Skip to main content

Securities and Exchange Board of India: సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?

Madhabi Puri Buch-SEBI

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ– సెక్యూరిటీస్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా మాజీ బ్యాంకర్‌ మాధవీ పురీ బుచ్‌ మార్చి 2న బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఒక మహిళ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే ఈ కీలక బాధ్యతలు చేపట్టిన తొలి నాన్‌–బ్యూరోక్రాట్‌ కూడా మాధవీనే. ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న అజయ్‌ త్యాగి స్థానంలో మాధవీ పురీ నియామకం జరిగింది. అజయ్‌ త్యాగి ఫిబ్రవరి 28వ తేదీన సెబీ చీఫ్‌గా బాధ్యతలు విరమించారు. సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ..
ఫైనాన్షియల్‌ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన 57 ఏళ్ల మాధవీ.. ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రయివేట్‌ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి  త్యాగితో కలసి 2017 ఏప్రిల్‌ 5 నుంచి 2021 అక్టోబర్‌ 4వరకూ పలు విధులు నిర్వర్తించారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్‌ పదవికి అభ్యర్ధుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది.

చ‌ద‌వండి: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సెక్యూరిటీస్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
ఎప్పుడు  : మార్చి 2
ఎవరు    : మాజీ బ్యాంకర్‌ మాధవీ పురీ బుచ్‌
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : ఇప్పటివరకు సెబీ చీఫ్‌గా ఉన్న అజయ్‌ త్యాగి తాజాగా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 12:56PM

Photo Stories