Chief Minister of Goa: గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత?
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. బాంబోలిమ్ నగరంలోని ఒక స్టేడియంలో మార్చి 28న జరిగిన కార్యక్రమంలో సావంత్ చేత గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సావంత్ బల పరీక్షలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.
Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
గోవా అసెంబ్లీ స్పీకర్‌గానూ..
1973, ఏప్రిల్ 24న గోవాలో జన్మించిన ప్రమోద్ సావంత్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌లో పనిచేసిన ఆయన బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర గోవాలోని సంఖాలిమ్ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా 2022 ఏడాది ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోవా అసెంబ్లీ స్పీకర్‌గా 2017, మార్చి 22 నుంచి 2019, మార్చి 18 వరకు పనిచేశారు. 2019, మార్చి 19న తొలిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Chief Ministers of Uttar Pradesh: యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత?
ఇటీవల గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 20 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
గోవా ఎన్నికల ఫలితాలు (మొత్తం సీట్లు 40) |
||
పార్టీ |
సంవత్సరం |
|
|
2022 |
2017 |
బీజేపీ |
20 |
13 |
కాంగ్రెస్ |
11 |
17 |
ఆమ్ ఆద్మీ పార్టీ |
2 |
0 |
ఎంజీపీ |
2 |
3 |
తృణమూల్ |
1 |
0 |
ఎన్సీపీ |
0 |
1 |
జీఎఫ్‌పీ |
1 |
3 |
ఇతరులు |
3 |
3 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : బీజేపీ నేత ప్రమోద్ సావంత్
ఎక్కడ : బాంబోలిమ్, గోవా
ఎందుకు : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 20 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో..