Chopper Crash: శౌర్యచక్ర అవార్డీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
భారత వాయుసేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయారు. డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, కూనూర్ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై చికిత్స పొందుతూ డిసెంబర్ 15న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది. 2020 ఏడాది జరిపిన సాహస ప్రదర్శనకు వరుణ్ 2021 ఏడాది ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్నారు.
సైనిక కుటుంబం..
- ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి కేపీ సింగ్ ఏఏడీలో కల్నల్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి స్వగ్రామం యూపీలోని ఘజియాపూర్ కాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ప్రస్తుతం నివసిస్తున్నారు. వరుణ్ సోదరుడు సైతం సైన్యంలోనే ఉన్నారు.
- గత ఆరునెలలుగా తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీలో వరుణ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తేజాస్ స్క్వాడ్రన్‌లో ఆయన విధులు నిర్వహించారు.
- ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీ తరఫున దేశ మొదటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ను ఆహ్వానించేందుకు 2021, డిసెంబర్ 8న వరుణ్ సూలూర్ ఎయిర్‌బేస్(తమిళనాడు)కు వచ్చారు. అక్కడ బిపిన్‌కు స్వాగతం పలికి ఆయనతో కలిసి ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ బయలుదేరారు. మార్గమధ్యంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది మరణించారు. వరుణ్ ఒక్కరే ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో బయటపడ్డారు. తొలుత ఆయనకు వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్సనందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 17న ఆయన అంత్యక్రియలు భోపాల్‌లో నిర్వహించనున్నారు.
చదవండి: జనరల్ బిపిన్ రావత్ ఏ రాష్ట్రంలో జన్మించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : శౌర్యచక్ర అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : భారత వాయుసేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, కూనూర్ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్