Skip to main content

ఏప్రిల్ 2019 వ్యక్తులు

నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి కన్నుమూత
నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఎస్పీవెరైడ్డి (69) అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఏప్రిల్ 30న కన్నుమూశారు. 1950లో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకాలమ్మ గూడూరులో జన్మించిన ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు సన్నపురెడ్డి పెద్ద ఎరుకల రెడ్డి. బీటెక్ చదివిన ఆయన మొదట ముంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ కేంద్రంలో ఉద్యోగం చేశారు. అనంతరం 1977లో నంద్యాలలో పైపుల ఫ్యాక్టరీ స్థాపించారు. 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2001లో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. జిల్లాలో పలు సేవాకార్యక్రమాలను చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : ఎస్పీవెరైడ్డి (69)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

జపాన్ 126వ చక్రవర్తిగా నరుహితో
జపాన్ 126వ చక్రవర్తిగా నరుహితో ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్ సింహాసనం నుంచి దిగిపోవడంతో నరుహితో తదుపరి చక్రవర్తి అయ్యారు. కొత్త చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపట్టడంతో జపాన్‌లో మే 1 నుంచి రీవా (అందమైన సామరస్యం) శకం ప్రారంభమైంది. నరుహితో చక్రవర్తిగా ఉన్నంతవరకు కాలాన్ని రీవా శకంగా పేర్కొంటారు. అకిహితో 30 ఏళ్లపాటు జపాన్ చక్రవర్తి పదవిలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ 126వ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరణ
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : నరుహితో

గూగుల్ బోర్డు నుంచి ష్మిట్ నిష్క్రమణ
టెక్ సంస్థ గూగుల్ బోర్డు నుంచి సంస్థ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ నిష్క్రమించనున్నారు. 2019, జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మే 1న వెల్లడించింది. 2018 తొలినాళ్లలోనే ఆల్ఫాబెట్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న ష్మిట్ ఆ తర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. అటుపైన రీ-ఎలక్షన్ కోరరాదని ష్మిట్ నిర్ణయించుకున్నారని, సాంకేతికాంశాల్లో తగు సలహాలు ఇవ్వడం కొనసాగిస్తారని ఆల్ఫాబెట్ పేర్కొంది.
ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ రిక్రూట్ చేశారు. 2001 నుంచి 2011 దాకా ష్మిట్ గూగుల్ సీఈవోగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్ బోర్డు నుంచి నిష్క్రమణ
ఎప్పుడు : మే 1
ఎవరు : గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్

జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత
కేరళ, మద్రాసు హైకోర్టుల విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, మాజీ లోకాయుక్త జస్టిస్ బొల్లంపల్లి సుభాషణ్‌రెడ్డి(76) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో మే 1న తుదిశ్వాస విడిచారు. 1943, మార్చి 2న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో జన్మించిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1966లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనతి కాలంలోనే రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ వ్యవహారాల్లో పట్టు సాధించారు. కొంత కాలం సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు.
1991, నవంబర్ 25న హైకోర్టు న్యాయమూర్తిగా సుభాషణ్ రెడ్డి నియమితులయ్యారు. 2001, సెప్టెంబర్ 21న మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో గొప్ప తీర్పులిచ్చారు. చట్టం కోణంలో కన్నా మానవీయ కోణంలో ఆలోచించి తీర్పులిచ్చే వారని పేరు పొందారు. 2005 నుంచి 2010 వరకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. పోస్టులో ఉన్నంత వరకు ఆయన హెచ్‌ఆర్‌సీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2012లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆ పోస్టులోనే కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేరళ, మద్రాసు హైకోర్టుల విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : మే 1
ఎవరు : జస్టిస్ బొల్లంపల్లి సుభాషణ్‌రెడ్డి(76)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కేన్సర్ కారణంగా

దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా జైదీప్
Current Affairs దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త జైదీప్ సర్కార్ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి అయిన జైదీప్ ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు లెబనాన్‌లో భారత రాయబారిగా సుహేల్ అజాజ్ ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : జైదీప్ సర్కార్

