Skip to main content

PM Modi : అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే అత్యధిక..

భారత ప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోదీ అగ్రస్థానాన్ని సాధించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ

యూఎస్​కు చెందిన గ్లోబల్​ లీడర్​ మార్నింగ్​ కన్సల్ట్​ అనే పొలిటికల్​ ఇంటెలిజెన్స్​ సంస్థ తాజాగా రేటింగ్​లను విడుదల చేసింది. 2022 సంవత్సరానికి గాను సర్వేలో..  భారత ప్రధాని 71 శాతం రేటింగ్​తో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత 66 శాతం రేటింగ్​తో  మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మేన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌ రెండో స్థానంలోను, 60 రేటింగ్​తో ఇటలీ దేశానికి చెందిన మారియో డ్రాఘీ  మూడో స్థానం సంపాదించారు. ఇక ఈ లిస్ట్లో చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు.  ఈ సంస్థ 13 మంది ప్రపంచంలోని నాయకుల జాబితాను తన వెబ్​సైట్​లో విడుదల చేసింది.

అమెరికా అధ్యక్షుడు మాత్రం.. 
వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ 43 శాతం రేటింగ్​తో ఆరోస్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిస్​ ట్రూడో కూడా 43 శాతం రేటింగ్​ సాధించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ 41 శాతం రేటింగ్​ను సాధించారు. మార్నింగ్​ కన్సల్ట్​ పొలిటికల్​ ఇంటెలిజెన్స్​ సంస్థ ఆస్ట్రేలియా, బ్రెజిల్​, కెనడా, ఫ్రాన్స్​,జర్మనీ, ఇండియా, జపాన్​, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్​, యూనైటెడ్​ కింగ్​డమ్​, యూనైటేడ్​ స్టేట్స్​లో ప్రభుత్వ నాయకులు, ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆదరణపై సర్వే నిర్వహిస్తుంది.

2020లో కూడా 84 శాతం రేటింగ్​తో..
మోదీ 2020లో కూడా 84 శాతం రేటింగ్​తో అగ్రస్థానం పొందారు. అయితే, 2021లో మాత్రం ఆయన రేటింగ్​ 63 శాతానికి పడిపోయింది. ఈ సంస్థ ప్రధానంగా ఎన్నికైన నాయకులు, అధికారులు, స్థానిక ఓటింగ్​ సమస్యలపై ఆయాప్రాంతాలలోసర్వే నిర్వహిస్తుంది.

ప్రధానంగా స్థానికంగా ఉన్నవయోజనులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు దాదాపు 20,000 కంటె ఎక్కువ మందిని కలుస్తారు. సర్వేలో ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తారు. దేశాన్ని బట్టి నమునాలు మారుతూ ఉంటాయి.

Published date : 21 Jan 2022 05:16PM

Photo Stories