Skip to main content

Haryana CM: హర్యానా కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ

Haryana New CM Nayab Singh Saini

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మార్చి 12న అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయనతోపాటు 13 మంది మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. దీంతో హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఇంతకాలం జన్‌నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Mar 2024 03:20PM

Photo Stories