Life Insurance Corporation of India: ఎల్‌ఐసీ సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఎఫ్‌వోగా ఆయన బాధ్యతలను స్వీకరించినట్టు మార్చి 3న ఎల్‌ఐసీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాంగి సంజయ్ సోమాన్ సీఎఫ్‌వో బాధ్యతలు చూశారు. సునీల్ అగర్వాల్ గతంలో రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో సీఎఫ్‌వోగా 12 ఏళ్లపాటు పనిచేశారు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు 5 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
ఫిస్డమ్‌తో యూకో బ్యాంక్ జోడీ
ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ తాజాగా పెట్టుబడి సేవలు అందిస్తున్న ఫిస్డమ్‌తో చేతులు కలిపింది. దీని ప్రకారం డీమ్యాట్ ఖాతా, స్టాక్ బ్రోకింగ్, పెన్షన్ ఫండ్స్, ట్యాక్స్ ఫైలింగ్ సేవలు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయిన యూకో ఎంబ్యాంకింగ్ ప్లస్‌లో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఫిస్డమ్ సేవలు అందిస్తున్న సంస్థల్లో ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కర్నాటక బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి.
Securities and Exchange Board of India: సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : సునీల్ అగర్వాల్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్