Justice Prashant Kumar Mishra: ఏపీ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడింది.
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేపథ్యం...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో 1964, ఆగస్టు 29న జన్మించిన జస్టిస్ మిశ్రా... బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
చదవండి: రాజ్యాంగ పదవిలో 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
ఎందుకు : సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్