Skip to main content

Baljeet Kaur: భారత పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ అదృశ్యం?

ఎనిమిది వేల మీటర్ల ఎత్తు ఉన్న నాలుగు పర్వతాలను అదిరోహించి రికార్డులకెక్కిన భారతదేశ పర్వతారోహకురాలు బల్జిత్‌ కౌర్ అదృశ్యమైంది.
Baljeet Kaur

బల్జీత్ కౌర్ సప్లిమెంటరీ ఆక్సిజన్‌ను ఉపయోగించకుండా నేపాల్‌లోని ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా క్యాంప్-4 వైపు వస్తుండగా బల్జీత్ కౌర్ కనిపించకుండా పోయింది. ఈమెతో పాటు మ‌రో ఇద్ద‌రు ప‌ర్వాతారోహ‌కులు క‌నిపించ‌డం లేద‌ని స‌మాచారం. వీరి అచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే బల్జీత్ కౌర్ ప్రాణాలతో బయటపడినట్లు, అమెను ఏరియల్ సెర్చ్ టీమ్ గుర్తించిందని పయనీర్ అడ్వెంచర్ ప్రెసిడెంట్ పసాంగ్ షెర్పా తెలిపారు. అలాగే అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన పర్వతారోహకుడు అనురాగ్ మాలు ఏప్రిల్ 17న‌ అదృశ్యం అయ్యాడు. 

కాగా  హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ ఒకే నెల‌లో 8 వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న నాలుగు పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కారు. ఆమె ప్రపంచంలోని 8 వేల మీట‌ర్ల పైన ఉన్న ఆరు ప‌ర్వ‌తాలను అత్యంత వేగంగా అధిరోహించిన మొదటి భారతీయ మ‌హిళ‌గా(5 నెలల 2 రోజులు) కూడా రికార్డు సాధించారు. 

Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్..

 

Published date : 18 Apr 2023 04:21PM

Photo Stories