Skip to main content

ఏప్రిల్ 2017 వ్యక్తులు

Current Affairsసీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలకు నూతన డీజీలు
సీఆర్‌పీఎఫ్, ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న నూతన డెరైక్టర్ జనరల్‌లను నియమించింది. సీఆర్‌పీఎఫ్ డీజీగా 1983 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రాయ్ భట్నాగర్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాల డీజీగా 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆర్‌కే పచనంద నియమితులయ్యారు. ఇంతకముందు సీఆర్‌పీఎఫ్ డీజీగా ఉన్న దుర్గాప్రసాద్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయటంతో సుదీప్ లక్తాకియా తాత్కాలిక డీజీగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీకి నూతన డీజీలు
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : సీఆరపీఎఫ్ డీజీగా రాజీవ్ రాయ్ భట్నాగర్, ఐటీబీపీ డీజీగా పచనంద.

సృష్టి కౌర్‌కు మిస్ టీన్ యూనివర్స్ కిరీటం
భారతీయ టీనేజర్ సృష్టి కౌర్ మిస్ టీన్ యూనివర్స్ కిరీటం - 2017ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు నికరాగ్వాలోని మనాగ్వా నగరంలో ఏప్రిల్ 26న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఇదే పోటీల్లో ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ విభాగంలోనూ సృష్టి అవార్డుని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న యువతులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మిస్ టీన్ యూనివర్స్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : సృష్టి కౌర్
ఎక్కడ : నికరాగ్వా దేశంలోని మనాగ్వా

ఐఓసీ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ
ప్రతిష్టాత్మక ఒలింపిక్ చానల్ కమిషన్, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఓసీ ఏప్రిల్ 26న ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌తో ప్రారంభమైన చానల్‌లో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. దీనికి యునెటైడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్‌ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తారు. మాడ్రిడ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ చానల్ ఏడాది మొత్తం ఒలింపిక్ క్రీడలు, విలువలను ప్రమోట్ చేస్తుంది. 24 మంది సభ్యులు గల ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్‌లోనూ నీతా అంబానీ సభ్యురాలిగా కొనసాగుతారు. ఈ బృందానికి బారీ జాన్ మైస్టర్ (న్యూజిలాండ్) నేతృత్వం వహిస్తారు.
రిలయన్స్‌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన నీతా అంబానీ 2016లో ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికవడం ద్వారా ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐఓసీ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం

కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మను్ల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు, వివాదాల పరిష్కారం కోసం ఏర్పడిన కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలసంఘం పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్‌కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్‌కే సాహును చైర్మన్లుగా నియమిస్తూ కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకముందు ఎస్‌కే శ్రీవాత్సవ పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థారుులో విధులు నిర్వర్తించారు. హెచ్‌కే సాహూ తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మన్లు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : కృష్ణా బోర్డు - ఎస్‌కే శ్రీవాత్సవ. గోదావరి బోర్డు - హెచ్‌కే సాహూ
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల పరిష్కారానికి

బాలీవుడ్ నటుడు, ఎంపీ వినోద్ ఖన్నా కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు, లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా(70) ఏప్రిల్ 27న ముంబైలో కన్నుమూశారు. వినోద్ ఖన్నా 1968లో ‘మన్ కా మీత్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో కన్పించిన ఆయన 1971లో గుల్జార్ సినిమా ‘మేరే అప్నే’తో హీరోగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 2015లో షారూక్ ఖాన్ సినిమా దిల్‌వాలేలో నటించారు. రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవరించిన ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎక్కడ : ముంబై

పిచాయ్‌కు 198 మిలియన్ డాలర్ల గూగుల్ స్టాక్ అవార్డు
గూగుల్ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2016 ప్రతిఫలంగా (స్టాక్ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి 198.7 మిలియన్ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్ సంస్థ ఏప్రిల్ 28న అందజేసింది. 2015లో స్టాక్ అవార్డు(99.8 మిలియన్ డాలర్లు) కింద ఆయన అందుకున్న దానికి ఇది రెండింతలు. అలాగే పిచాయ్ 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు (4.22 కోట్లు) అందుకున్నారు.
సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్ బిజినెస్‌లు బాగా పెరిగారుు. అలాగే మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పిచాయ్‌కు 198 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : గూగుల్ సంస్థ
ఎందుకు : 2016లో సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా

టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్‌ను ఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో ఈవో పదవి చేపట్టిన మొట్టమొదటి ఉత్తరాది వ్యక్తిగా సింఘాల్ నిలిచారు.
ప్రస్తుత టీటీడీ ఈవో డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
టీటీడీ ఈవో నియామకం
ఎప్పుడు : మే 1
ఎవరు : అనిల్ కుమార్ సింఘాల్

సీఐఐ ప్రెసిడెంట్‌గా శోభన కామినేని
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్న శోభన కామినేని ప్రతిష్టాత్మక భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ/ సీఐఐ) చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు 2017-18 సంవత్సరానికి నూతన పాలక మండలిని సీఐఐ ఏప్రిల్ 30న ప్రకటించింది. శోభన ప్రస్తుతం కేఈఐ గ్రూపు వైస్ చైర్‌పర్సన్‌గానూ ఉన్నారు. కోటక్ మహింద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ సీఐఐ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సీఐఐ పాలకమండలి 2017-18
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : ప్రెసిడెంట్‌గా శోభన కామినేని

పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున్ ఖర్గే
పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ (Public Accounts Committee) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ కేవీ థామస్ పదవీకాలం ఏప్రిల్ 30న ముగియడంతో ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేత అధ్యక్షత వహించే ఈ కమిటీలో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పీఏసీ కొత్త చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 2
ఎవరు : మల్లిఖార్జున్ ఖర్గే
ఎందుకు : కేవీ థామస్ పదవీ కాలం ముగియడంతో

‘టైమ్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ
Current Affairs
ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చోటు సంపాదించారు. ఈ మేరకు 2017కు సంబంధించిన జాబితాను టైమ్ మేగజీన్ ఏప్రిల్ 20న విడుదల చేసింది.
ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాను టైమ్ మేగజిన్ ఎడిటర్లు రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తులు
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : టైమ్ మేగజిన్
ఎందుకు : ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినందుకు

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌పై దర్యాప్తుకు జిట్ ఏర్పాటు
పనామా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దర్యాప్తు జరిపేందుకు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్) ఏర్పాటైంది. ఈ మేరకు ఆ దేశ సుప్రీం కోర్టు ఏప్రిల్ 20న జిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజెన్‌‌స, ఎఫ్‌ఐఏ, ఎన్‌ఏబీ, సెక్యూరిటీ, ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సహా కీలక సంస్థలకు చెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. షరీఫ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ జిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌పై దర్యాప్తుకు జిట్ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : పాకిస్తాన్ సుప్రీంకోర్టు
ఎందుకు : పనామా పత్రాల కేసులో

భారత మహిళల క్రికెట్ కోచ్‌గా తుషార్ అరోథే
భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమా రావును తప్పిస్తూ బీసీసీఐ ఏప్రిల్ 21న నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోథేను హెడ్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. 2017 జూన్‌లో భారత్‌లో మహిళల ప్రపంచ క్రికెట్ కప్ జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మహిళల క్రికెట్ కోచ్ గా తుషార్ అరోథే
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : పూర్ణిమా రావు స్థానంలో నియామకం

అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపినవ్యోమగామిపెగ్గీ విట్సన్
నాసాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ క్రమం తప్పకుండా ఎక్కువ రోజులపాటు అంతరిక్షం (స్పేస్)లో గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు గతంలో 534 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన జెఫ్ విలియమ్స్ రికార్డును పెగ్గీ ఏప్రిల్ 24న అధిగమించారు. ఆమె భూమికి తిరిగొచ్చే సమయానికి అంతరిక్షంలో 650 రోజులు గడిపిన వ్యోమగామిగా మరో రికార్డును నెలకొల్పుతారని నాసా ప్రకటించింది. దాదాపు 53 గంటలపాటు నిర్విరామంగా స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామి రికార్డు కూడా పెగ్గీ పేరిటే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగామి
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : పెగ్గీ విట్సన్
ఎక్కడ : నాసా

