జనవరి 2019 వ్యక్తులు
Sakshi Education
మలేసియా రాజుగా సుల్తాన్ అబ్దుల్లా
మలేసియా కొత్త రాజుగా సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా జనవరి 24న నియమితులయ్యారు. 2019, జనవరి 31న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు రాజుగా ఉన్న సుల్తాన్ మహమ్మద్-5 పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త చక్రవర్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేసియా రాజు నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా
యస్ బ్యాంక్ సీఈవోగా రవ్‌నీత్ సింగ్
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈవోగా రవ్‌నీత్ సింగ్ గిల్ నియామకానికి ఆర్‌బీఐ జనవరి 24న ఆమోదం తెలిపింది. జనవరి 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్‌నీత్ మార్చి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2012, ఆగస్టు నుంచి డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్న రవ్‌నీత్‌కు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యస్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రవ్‌నీత్ సింగ్ గిల్
ఇండిగో నూతన సీఈవోగా రణజయ్ దత్తా
విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈవోగా రణజయ్ దత్తాను నియమించినట్లు జనవరి 24న ఇండిగో సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం యునెటైడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా దత్తా పనిచేస్తున్నారు. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను ఇండిగో చైర్మన్‌గా ఆ సంస్థ నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండిగో నూతన సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రణజయ్ దత్తా
స్వాతంత్య్ర సమరయోధుడు ఇంద్రసేనా కన్నుమూత
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు అడవల్లి ఇంద్రసేనారెడ్డి(88) కన్నుమూశారు. నల్లగొండ జిల్లా తెప్పలమడుగు గ్రామంలో గుండెపోటుతో జనవరి 25న తుదిశ్వాస విడిచారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన రజాకార్ల సమయంలో తెలంగాణ కోసం ఆయన పోరాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : అడవల్లి ఇంద్రసేనారెడ్డి(88)
ఎక్కడ : తెప్పలమడుగు, నల్లగొండ జిల్లా, తెలంగాణ
ప్రముఖ రచయిత్రి కృష్ణాసోబ్తీ కన్నుమూత
ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణాసోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. 1925లో జన్మించిన ఆమె సుప్రసిద్ధ వ్యాసరచయితగా గుర్తింపుపొందారు. ఆమె రచించిన మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ గతంలో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : కృష్ణాసోబ్తీ
ఎక్కడ : ఢిల్లీ
గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ
డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రచించిన ‘గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జనవరి 27న జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ.. తిరుమల విశేషాలను, విజయనగర రాజులు, శ్రీవారి వైభవాన్ని పుస్తకంలో వివరించానని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
దక్షిణ ధృవం చేరిన తొలి మహిళా ఐపీఎస్‌గా అపర్ణ
అంటార్కిటికా ఖండంలో దక్షిణ ధృవంలో భూగ్రహం చిట్టచివరి భూభాగమైన ‘సౌత్ పోల్’ సూచీబోర్డును చేరిన తొలి మహిళా ఐపీఎస్‌గా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారిణి అపర్ణా కుమార్(44) రికార్డులకెక్కింది. 2002 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అయిన అపర్ణా సౌత్‌పోల్‌ను చేరుకునేందుకు ఎనిమిదిరోజులపాటు ట్రెక్కింగ్ చేసి జనవరి 13న ఎనిమిది మంది బృందంతో కలసి అక్కడికి చేరుకుంది. మైనస్ 48 డిగ్రీల గడ్డకట్టే చలిలో 111 మైళ్లు నడిచి చిట్టచివరి భూప్రాంతానికి చేరుకోగలిగామని ఆమె తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ ధృవం చేరిన తొలి మహిళా ఐపీఎస్
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారిణి అపర్ణా కుమార్
పాకిస్తాన్‌లో సివిల్ జడ్జిగా హిందూ మహిళ
పాకిస్తాన్‌లో మొదటిసారి సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా జనవరి 29న నియమితులైంది. ఖంబర్-షాదద్కోట్ జిల్లాకు చెందిన కుమారి హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం కరాచీలోని స్జాబిస్ట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుమన్ కుమారి కంటే ముందు హిందూ మతం నుంచి జస్టిస్ రానా భగవాన్ దాస్ కొద్దికాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. పాకిస్తాన్ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారి మహిళ సివిల్ న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : సుమన్ కుమారి
ఎక్కడ : పాకిస్తాన్
మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత
సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్(88) అల్జీమర్స్, స్వైన్ ఫ్లూ కారణంగా న్యూఢిల్లీలో జనవరి 29న కన్నుమూశారు. 1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో గోవా మూలాలున్న రోమన్ కేథలిక్ కుటుంబంలో జార్జి ఫెర్నాండెజ్ జన్మించారు. 1949లో బొంబాయి వెళ్లి రాజకీయాలను జీవిత మార్గంగా ఎంచుకున్న ఆయన డాక్టర్ రాంమనోహర్ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1967లో దక్షిణ బొంబాయి నుంచి సంయుక్త సోషలిస్ట్ పార్టీ(ఎసెస్పీ) తరపున ఎమ్మేల్యేగా పోటీచేసి తొలిసారి ఎమ్యేల్యేగా ఎన్నికయ్యారు.
