Benedict XVI: బెనెడిక్ట్–16 అస్తమయం
ఆయన భౌతిక కాయాన్ని జనవరి 2వ తేదీ నుంచి అభిమానులు, విశ్వాసుల సందర్శనార్ధం సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఉంచి జనవరి 5న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ పోప్‌కు ప్రస్తుత పోప్ అంతిమ సంస్కారాలు జరిపిన అరుదైన సన్నివేశంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. బెనెడిక్ట్ కోరిన విధంగా కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్టు వాటికన్ పేర్కొంది.
పదవిని పరిత్యజించి..
బెనెడిక్ట్–16 2005లో పోప్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత వెయ్యేళ్లలో ఆ పదవి చేపట్టిన తొలి జర్మన్‌గా చరిత్ర సృష్టించారు. 2013 ఫిబ్రవరి 11న ఉన్నట్టుండి పదవి నుంచి వైదొలిగి నివ్వెరపరిచారు. ‘‘120 కోట్ల మంది విశ్వాసులైన రోమన్ క్యాథలిక్కులను ముందుకు తీసుకెళ్లే మనోబలం నాలో సన్నగిల్లింది. వయో భారం వల్ల ఇక ఈ బాధ్యతలను కొనసాగించలేను’’ అంటూ ఆయన చెప్పిన కారణం అందరి మనసులూ గెలుచుకుంది. ఒక పోప్ పదవిని త్యజించడం గత 600 ఏళ్లలో ఇదే తొలిసారి. అప్పటినుంచీ వాటికన్ గార్డెన్స్‌లో పోప్ నివాసం పక్కనే నివసిస్తున్నారు.
Boora Rajeshwari: కాళ్లతోనే కవిత్వం రాసిన కవయిత్రి కన్నుమూత
సంచలనాలకు నెలవు..!
జోసెఫ్ అలోసియస్ రాట్జింగర్. ఇలా చెబితే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ పోప్ బెనెడిక్ట్–16 అనగానే పసిపాపలను పోలిన స్వచ్ఛమైన పసిడి నవ్వులు చిందించే ఒక పవిత్రమూర్తి కళ్లముందు కదలాడతారు. రోమన్ క్యాథలిక్కులకు పరమ పవిత్రమైన అత్యున్నత పోప్ పదవిని స్వీకరించేందుకు ససేమిరా అన్నా, తీరా బాధ్యతలు స్వీకరించాక అవి మెడకు ఉచ్చులా తోస్తున్నాయని వ్యాఖ్యలు చేసినా, కోట్లాది మందిలో భగవంతుని పట్ల సిసలైన భక్తి భావనలను ఉద్దీపింపజేసేందుకు అహరహం పాటుపడి తన వారసులకు ఆదర్శంగా నిలిచినా, చివరికి సంచలనాత్మక రీతిలో బాధ్యతల నుంచి వైదొలగినా... అడుగడుగునా అంతరాత్మ ప్రబోధానుసారమే నడుచుకున్న ఆసక్తికరమైన జీవితం ఆయనది.
T20 Cricketer of the Year: ‘ఐసీసీ టి20 క్రికెటర్’ రేసులో సూర్యకుమార్, స్మృతి
సంప్రదాయవాది
బెనెడిక్ట్–16 1927 ఏప్రిల్ 16న జర్మనీలోని బవేరియాలో జన్మించారు. ఏళ్ల తరబడి తత్వశాస్త్రం బోధించారు. 1977లో మ్యూనిక్ బిషప్, మూణ్నెల్లకు కార్డినల్ అయ్యారు. 78 ఏళ్ల వయసులో శేష జీవితాన్ని బవేరియాలో తనకిష్టమైన రచనలు చేస్తూ గడపాలని ఆకాంక్షించగా విధి మరోలా తలచింది. ఫాదర్ల లైంగిక వేధింపుల వివాదం తదితరాలతో క్యాథలిక్ చర్చి సతమతమవుతున్న వేళ పోప్ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. వాటన్నింటినీ మొక్కవోని స్థైర్యంతో పరిష్కరించారు. సంప్రదాయవాదిగా పేరుబడ్డ ఆయన యూదులకు స్నేహ హస్తం చాచడమే గాక వారి ప్రార్థనా మందిరమైన సినగాగ్‌ను సందర్శించిన రెండో పోప్‌గా చరిత్ర సృష్టించారు. జీసస్ మృతికి యూదులు కారణమన్న వాదన ఆధార రహితమంటూ జీజెస్ ఆఫ్ నజరేత్ పేరుతో 2011లో పుస్తకం రాశారు! ముస్లింలపై బెనెడిక్ట్–16 చేసిన వ్యాఖ్యలు వివాదానికీ కారణమయ్యాయి. ‘‘ఎయిడ్స్ వ్యాప్తిని కేవలం కండోముల పంపిణీ ద్వారా అడ్డుకోలేం. సరికదా, వాటివల్ల సమస్య మరింత పెరుగుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. పదవిని త్యజించినప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతున్నారు.