గాంధీ ఇన్ చంపారన్ పుస్తకావిష్కరణ
డీజీ టెండూల్కర్ ర చించిన "గాంధీ ఇన్ చంపారన్ " పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏప్రిల్ 9న ఆవిష్కరించారు. సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీ అవలంబించిన విధానాలను, ఆయన జీవిత లక్ష్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
డీజీ టెండూల్కర్ ఇది వరకే Mahatma: Life of Mohandas Karamchand Gandhi పేరుతో గాంధీజీ జీవిత చరిత్రను రచించారు. ఇది 8 సంపుటాల్లో విడుదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గాంధీ ఇన్ చంపారన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : రచయిత డిజీ టెండూల్కర్
ఎక్కడ : న్యూఢిల్లీలో

యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్‌గా అచిమ్ స్టెయినర్
Current Affairs ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల్లో అపార అనుభవం ఉన్న అచిమ్ స్టెయినర్ యూఎన్‌డీపీ (United Nations Development Programme) అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటై ఏప్రిల్ 13న ప్రకటించారు. యూఎన్‌డీపీ కేంద్ర కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఇది ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌డీపీకి కొత్త అడ్మినిస్ట్రేటర్
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : అచిమ్ స్టెయినర్
ఎక్కడ : యూఎన్‌డీపీ, న్యూయార్క్

కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ మృతి
ఇంటర్‌నెట్‌కు బీజం వేయటంతో పాటు పర్సనల్ కంప్యూటర్‌ను అభివృద్ధి పరచటంలో కీలక పాత్ర పోషించిన కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ (85) ఏప్రిల్ 16న అమెరికాలో కన్నుమూశారు. ఆయన 1966లో పెంటగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న సమయంలో సహోద్యోగులతో సంభాషించేందుకు తన నేతృత్వంలో అర్ఫానెట్‌ను సృష్టించి అన్ని కంప్యూటర్లను అనుసంధానం చేశారు. తదనంతర కాలంలో అదే ఇంటర్‌నెట్‌గా పరిణామం చెందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : అర్ఫానెట్ సృష్టికర్త
ఎక్కడ : అమెరికా

టైమ్-100 రీడర్స్ పోల్‌లో డ్యుటెర్టోకు అగ్రస్థానం
‘టైమ్-100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్‌లో ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం జరిపిన పోల్ ఫలితాలను టైమ్ సంస్థ ఏప్రిల్ 17న వెల్లడించింది. ఇందులో డ్యుటెర్టోకు అత్యధికంగా 5 శాతం ఓట్లు రాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు 3% చొప్పున వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టైమ్-100’ ప్రభావశీల వ్యక్తులు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : తొలిస్థానంలో రొడ్రిగో డ్యుటెర్టో
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఫోర్బ్స్ 30 జాబితాలో 53 మంది భారతీయులు
ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా’ జాబితాలో 53 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు వివిధ రంగాల్లో సత్తా చాటిన 30 ఏళ్లలోపు యువ అఛీవర్స్ జాబితాను ఫోర్బ్స్ ఏప్రిల్ 17న విడుదల చేసింది.
వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు ఇలా పది రంగాల్లో 30 మంది చొప్పున 300 మందితో ఈ జాబితా రూపొందించింది. ఇందులో భారత్ నుంచి దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, ఆలియాభట్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన రోహిత్ పోతుకూచి, కరీంనగర్‌కు చెందిన చిలప్పగరి సుధీంద్ర తదితరులున్నారు. చైనా నుంచి 76 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 30 అండర్ 30 ఆసియా జాబితా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఫోర్బ్స్
ఎక్కడ : భారత్ నుంచి 53 మందికి చోటు
ఎందుకు : వివిధ రంగాల్లో సత్తా చాటినందుకు

రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా అరెస్టు
వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌తో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని స్కాట్‌లాండ్ పోలీసులు తెలిపారు. అయితే అరెస్టయిన గంటలోపే వెస్ట్‌మినిస్టర్ కోర్టు మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఫిబ్రవరి 8న అధికారికంగా విజ్ఞప్తి చేసింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాల కొనుగోలుకు ఐడీబీఐ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియా బ్యాంక్‌ల నుంచి వేల కోట్ల అప్పు తీసుకున్న మాల్యా వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్‌‌సకు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ యునెటైడ్ బ్రూవరీస్‌కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం అల్టిమేటం జారీ చేసింది. అయినా అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. దీంతో 2016లో మాల్యా లండన్ పారిపోయాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయ్ మాల్యా అరెస్టు
ఎప్పుడు : ఎప్రిల్ 18
ఎవరు : స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు
ఎక్కడ : లండన్
ఎందుకు : భారత్‌లో వేల కోట్లు రుణం ఎగవేసినందుకు

షీలా పటేల్‌కు ఐక్యరాజ్యసమితి పదవి
పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్పార్క్ (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్ సెంటర్స్) వ్యవస్థాపకురాలు షీలా పటేల్ ఏప్రిల్ 13న ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా మృతి
భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా (56) ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.

శిల్పకారుడు నందగోపాల్ కన్నుమూత
ప్రతిముఖ శిల్పకారుడు ఎస్.నందగోపాల్ (71) అనారోగ్యంతో ఏప్రిల్ 14న చెన్నైలో మరణించారు. ఆయనకు 1970లో జాతీయ అవార్డు, 1978లో లలిత కళా అకాడమీ అవార్డు దక్కాయి.

19వ శతాబ్దపు చివరి వ్యక్తిమార్టినా మోరానో
ప్రతిపంచంలోనే అత్యధిక వయస్సున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో (117) ఇటలీలోని వెర్బానియాలో ఏప్రిల్ 15న మరణించారు. 1899, నవంబర్ 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్
ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ సంస్థ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్ వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆర్. చంద్రశేఖర్ నాస్కామ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
నాస్కామ్ నూతన పాలకవర్గం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : ఛైర్మన్‌గా రామన్ రాయ్

కేసుల తీర్పుల్లో యూపీ న్యాయమూర్తి గిన్నిస్ రికార్డ్
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు న్యాయమూర్తి తేజ్ బహదూర్ సింగ్ 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డ్డు సృష్టించారు. ఈ మేరకు సింగ్ ఘనతను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ఏప్రిల్ 7న ధ్రువీకరించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కేసులను పరిష్కరించడం దేశంలోనే తొలిసారని బార్ అసోసియేషన్ తెలిపింది. కాగా సింగ్ పరిష్కార తీర్పుతో 903 జంటలు తిరిగి ఒక్కటయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కేసుల పరిష్కారంలో గిన్నిస్ రికార్డ్
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : న్యాయమూర్తి తేజ్ బహదూర్ సింగ్
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు
ఎందుకు : 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కారం

ఐరాస శాంతిదూతగా మలాలా
Current Affairs బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (19) ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏప్రిల్ 8న ప్రకటించారు. దీంతో యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐరాస శాంతిదూత హోదా
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : మలాలా యూసఫ్‌జాయ్
ఎక్కడ : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : ఐరాస కార్యకలాపాలను ప్రచారం చేసేందుకు

శివసేన ఎంపీ గైక్వాడ్‌పై ఎఫ్‌ఐఏ నిషేధం ఎత్తివేత
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 9న ఎత్తివేసింది. మార్చి 23న విమానం సీటు విషయంలో గైక్వాడ్ ఆవేశంతో ఎన్స్ర్ ఇండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టారు. దీంతో ఎన్స్ర్ ఇండియాతోపాటు ప్రైవేటు విమానయాన సంస్థలు గైక్వాడ్ ప్రయాణంపై నిషేధం విధించాన్స్. అయితే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్స్రిండియా సంస్థకు పౌరవిమానయాన శాఖ లేఖ రాయడంతో ఆయనపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
శివసేన ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్

ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా రమణారావు
టీఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు అండర్‌టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్‌టీయూ) స్థాయి సంఘం చైర్‌పర్సన్‌గా ఏప్రిల్ 10న నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. సంఘంలో 15 మంది సభ్యులు ఉంటారు.
రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయాల్సిన నిబంధనలు రూపొందించడంలో ఈ స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు రవాణా సంస్థలకు సూచనలు ఇవ్వడంతోపాటు అత్యంత కీలకమైన రవాణా విధానం రూపొందించటంలో కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : టీఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు
ఎక్కడ : న్యూఢిల్లీ

సుమిత్రా మహాజన్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాసిన "మాతోశ్రీ" పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న పార్లమెంట్ గ్రంథాలయ బిల్డింగ్‌లో ఆవిష్కరించారు. 1767 నుంచి 1795 మధ్య మాల్వా ప్రాంతంలో విస్తరించిన హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించిన దేవీ అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని, నాటి పరిస్థితులను సుమిత్రా మహాజన్ పుస్తకంలో వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మాతోశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : రచయిత సుమిత్రా మహాజన్
ఎక్కడ : పార్లమెంటులో

కర్ణాటక మాజీ సీఎంలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ గనుల తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ఎన్.ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామిల పాత్రపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ మార్చి 29న ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. దీంతో బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలో మీటర్ల అటవీ భూమిని డీ-రిజర్వ్ చేసిన విషయంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతోపాటు మరికొందరు అధికారులపై విచారణ సాగనుంది. మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణకు మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కర్ణాటక మాజీ సీఎంలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : ఎన్.ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామి
ఎందుకు : అక్రమ గనుల తవ్వకాల కేసులో

ఎస్‌ఐగా నియమితులైన తొలి హిజ్రా
Current Affairs తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారం
భారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్-2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ బజ్‌ఫీడ్ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటిస్థానంలో నిలవగా ప్రముఖ మోడల్ టేలర్ హిల్ మూడోస్థానం దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : బజ్‌ఫీడ్ సోషల్ మీడియా నెట్‌వర్క్

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా బి.పి. కనుంగో ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్న ఆయన కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన కనుంగొ
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎందుకు : కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ విభాగాల పర్యవేక్షణకు

హిందుస్తానీ గాయకురాలు అమోంకర్ మృతి
ప్రముఖ హిందుస్తానీ గాయకురాలు కిశోరీ అమోంకర్ (84) ఏప్రిల్ 3న ముంబైలో కన్నుమూశారు. 1932లో జన్మించిన అమోంకర్ గాయకురాలైన తన తల్లి మోగుబాయి కుర్దికర్ నుంచి తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ఆమె 1987లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హిందుస్తానీ గాయకురాలు అమోంకర్ మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎక్కడ : ముంబై

ఈక్వెడార్ అధ్యక్షుడిగా లెనిన్ మారెనో
ఈక్వెడార్ అధ్యక్షుడిగా పెయిస్ అలయెన్స్ పార్టీకి చెందిన లెనిన్ మారినో ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లెనిన్‌కు 51.16 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి గిల్లర్‌మో లాస్సో (కన్జర్వేటివ్ పార్టీ)కు 48.04 శాతం ఓట్ల వచ్చాయి.
లెనిన్ మారినో 2007 నుంచి 2013 వరకూ ఈక్వెడార్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అధ్యక్షుడిగా లెనిన్ మారెనో

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రాజీవ్ కుమార్
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కుమార్ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 4న విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 1983 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ 2006 నుంచి 2009 వరకు ఐరాసలో భారత మిషన్ డిప్యూటీ పర్మనెంట్ మెంబర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రాజీవ్ కుమార్ చందర్
ఎక్కడ : జెనీవా
Published date : 08 Apr 2017 12:40PM

Photo Stories