బరోడా డైనమైట్ కేసులో జైలు జీవితం...
జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో 1974లో జరిగిన రైల్వే సమ్మె విజయవంతమైంది. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మిగిలిన ప్రతిపక్ష అగ్రనేతల మాదిరిగా అరెస్టు కాకుండా జార్జి అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం సాగించారు. చివరికి బరోడా డైనమైట్ కేసులో నిందితునిగా 1976 జూన్‌లో కోల్‌కతాలో అరెస్టయ్యారు. జైలు నుంచే బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి జనతాపార్టీ తరఫున ఎమ్మేల్యేగా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన ఐదు సార్టు ఎన్నికైన ఆయన మధ్యలో మూడుసార్లు నలందా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
కేంద్ర మంత్రిగా....
1977 ఎన్నికల్లో మొరార్జీదేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, 1989 వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా జార్జి ఫేర్నాండేజ్ పనిచేశారు. జనతా పాలనలో అమెరికాకు చెందిన కంపెనీలు కోకాకోలా, ఐబీఎంను దేశంలో మూతవేయించారు. బిహార్ సీఎం లాలూ ప్రసాద్ జనతాదళ్‌లో పెత్తనానికి నిరసనగా 1994లో బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సమతాపార్టీ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో 1998-99, 1999-2004 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే విధంగా అణ్వస్త్ర పరీక్షలను కూడా నిర్వహించారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కోసం కొనుగోలు చేసిన శవపేటికల కుంభకోణం కారణంగా జార్జి 2004లో రాజీనామా చేశారు. 2004లో ముజఫర్‌పూర్ నుంచి చివరిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన 2009లో జనతాదళ్(యూ) పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తంగా 9సార్లు లోక్‌సభకు ఎన్నికైన జార్జి 2009-10 మధ్య చివరిసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 2010లో అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారు.
ఇంకో జన్మ ఉంటే...
మళ్లీ జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటానని జార్జి ఫెర్నాండెజ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. వియత్నాం ప్రజలు క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం కలిగినవారన్నారు. వియత్నాం దేశాన్ని సందర్శించిన ఆయన ఆ దేశాన్ని సందర్శిచిన తొలి భారత రక్షణమంత్రిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : జార్జి ఫేర్నాండేజ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అల్జీమర్స్, స్వైన్ ఫ్లూ కారణంగా
చందా కొచర్‌ని దోషిగా తేల్చిన శ్రీకృష్ణ కమిటీ
వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ జనవరి 30న ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసినప్పటికీ... కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతోపాటు 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి దాకా చందా కొచర్ పొందిన బోనస్‌లన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని తెలిపింది.
2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ లావాదేవీల ద్వారా చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని కొన్నాళ్ల క్రితం ప్రజావేగు ఒకరు బైటపెట్టడంతో కోచర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం 2018 జూన్ 6న మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చందా కొచర్‌ని దోషిగా తేల్చిన శ్రీకృష్ణ కమిటీ
ఎప్పుడు : జనవరి 30
ఎక్కడ : వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన కేసులో
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీని నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రకాష్ సిసోడియాను బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ కేంద్ర ప్రభుత్వంలో 2018 వరకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన(సర్వీసెస్) శాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్‌చార్జి)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నియామకం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : గోపాలకృష్ణ ద్వివేదీ
నాదస్వర విద్వాన్ నాగూర్ కన్నుమూత
ప్రముఖ నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90) అనారోగ్యం కారణంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో జనవరి 17న కన్నుమూశారు. 1930లో ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామంలో ఖాశీం సాహెబ్, హుస్సేన్‌భీ దంపతులకు నాగూర్ సాహెబ్ జన్మించారు. ఆయన తండ్రి ఖాశీం, సోదరుడు దస్తగిరి కూడా నాదస్వర విద్వాంసులే.
