Skip to main content

Tamil Nadu: కూలిన ఆర్మీ హెలికాఫ్టర్‌.. హెలికాఫ్టర్‌లో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌..

h1

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జ‌న‌ర‌ల్ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు అటవీప్రాంతంలో డిసెంబ‌ర్ 8న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

h3h2

అకస్మాత్తుగా చెట్లపై..

కూనూరు అటవీప్రాంతలో జ‌న‌ర‌ల్ బిపిన్‌ రావత్ఎం ఐ-17 చాపర్‌ అకస్మాత్తుగా చెట్లపై కూలిపోయింది. ఈ క్రమంలో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. సైనికులు మంటల్లోంచి ముగ్గురుని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. రెండు మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం.h4

ప్రమాదం సమయంలో 14 మంది..

బిపిన్‌ రావత్‌ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌. ఇది 4వేల పేలోడ్‌ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నట్లు తెలిసింది. 4వేల పేలోడ్‌ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌. బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్‌లు ఉన్నాయి.

h5

 

Published date : 08 Dec 2021 02:18PM

Photo Stories