగాపూర్‌ ఎమ్మెల్యేగా చేశారు
  • 2006–09లో ఒడిశా బీజేపీ షెడ్యూల్‌ తెగల మోర్చా అధ్యక్షురాలిగా 
  • 2010–15 కాలంలో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్‌ పదవి 
  • 2007 సంవత్సరానికి గాను ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన ఆమెకు ఒడిశా అసెంబ్లీ నీలకంఠ అవార్డు బహూకరించింది.
Published date : 21 Jul 2022 08:07PM

Photo Stories