Skip to main content

Ireland's prime minister: ఐర్లాండ్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన భారత సంతతి వ్యక్తి

Indian origin Leo Varadkar elected as Ireland's prime minister for 2nd time

భారత సంతతికి చెందినవాళ్లు విదేశాల్లో స్థిరపడడమే కాకుండా.. అక్కడి రాజకీయాల్లో సైతం తమదైన ముద్ర వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టారు. తాజాగా భారత సంతతికి చెందిన లియో వరాద్కర్‌ ఐర్లాండ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 17న ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్ల లియో ఐర్లాండ్‌ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఫిన్‌ గేల్‌ పార్టీకి చెందిన ఈయన 2017 నుంచి 2020 వరకు లియో ఐర్లాండ్‌ ప్రధానిగా పనిచేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:46PM

Photo Stories