కర్ణాటక సంగీతం నేర్చుకున్న నాగూర్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు.సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి పద్మశ్రీ షేక్ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నాదస్వర విద్వాన్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : నాగూర్ సాహెబ్ (90)
ఎక్కడ : అద్దంకి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
అమెరికా కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్
అమెరికాలో నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి చోటు లభించింది. ఈ మేరకు సభాపతి న్యాన్సీ పెలోసీ జనవరి 17న ప్రకటించారు. దీంతో ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా కృష్ణమూర్తి నిలిచాడు. ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించిన ఆయన ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : రాజా కృష్ణమూర్తికి
ఎక్కడ : అమెరికా
అమెరికాలో భారతీయుడికి కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలో మరో భారత సంతతి అమెరికన్‌కు కీలక పదవి లభించనుంది. ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు ప్రేమ్ పరమేశ్వరన్(50) ‘ఏషియన్-అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్తర అమెరికా విభాగం అధ్యక్షుడిగా, గ్రూప్ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. ఇండో-అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్థిరపడ్డ పసిఫిక్ ద్వీపవాసుల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సలహా కమిషన్‌ను తొలుత ఏర్పాటుచేశారు. ఇందులో వాణిజ్యం, ఆరోగ్యం, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏషియన్-అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమాకం
ఎవరు: పేమ్ పరమేశ్వరన్
ఎక్కడ: అమెరికా
సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణ స్వీకారం
జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జనవరి 18న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ సమక్షంలో వారు సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ వన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం ఉన్న జడ్జీల సంఖ్య 28కి చేరింది. గతంలో జస్టిస్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన జడ్జీలుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దినేశ్ మహేశ్వరి
అత్యంత పెద్ద వయస్కుడు నొనాకా కన్నుమూత
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడు, జపాన్‌కు చెందిన మసాజో నొనాకా(113) జనవరి 20న కన్ను మూశారు. 2018, ఏప్రిల్‌లో నొనాకాను సజీవంగా ఉన్న అత్యంత వృద్ధ పురుషునిగాత గిన్నిస్ బుక్ గుర్తించింది. అప్పుడు ఆయన వయసు 112 ఏళ్ల 259 రోజులు. 1905లో జపాన్‌లోని హొక్కాయిడా దీవిలో నానాకా జన్మించాడు. ప్రపంచంలోనే సజీవంగా ఉన్న అతిపెద్ద వయసున్న మనిషిగా రికార్డులకెక్కిన 116 ఏళ్ల కేన్ తనాకా(మహిళ) కూడా జపాన్‌కు చెందిన వారే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మసాజో నొనాకా(113)
ఎక్కడ : జపాన్
సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి శివైక్యం
కన్నడనాట మహారుషి, అభినవ బసవణ్ణగా పేరుపొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి, పద్మభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్ శ్రీ శివకుమార స్వామి (111) శివైక్యం చెందారు. వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన ఆయన కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యాలతో బాధపడుతూ సిద్ధగంగ మఠంలోనే జనవరి 21న కన్నుమూశారు.
1908, ఏప్రిల్ 1న బెంగళూరుకు సమీపంలోని మాగడి తాలూకా వీరాపుర గ్రామంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా శివకుమార స్వామి జన్మించారు. 1930 నుంచి ఇప్పటివరకు 9 దశాబ్దాల పాటు సిద్ధగంగా మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2007లో కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక రత్న అవార్డును, 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : శివకుమార స్వామి
ఎక్కడ : తుమకూరు సిద్ధగంగ మఠం, కర్ణాటక
భారతీయ పౌరసత్వం వదులుకున్న చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని రూ.వేల కోట్ల మేర మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం ఆంటిగ్వాలో ఆశ్రయం పొందుతున్న చోక్సీ జనవరి 21న గయానాలోని భారత రాయబార కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాడు. రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ పౌరసత్వం వదులుకున్న వజ్రాల వ్యాపారి
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : మెహుల్ చోక్సీ
మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీగా కోహ్లి
భారత్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్’గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది నిలిచాడు. ఈ మేరకు డఫ్ అండ్ ఫెల్ఫస్ సంస్థ ఒక జనవరి 10న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్ విలువ దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. కోహ్లి 2018, నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు.
అదే విధంగా 21 ఉత్పత్తులను ఎండార్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ రూ.718 కోట్ల (102.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ (రూ.473 కోట్లు), రణ్‌వీర్ సింగ్ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : విరాట్ కోహ్లి
ఐబా ర్యాంకిగ్స్ లో మేరీకోమ్‌కు అగ్రస్థానం
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) జనవరి 10న విడుదల చేసిన ర్యాంకింగ్‌సలో భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ అగ్రస్థానంలో నిలిచింది. మేరీ 48 కేజీల కేటగిరీలో 1700 పాయింట్ల సాధించి మొదటిస్థానం దక్కించుకుంది. 2018, నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ మేరీ గెలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐబా ర్యాంకిగ్స్ లో భారత బాక్సర్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : మేరీకోమ్
సీబీఐ డెరైక్టర్ అలోక్ వర్మకు ఉద్వాసన
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) డెరైక్టర్ అలోక్ కూమార్ వర్మకు కేంద్రప్రభుత్వం జనవరి 10న ఉద్వాసన పలికింది. ఈ మేరకు వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాత్కాలిక డెరైక్టర్ బాధ్యతలను అడిషనల్ డెరైక్టర్‌గా ఉన్న నాగేశ్వర్‌రావుకు అప్పగించింది.
సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో 2018, అక్టోబర్ 23న వర్మను ప్రభుత్వం సెలవుపై పంపింది. దీనిపై వర్మ సుప్రీకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనను జనవరి 9న పునఃనియమించింది. అయితే వర్మ కేసును మరోసారి పరిశీలించిన అత్యున్నతస్థాయి కమిటీ ఆయనను పదవి నుంచి తొలగించింది. వర్మకేసును పరిశీలించిన అత్యున్నతస్థాయి కమిటిలో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సీబీఐ చరిత్రలో డెరైక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి. 2017, ఫిబ్రవరి 1న సీబీఐ డెరైక్టర్‌గా ఆలోక్ వర్మ బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ డెరైక్టర్ అలోక్ కూమార్ వర్మ కు ఉద్వాసన
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : కేంద్రప్రభుత్వం
కమ్యూనిస్టు నేత శివరామిరెడ్డి కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి (97) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో జనవరి 11న తుదిశ్వాస విడిచారు. 1922 ఫిబ్రవరి 25న వైఎస్సార్ కడప జిల్లా గడ్డంవారిపల్లెలో జన్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి (ఎన్‌ఎస్) సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర నేతగా పనిచేశారు. 1952లో కమలాపురం- పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : నర్రెడ్డి శివరామిరెడ్డి (97)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
ఎన్‌ఎస్‌ఈ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్ అశోక్ చావ్లా జనవరి 11న తన పదవికి రాజీనామా చేశారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో అశోక్ చావ్లా, మరో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులపై చార్జీషీటు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందామని సీబీఐ న్యాయవాదుల బృందం ఢిల్లీలోని స్పెషల్ కోర్ట్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలో చావ్లా రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : అశోక్ చావ్లా
కలకత్తా హైకోర్టుకు రాధాకృష్ణన్ బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 11న కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ 2018, జూలై 1న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కలకత్తా హైకోర్టుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్
సీబీఐ మాజీ డెరైక్టర్ అలోక్ పదవీ విరమణ
సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డెరైక్టర్ అలోక్ కూమార్ వర్మ జనవరి 11న ప్రభుత్వ సర్వీసుల నుంచి రాజీనామా చేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలోక్ తెలిపారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ అలోక్ వర్మను సీబీఐ డెరైక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్ పదవీ విరమణ
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : అలోక్ కుమార్ వర్మ
సుప్రీంకోర్టు జడ్జీలుగా దినేశ్, సంజీవ్‌కు పదోన్నతి
సుప్రీంకోర్టు జడ్జీలుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 10న కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు జడ్జీలుగా దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం
ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి కన్నుమూత
సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 13న కన్నుమూశారు. బెంగళూరు రూరల్ వర్తూర్‌కి చెందిన ఆయన జపాన్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా ప్రసిద్ధి పొందారు. 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న నారాయణరెడ్డి తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. మరోవైపు లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రిక కాలమిస్టుగా కూడా ఆయన చాలాకాలంపాటు పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రకృతిసేద్య నిపుణుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84)
ఎక్కడ : మరలేనహళ్లి, కర్ణాటక
నాటకరంగ పరిశోధకుడు నాగభూషణశర్మ కన్నుమూత
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నాటకరంగ పరిశోధకుడు, ఆచార్యుడు ‘కళారత్న’ మొదలి నాగభూషణశర్మ (84) అనారోగ్యం కారణంగా గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 15న కన్నుమూశారు. తన జీవితాన్ని నాటకకళ, నాటక రచన, పరిశోధన, బోధనకు అంకితం చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. అమెరికాలో మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్‌ట్స (థియేటర్) చేశారు. నాటకరంగ సేవలకుగానూ 2019, జనవరి 6న తెనాలిలో అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాటకరంగ పరిశోధకుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : మొదలి నాగభూషణశర్మ (84)
ఎక్కడ : తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
సుప్రీకోర్టు న్యాయమూర్తులుగా దినేశ్, సంజీవ్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి లభించింది. ఈ మేరకు జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జిలకు పదోన్నతి
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా
అత్యుతమ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్
100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితా-2019లో భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చోటు లభించింది. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ జనవరి 16న ప్రకటించిన ఈ జాబితాలో ముకేశ్‌తోపాటు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ ఉన్నారు.
