Mekapati Goutham Reddy: ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు.
కాగా 1971 నవంబర్2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచిఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.
Published date : 21 Feb 2022 10:02AM