మాలి ప్రధాని మైగా రాజీనామా
మాలి దేశ ప్రధానమంత్రి సౌమేలౌ బౌబేయే మైగా కేబినెట్ సహచరులందరితో కలిసి రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలనూ ఆమోదించినట్టు దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా కార్యాలయం ఏప్రిల్ 19న ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలోనే నూతన ప్రధాని పేరును ప్రకటిస్తామని తెలిపింది.
మాలి దేశంలో భూముల వివాదంలో డోగోన్, ఫులానీ తెగల మధ్య ఏళ్ల తరబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2019, మార్చి 23న ఒగాస్సగో గ్రామంలో ఫులానీ తెగకు చెందిన 160 మంది ఊచకోతకు గురయ్యారు. ఆ తెగకు చెందిన ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు, పౌరహక్కుల సంఘాల నేతలు అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఏప్రిల్ 17న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాలి దేశ ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : సౌమేలౌ బౌబేయే మైగా
ఎందుకు : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో

ఐఏఎఫ్ పైలట్ అభినందన్ బదిలీ
భారత పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత వాయుసేన(ఐఏఎఫ్) బదిలీ చేసింది. ఆయన్ను ప్రస్తుతమున్న శ్రీనగర్ నుంచి పశ్చిమ సెక్టార్‌కు బదిలీ చేసినట్లు ఏప్రిల్ 20న ఐఏఎఫ్ తెలిపింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ బదిలీ చోటుచేసుకుందని పేర్కొంది. 2019, ఫిబ్రవరి 27న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్16 యుద్ధవిమానాన్ని అభినందన్ తన మిగ్21 ఫైటర్‌జెట్‌తో కూల్చడం, తర్వాత పాక్ సైన్యానికి చిక్కడం, తర్వాత భారత్‌కు అప్పగింత తెలిసిందే.

దృశ్యకావ్యం నవల ఆవిష్కరణ
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి చంద్రలత రచించిన దృశ్యకావ్యం నవల, టూ టేల్- ఎ టేల్ ( సిద్ధాం గ్రంథం) ఆవిష్కరణ సభ విజయవాడలో ఏప్రిల్ 21న జరిగింది. దృశ్యకావ్యం నవలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ ఆవిష్కరించగా, టూ టేల్- ఎ టేల్ పరిశోధనా గ్రంథాన్ని విఖ్యాత రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర ఆవిష్కరించారు. రైతుల వాస్తవ జీవితాలను దృశ్యకావ్యంలో వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దృశ్యకావ్యం నవల, టూ టేల్- ఎ టేల్ ( సిద్ధాం గ్రంథం) ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : చంద్రలత
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్

ఏపీ ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన అయిన ఆయన ఇటీవలి వరకూ నిఘా విభాగాధిపతి(ఇంటిలిజెన్స్ డీజీ)గా పనిచేశారు. ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న ఆయనను ఏసీబీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఏప్రిల్ 22న ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డీజీ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఏబీ వెంకటేశ్వరరావు

ఏఎన్‌యూ పరిశోధకుడికి అంతర్జాతీయ గౌరవం
గుహల్లో జీవవైవిధ్యంపై పరిశోధనలు చేస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) జంతుశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ షాబుద్దీన్ షేక్‌కు అంతర్జాతీయ గౌరవం లభించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రకృతిని, అందులోని వనరుల పరిరక్షణకు పనిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్), ‘కేవ్ ఇన్‌వెర్టిబ్రేట్ స్పెషలిస్ట్ గ్రూప్’కు సేవలందించేందుకు షాబుద్దీన్ నియమితులయ్యారు. 35 దేశాల నుంచి 80 మంది వర్గీకరణ శాస్త్రవేత్తలను ఐయూసీఎన్ నియమించగా, మనదేశం నుంచి షాబుద్దీన్ ఒక్కరికే అవకాశం లభించింది. గుహల జీవవైవిధ్య అంశంపై ఆయన సమర్పించిన థీసిస్‌ను, స్పెయిన్ ప్రభుత్వం ఉత్తమ థీసిస్‌గా ఎడ్యుడికేట్ చేసింది.

