Telangana Book of Records: తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రీతికి చోటు
Sakshi Education
తన చుట్టూ నిత్యం చూస్తున్న ప్రకృతి, జీవరాశులనే తన కలంతో రాస్తూ అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి తాజాగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు అయింది.
ఈమేరకు ఈనెల 26న అవార్డు అందుకున్నారు. గతంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నోబల్ అవార్డుకు ఎంపికైంది. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ప్రకృతి, జీవరాశులు, ప్రజలు, జీవన విధానాలను నిశితంగా పరిశీలించి పాఠశాలస్థాయి నుంచే కవితలు రాయడం మొదలు పెట్టింది. ఇండియాతో పాటు మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ కాపీరైట్స్ సంపాదించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బుక్‌తో పాటు విత్తనాలు పంపి మొక్కలు పెంచేలా ప్రోత్సహించినందుకు తాజాగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రీతి పేరు నమోదు చేసుకుంది.
Published date : 28 Oct 2023 03:41PM