Covid-19: ఇటీవల కన్నుమూసిన కొలిన్ పావెల్ ఏ దేశస్థుడు?
అమెరికా మాజీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కొలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ కారణంగా అక్టోబర్ 18న మేరిల్యాండ్ రాష్ట్రంలోని బెథెస్డాలో తుదిశ్వాస విడిచారు. అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇరాక్‌పై యుద్ధాన్ని సమర్థించుకునే క్రమంలో అపప్రథ మూటగట్టుకున్నారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన దేశాధ్యక్షుల హయాంలో ఆయన సమర్థవంతమైన సేవలందించారు.
హత్యకు గురైన బ్రిటిష్ ఎంపీ
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ డేవిడ్ అమెస్(69)ను ఓ దుండగుడు అక్టోబర్ 15న కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఎస్సెక్స్‌లోని బెల్‌ఫెయిర్స్ మెథడిస్టు చర్చిలో ఈ ఘటన జరిగింది.
చదవండి: ఇటీవల కన్నుమూసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : కొలిన్ పావెల్(84)
ఎక్కడ : బెథెస్డా, మేరిల్యాండ్ రాష్ట్రం, అమెరికా
ఎందుకు : కోవిడ్ వైరస్ కారణంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్