ఐదు హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు
Current Affairs సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, కర్ణాటక హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి ఏప్రిల్ 11న సిఫార్సు చేసింది. అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న సీనియర్ జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్ పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఖరారు చేసినట్లు కొలీజియం తెలిపింది.
అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌ను రాజస్తాన్ హైకోర్టు సీజేగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ పి.ఆర్.రామచంద్ర మీనన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసినట్లు కొలిజియం వెల్లడించింది. జస్టిస్ ఏకే మిట్టల్ పేరును మేఘాలయ సీజేగా ఖరారు చేసినట్లు పేర్కొంది. వీరితో పాటు జస్టిస్ ఎ.ఎస్.ఓకా పేరును కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది.

సీనియర్ పాత్రికేయులు దీక్షితులు కన్నుమూత
సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ వి.వాసుదేవ దీక్షితులు (76) గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 12న కన్నుమూశారు. 1942లో తూర్పుగోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, మొసలిపల్లిలో జన్మించిన ఆయన బీఎస్సీ చదివారు. తొలుత సైన్యంలో చేరిన దీక్షితులు 1967లో ఆంధ్రప్రభ పత్రికలో ట్రైనీ సబ్‌ఎడిటర్‌గా చేరారు. అదే పత్రికలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1992లో ఎడిటర్ అయ్యారు. 1999లో అదే హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన సంపాదకీయాల సంపుటి ‘ఖడ్గధార’ పాఠకుల ఆదరణను చూరగొంది. పత్రికా రంగంలో విశ్లేషణ, విమర్శకుడిగా పేరు గడించిన దీక్షితులు మద్రాసు తెలుగు అకాడమీ నుంచి ఖాసా పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : వి.వాసుదేవ దీక్షితులు (76)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి రానున్నారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు కార్యరూపం దాలిస్తే తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె గుర్తింపు పొందుతారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : జస్టిస్ గండికోట శ్రీదేవి

సెస్ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ రేవతి
సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్) నూతన డెరైక్టర్‌గా ప్రొఫెసర్ రేవతి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న ప్రొఫెసర్ గాలబ్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (ఐడీఎస్) సంచాలకుడిగా నియమితులయ్యారు. ఈ సంస్థలు రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక సంబంధమైన మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ నూతన డెరైక్టర్
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ప్రొఫెసర్ రేవతి

యూపీ సీఎం యోగి ప్రచారంపై నిషేధం
ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీ సీఎం యోగి ప్రచారంపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ఎన్నికల సంఘం (ఈసీ)
ఎందుకు : ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు

అత్యంత ప్రభావశీలుర జాబితాలో ముకేశ్
2019 ఏడాదిగాను టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు 100 మంది’ జాబితాలో భారత్ నుంచి రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు చోటు లభించింది. ఈ మేరకు ఏప్రిల్ 17న టైమ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్‌హాజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్‌‌స, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు 100 మంది’ జాబితా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ముకేశ్ అంబానీ, అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి

 

పెరూ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య
పెరూ మాజీ అధ్యక్షుడు అలన్‌గార్షియా(69) ఏప్రిల్ 17న ఆత్మహత్య చేసుకున్నారు. ఓ అవినీతి కేసులో అలెన్ గార్షియాను పోలీసులు మరికాసేపటిలో అరెస్టు చేస్తారనగా...ఆయన హఠాత్తుగా తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెరూ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అలన్‌గార్షియా(69)

తెలంగాణ ఏసీజేగా చౌహాన్ బాధ్యతల స్వీకరణ
Current Affairs తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో జస్టిస్ చౌహాన్‌ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

ఏపీ ఏసీబీ డీజీగా శంఖబ్రత బాగ్చీ
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా శంఖబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న డీజీపీ ఆర్.పి.ఠాకూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఏసీబీ డెరైక్టర్‌గా బాగ్చీ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : శంఖబ్రత బాగ్చీ

ఏపీ కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఏపీ సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠను ఆ పదవి నుంచి ఈసీ తప్పించి, ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : ఎల్‌వీ సుబ్రహ్మణ్యం