అత్యుతమ ఆలోచనాపరుల జాబితాను మొత్తం 10 విభాగాలుగా విభజించగా ముకేశ్ టాప్-10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచారు. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా స్థానం దక్కింది. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ పూర్తి జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్ అంబానీ
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్
పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు జనవరి 5న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం-2018 కింద దేశ, విదేశాలో ఉన్న మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా గుర్తింపు
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు
మలేసియా రాజు సుల్తాన్ రాజీనామా
మలేసియా రాజు సుల్తాన్ ముహమ్మద్ 5 జనవరి 6న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా ఆయన నిలిచారు. మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు కాగా, ముహమ్మద్ రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. మలేసియాలో 9 వంశాల మధ్య ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేసియా రాజు రాజీనామా
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : సుల్తాన్ ముహమ్మద్ 5
మళ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్)గా ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని రాష్ట్ర మంత్రి వర్గ తొలి సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నిైకైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికై న ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎంపిక
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: ఎల్విస్ స్టీఫెన్‌సన్
ఎక్కడ: తెలంగాణ
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణ స్వీకారం
నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికై న ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: షేక్ హసీనా
ఎక్కడ: బంగ్లాదేశ్
ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇనాక్
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్‌లను ఎంపిక చేశారు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్, సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, సంగీత నృత్య అకాడమీ చైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్, జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ (ఫోక్ అండ్ క్రియేటివ్ అకాడమీ) చైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణను ఎంపిక చేశారు. ఈ నియామకాలకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్‌ల ఎంపిక
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్,
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ పునఃనియామకం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డెరైక్టర్‌గా అలోక్ కుమార్ వర్మను పునఃనియమిస్తూ సుప్రీంకోర్టు జనవరి 8న తీర్పు వెలువరించింది. అయితే అలోక్‌వర్మ ఎలాంటి ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు ఆంక్షలు విధించింది. సీబీఐ చీఫ్‌ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృత్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డెరైక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది.
