Ayaz Sadiq: పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా సాదిక్
Sakshi Education
పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్)(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)మరికొన్ని పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ కూటమిలో పదవుల పంపిణీ కొలిక్కి వస్తోంది.
నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవికి మార్చి 2వ తేదీ జరిగిన ఓటింగ్‌లో పీఎంఎల్–ఎన్ సీనియర్ నేత సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్‌గా పీపీపీ నేత గులాం ముస్తాఫాషా ఎన్నికయ్యారు.
అయాజ్ సాదిక్‌కు 291 ఓట్లకు గాను 199 ఓట్లు రాగా, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ బలపరిచిన అమిర్ డోగార్‌కు 91ఓట్లు దక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పారీ్టకి చెందిన ప్రజాప్రతినిధులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్–ఎన్ బలపరిచిన అభ్యర్థి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
Published date : 02 Mar 2024 12:47PM