సీఐఐ ప్రెసిడెంట్‌గా విక్రమ్ కిర్లోస్కర్
భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ/సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ విక్రమ్ కిర్లోస్కర్ నియమితులయ్యారు. భారతీ ఎంటర్‌ప్రెజైస్ వైస్ చైర్మన్ రాకేశ్ భారతీ మిట్టల్ స్థానంలో విక్రమ్ నూతన అధ్యక్షుని బాధ్యతలు చేపట్టినట్లు సీఐఐ ఏప్రిల్ 5న ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్‌గా టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఐఐ) నూతన ప్రెసిడెంట్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : విక్రమ్ కిర్లోస్కర్

నాస్కామ్ చైర్మన్‌గా కేశవ్ మురుగేష్
సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య ‘నాస్కామ్’ చైర్మన్‌గా డబ్ల్యుఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఆయన నియామకం జరిగినట్లు ఐటీ సంస్థల సమాఖ్య ఏప్రిల్ 5న ప్రకటించింది. ఇప్పటివరకు నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఉన్న మురుగేష్... విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : కేశవ్ మురుగేష్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా మాల్‌పాస్
ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా డేవిడ్ ఆర్. మాల్‌పాస్ ఏప్రిల్ 5న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 63 ఏళ్ల మాల్‌పాస్ ప్రపంచబ్యాంకు 13వ అధ్యక్షుడిగా అయిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం అమెరికా ఆర్థికశాఖలో అండర్ సెక్రెటరీ మాల్‌పాస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : డేవిడ్ ఆర్. మాల్‌పాస్

ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా లంకా వెంకట సుబ్రహ్మణ్యం (ఎల్వీ సుబ్రహ్మణ్యం) ఏప్రిల్ 6న బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఎస్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఐసీసీ నూతన అధ్యక్షునిగా విక్రమ్‌జిత్ సింగ్
ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) భారత విభాగానికి నూతన అధ్యక్షునిగా సన్ గ్రూప్ చైర్మన్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విక్రమ్‌జిత్ మాట్లాడుతూ... అంతర్జాతీయ వ్యాపారంలోని సవాళ్లు, నూతన అవకాశాలపై చర్చ జరపడం కోసం 2019, మే నెలలో పారిస్‌లో మెగా సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ భారత విభాగానికి నూతన అధ్యక్షుడు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే

రంగస్థల నటుడు బుర్రా కన్నుమూత
ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర, బుల్లితెరలపై సుపరిచితులయిన కళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83) హైదరాబాద్‌లో ఏప్రిల్ 7న కన్నుమూశారు. 1936, ఫిబ్రవరి 9న కృష్ణాజిల్లా దివి తాలుకా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించిన ఆయన కళా రంగంలో విశేష కృషి చేశారు. ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి వంటి పాత్రల్లో పాత్రల్లో నటించి ‘చింతామణి శాస్త్రి’గా గుర్తింపు పొందారు.
1970వ దశకంలో వీరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నాలాగా ఎందరో’అనే సినిమా ద్వారా సుబ్రహ్మణ్య శాస్త్రి వెండితెరకు పరిచయం అయ్యారు. సత్యసాయిబాబా నాటక సమాజాన్ని స్థాపించి అనేక ప్రదర్శనలను ఇచ్చిన ఆయన శిఖరం, పుత్తడిబొమ్మ, ఆడదే ఆధారం, రుద్రపీఠం సీరియళ్లలో నటించారు. ఈయన దర్శకత్వం వహించిన ‘కృష్ణాతీరం’అనే సీరియల్‌కు నంది అవార్డు వచ్చింది. మరోవైపు కవిగా వాల్మీకి రామాయణం, అష్టావిధ శృంగార నాయికలు(కావ్యం), త్యాగయ్య(నాటకం) వంటి వాటిని ర చించారు. దేవీ భాగవతం, హనుమత్‌చరిత్ర ప్రవచాలను కూడా ఆయన చె ప్పేవారు. నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రంగస్థల నటులు, కవి కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83)
ఎక్కడ : హైదరాబాద్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్
Current Affairs ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మార్చి 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కుమార్ విశ్వజిత్ ఇప్పటి వరకు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చెర్మైన్‌గా పనిచేశారు. ఇప్పటివరకు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ ఎన్నికల విధులనుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : కుమార్ విశ్వజిత్

Published date : 19 Apr 2019 06:28PM

Photo Stories