సీబీఐ డెరైక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డెరైక్టర్ రాకేశ్ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో 2018, అక్టోబర్ 23న కేంద్రప్రభుత్వం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ పునఃనియామకం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు
ఐఎంఎఫ్ చీఫ్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గీతా గుర్తింపుపొందారు. 2018, డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఐఎంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనమిక్ కౌన్సిలర్, డెరైక్టర్ మారిస్ ఆబ్స్‌ఫెల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టు బాధ్యతలు స్వీకరణ
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : గీతా గోపీనాథ్
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ రాజీనామా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్(దక్షిణ కొరియా) జనవరి 8న తన పదవికి రాజీనామా చేశారు. 2018, 1 నుంచి జిమ్ రాజీనామా అమల్లోకి రానుంది. దీంతో కొత్త చీఫ్ నియమితులయ్యేదాకా వరల్డ్ బ్యాంక్ సీఈవో క్రిస్టలీనా జార్జియేవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2017లో రెండో దఫా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కిమ్ పదవీకాలం వాస్తవానికి 2022 నాటికి ముగియాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : జిమ్ యోంగ్ కిమ్
కశ్మీర్ కేడర్ ఐఏఎస్ షా ఫజల్ రాజీనామా
జమ్మూ, కశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి షా ఫజల్ జనవరి 9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. దీంతో సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఫజల్ గుర్తింపు పొందాడు. కశ్మీర్‌లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఫజల్ ప్రకటించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కశ్మీర్ కేడర్ ఐఏఎస్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : షా ఫజల్

సీనియర్ ఐఏఎస్ టీఎల్ శంకర్ కన్నుమూత
సీనియర్ ఐఏఎస్ అధికారి, భారత విద్యుత్ రంగ నిపుణుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టీఎల్ శంకర్ (84) హైదరాబాద్‌లో డిసెంబర్ 26న కన్నుమూశారు. 1957 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన శంకర్ దేశంలో విద్యుత్ (ఎనర్జీ) రంగ నిపుణుడిగా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్‌గా, రాష్ట్ర విద్యుత్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1975లో ఇంధన విధాన నిర్ణయ కమిటీ సభ్యుడిగా, హిందుస్తాన్ పెట్రోలియం బోర్డు డెరైక్టర్‌గా సేవలందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ ఐఏఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : టీఎల్ శంకర్ (84)
ఎక్కడ : హైదరాబాద్
మౌంట్ విన్సన్‌ను అధిరోహించిన జీఆర్ రాధిక
అంటార్కిటికాలోని అతి ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్‌ను ఏపీ ఆక్టోపస్ ఎస్పీగా పనిచేస్తున్న జీఆర్ రాధిక అధిరోహించారు. డిసెంబర్ 16న రాధిక విన్సన్ పర్వతాన్ని అధిరోహించినట్లు డీజీపీ కార్యాలయం డిసెంబర్ 30న ప్రకటించింది. దీంతో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన శిఖరాలు అధిరోహించిన అరుదైన రికార్డును ఆమె సొంతం చేసుకుంది.
రాధిక 2016, మే 20న ప్రపంచంలోని అతి పెద్ద శిఖరమైన (ఆసియా ఖండం) ఎవరెస్ట్ (8848 మీటర్లు / 29030 అడుగులు)ను, 2016, ఆగస్టు 14న ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో (5895 మీటర్లు / 19341 అడుగులు)ను అధిరోహించింది. గ్రేహౌండ్‌స అసాల్ట్ కమాండర్, నెల్లూరు టౌన్ డీఎస్పీ, ఆదిలాబాద్ ఏఎస్పీ, చిత్తూరు జిల్లా ఏఎస్పీగా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఆక్టోపస్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మౌంట్ విన్సన్ అధిరోహణ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : జీఆర్ రాధిక
ఎక్కడ : అంటార్కిటికా
ఎఫ్‌ఏవోలో భారత ప్రతినిధిగా రాజేందర్
ఐక్యరాజ్యసమితిలోని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) లో భారత ప్రభుత్వ శాశ్వత ప్రతినిధిగా తెలంగాణకు చెందిన బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ బి.రాజేందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 30న ఆయనను రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సన్మానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌటా గ్రామంలో జన్మించిన రాజేందర్ హైదరాబాద్‌లోని వ్యవసాయ కళాశాలలో పట్టభద్రులయ్యాడు. 1995లో ఐఏఎస్‌కు ఎంపికై బిహార్ రాష్ట్రంలో ఆరు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఆ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస ఎఫ్‌ఏవోలో భారత శాశ్వత ప్రతినిధి నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : డాక్టర్ బి.రాజేందర్
సీఐసీలో నలుగురు కొత్త క మిషనర్ల నియామకం
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లుగా నియమితులైన వారిలో మాజీ ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర ఉన్నారు. దీంతో కమీషనల్‌లోని సభ్యుల సంఖ్య (1+6) ఏడుకి చేరింది. కమిషన్‌లో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు.
తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారిణి) సీఐసీలోని ఏకై క మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. 1981 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన సిన్హా యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. గుప్తా 1982 ఐఏఎస్ అధికారి కాగా, సురేశ్ చంద్ర 2018లోనే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐసీలో నలుగురు కొత్త క మిషనర్ల నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, నజ ఎన్ సర్నా, నీరజ్ కుమార్ గుప్తా, సురేశ్ చంద్ర
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ పదవీవిరమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు. 1953, డిసెంబర్ 31న జన్మించిన లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్న ఆయన 2010-12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
కేసుల కేటాయింపు విషయంలో 2018, జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ గొగోయ్, అప్పటి జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో కలిసి లోకూర్ మీడియా సమావేశం నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీవిరమణ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్
బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ (95) గుండెపోటు కారణంగా కోల్‌కతాలో డిసెంబర్ 30న కన్నుమూశారు. 1923 మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరిద్‌పూర్‌లో జన్మించిన ఆయన కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు. 1955లో ‘రాత్ భోరే’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిషేధానికి గురైన మొదటి సినిమా ‘నీల్ అకాషర్ నీచే’ను సేన్ తీశారు.
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సేన్ దాదాపు యాభై దశాబ్దాల పాటు (1956-2002) 27 సినిమాలు, 14 షార్ట్‌ఫిల్మ్‌లు, 4 డాక్యుమెంటరీలు తీశారు. సేన్ 1977లో ‘ఒక ఊరి కథ’ పేరుతో తెలుగులోనూ సినిమా తీశారు. 1997-2003 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సేన్ 1983లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : మృణాల్ సేన్ (95)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : గుండెపోటు కారణంగా
రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబర్ 31న ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ స్థానంలో ఈవినోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వినోద్‌కుమార్ రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి సంస్థల్లో పనిచేశారు. 2017-18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన విశేష కృషిచేశారు. 2018లో ఆరు ఎక్స్‌అఫీషియో అవార్డులు, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారాలను దక్షిణమధ్య రైల్వే అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రైల్వే బోర్డు చైర్మన్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : వినోద్‌కుమార్ యాదవ్
సీఐసీ ప్రధాన కమిషనర్‌గా సుధీర్ భార్గవ
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్ భార్గవను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. భార్గవ ఇప్పటివరకు సీఐసీ సమాచార కమిషనర్‌గా పని చేశారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది సభ్యులు కమిషన్‌లో ఉంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన సమాచార కమిషనర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సుధీర్ భార్గవ
ఢిల్లీ కోర్టులో లొంగిపోయిన సజ్జన్ కుమార్
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు శిక్ష పడ్డ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ డిసెంబర్ 31న ఢిల్లీలోని కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈశాన్య ఢిల్లీలోని మండోలి జైలులో సజ్జన్ కుమార్‌ను ఉంచాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అదితీ గార్గ్ ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌కు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ హేమంత్ భార్గవ జనవరి 1న అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్‌ఐసీ ఎండీగా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : హేమంత్ భార్గవ
సీసీఐ కార్యదర్శిగా పి.కె. సింగ్
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్‌ను నియమించినట్లు జనవరి 1న సీసీఐ తెలిపింది. ఇప్పటివరకు సీసీఐ న్యాయసలహాదారుగా పి.కె.సింగ్ వ్యవహరించారు. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగంలో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులు, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు వంటి వాటిని సీసీఐ నియంత్రిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీసీఐ కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ప్రమోద్ కుమార్ సింగ్
ప్రముఖ క్రికెట్ కోచ్ అచ్రేకర్ కన్నుమూత
ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్(87) అనారోగ్యం కారణంగా ముంబైలో జనవరి 2న కన్నుమూశారు. ఆటగాడిగా తన కెరీర్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను అచ్రేకర్ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్‌బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.
అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన వారిలో సచిన్ టెండూల్కర్‌తోపాటు వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ దిఘే, బల్వీందర్ సింగ్ సంధూ, చంద్రకాంత్ పండిత్, అజిత్ అగార్కర్, రమేశ్ పొవార్ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ క్రికెట్ కోచ్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రమాకాంత్ అచ్రేకర్(87)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
నేపాల్ చీఫ్ జస్టిస్‌గా చోలేంద్ర ప్రమాణ స్వీకారం
నేపాల్ సుప్రీంకోర్టు 29వ ఫ్రధాన న్యాయమూర్తిగా చోలేంద్ర షంషేర్ జేబీ రాణా జనవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్షభవనం శీతల్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో చోలేంద్రతో దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ ఓంప్రకాశ్ మిశ్రా స్థానంలో బాధ్యతలు చేపట్టిన చోలేంద్ర నాలుగేళ్లపాటు తన పదవిలో కొనసాగనున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేపాల్ చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : చోలేంద్ర షంషేర్ జేబీ రాణా

Published date : 28 Jan 2019 12:36PM