Skip to main content

Indian-Origin: సీఐఏ తొలి సీటీఓగా ఎవరు నియమితులయ్యారు?

Nand Mulchandani

అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్‌ విలియమ్‌ జె.బర్న్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ స్కూల్‌లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్‌ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్‌ అన్నారు.

GK International Quiz: నాటో సైనిక వ్యాయామం 'కోల్డ్ రెస్పాన్స్ 2022' ఎక్కడ జరిగింది?Chief of the Army Staff: 29వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా నియామకం
ఎప్పుడు : మే 1 
ఎవరు    : భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ
ఎందుకు : అమెరికా ప్రభుత్వం నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 May 2022 11:56AM

Photo Stories