Mallikarjun Kharge : 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే.. ఈయన రాజకీయ ప్రస్థానం ఇదే..
చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలయ్యాయి.
అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించిన విషయం తెల్సిందే. అక్టోబర్ 19వ తేదీ (బుధవారం) ఈ ఫలితాలను వెల్లడించారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అదీ గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి హస్తం పార్టీ పగ్గాలు అందుకుంటున్నారు.
రెండో దళిత వ్యక్తిగా..
కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన మల్లికార్జున ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తి కావడం మరో విశేషం. కాంగ్రెస్‌కు మొట్టమొదటి దళిత అధ్యక్షుడిగా తెలుగోడు దామోదరం సంజీవయ్య 1962లో నియమితులయ్యారు. ఆయన తర్వాత ఇప్పుడు ఖర్గే పగ్గాలు చేపడుతున్నారు.
Also read: Local Language: కోర్టుల్లో స్థానిక భాష... ఆలిండియా న్యాయ మంత్రుల సదస్సులో మోదీ
మల్లికార్జున ఖర్గే రాజకీయ ప్రవేశం ఇలా..
➤ విద్యార్థి దశలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభం.
➤ గుల్బర్గా కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ నేతగా రాణించారు.
➤ అనంతరం స్టూడెంట్ బాడీకి జనర్ సెక్రెటరీగా ఎన్నిక
➤ గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్ బీ పూర్తి
➤ 1969లో ఎంఎస్కే మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు లీగల్ అడ్వైజర్ గా
➤ చదువునే రోజుల్లో కబడ్డీ, హాకి, క్రికెట్ వంటి క్రీడలపై ఆసక్తి కనబర్చేవారు.
కాంగ్రెస్ లో చేరిక ఎప్పుడంటే..
➤ 1969లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిక
➤ 1972 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ప్లస్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
➤ తొలిసారిగా 1972లో గుర్ మిత్కల్ నియోజకవర్గం నుంచి గెలుపు, అనంతరం 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004 వరకు మళ్లీ గుర్ మిత్కల్ నియోజకవర్గం నుంచి గెలిచారు.
➤ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో చితాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
లోక్‌సభకు మాత్రం..
➤ 2009 లోక్ సభ ఎన్నికల్లో ఖర్గే గల్బర్గ నుంచి పోటీచేసి విజయం సాధించి పార్లమెంట్లోకి తొలిసారిగా అడుగుపెట్టారు.
➤ 2014 లోక్ సభ ఎన్నికల్లో గుల్బర్గ నుంచి రెండో సారి విజయం
➤ 2014 జూన్ లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నియామకం
➤ 2019 లోక్ సభ ఎన్నికల్లో గుల్బర్గ నుంచి పోటీచేసి ఓటమిక
Amit Shah: గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా
పదవులు..
➤1978లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన ఖర్గే
➤1980లో రెవెన్యూ మంత్రిగా రాష్ట్రంలో 400 ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు
➤1985లో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు డిప్యూటీ నేతగా పనిచేశారు.
➤ 1990లో ఖర్గే రెవెన్యూ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ఆగిపోయిన భూ సంస్కరణలను మళ్లీ ప్రారంభించారు. భూమిలేని వారికి భూములను పంపిణీ చేశారు.
➤ 1992-94 కాలంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
➤ 1994లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
➤ 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల అనంతర సీఎం పదవి రేసులో ఖర్గే ఉన్నప్పటికీ చివరికి మంత్రి పదవులకే పరిమితమయ్యారు.
➤ 1999లో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు
➤ 2004లో రవాణా శాఖా మంత్రిగా పని చేసిన అనుభవం.
➤ 2005లో కర్నాటక కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం
➤ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి. ఖర్గే తొమ్మిదోసారి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
➤ అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియామకం అయ్యారు.
➤ 2020 లో రాజ్యసభకు కర్నాటక నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక
➤ 2021 ఫిబ్రవరి 12 న రాజ్య సభలో ఖర్గే ప్రతిపక్ష నేతగా నియమింపబడ్డారు
కుటుంబం :
మల్లికార్జున ఖర్గే భార్య పేరు రాధాబాయ్ ఖర్గే. వీరికి ఐదుగురు సంతానం.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP